కిరణోదయం

గిరిజకి అమ్మ వద్దనుండి ఫోను వచ్చింది.”హలో! గిరిజా సంక్రాంతి పండక్కి నువ్వూ గాయత్రి వస్తే బాగుంటుంది.తనకి కూడా చెప్తాను. మూడేళ్ళయింది మీరంతా వచ్చి అన్నయ్యకి రావటానికి వీలు పడదన్నాడు.మీరిద్దరూ రావడానికి ప్రయంతించండి. అల్లుడు కూడా శలవు పెట్టి వస్తే మాకు సంతోషం.అరుణ్ ఎలా వున్నాడు?”అమ్మ కామా పుల్ స్తాపు లేకుండా చెప్పేసింది .
“సరే రావటానికి ప్రయత్నిస్తాను.నాన్నా నువ్వూ బాగున్నారుకదా?”
గాయత్రి వీలు కాదంది , మా వారు శలవు లేదన్నారు. నేనయినా అరుణ్ ని తీసుకుని వెళ్తే అమ్మా నాన్నా సంతోషిస్తారని పండగ నాలుగు రోజులుందనగా బయలు దేరాను. మా వూరు చేరగానే అమ్మని అడిగిన మొదటి ప్రశ్న జానకి ఎలా వుందని.
“ఏమోనే నాకూ వెళ్ళటానికి వీలుంపడటం లేదు.వెంకటాద్రి మామయ్య పోయాక నాన్న వెళ్ళటం తగ్గించేశారు. నేను ఏ పూజకో పేరంటానికో బయటకు వెళ్తే ఒక సారి వాళ్ళింటికి వెళ్తుంటాను.”

మర్నాడు జానకి యింటికి వెళ్ళాను.జానకి పెద్ద కొడుకు తలుపు తీశాడు.”అమ్మేదిరా?’అనగానే అమ్మమ్మా! గిరిజత్తయ్య వచ్చింది చూడు.”అని లోపలికి వెళిపోయాడు.కమలత్తయ్య వచ్చి “ఎప్పుడొచ్చావు గిరిజా?”అంది ?నిన్ననే అత్తయ్యా జానకేదీ?” “యింట్లో లేదమ్మా పని మీద వెళ్ళింది.రావడానికి టైము పట్టవచ్చు. యింట్లోకి రమ్మన లేదు కూర్చోమనలేదు. ఏమయింది అత్తయ్య యిలా ప్రవర్తిస్తున్నాది.అనుకుంటూ “సరే నేను వచ్చానని జానకికి చెప్పు తరువాత వస్తాను” అని వచ్చేశాను.

ఇంటికి వచ్చి విషయం అమ్మకి చెప్పి “ఆశ్చర్యంగా వుంది ,జానకి యింట్లో లేకపోతే కనీసం నన్ను యింట్లోకి రమ్మన లేదు. మన రెండిళ్ళమధ్య వున్న యింత స్నేహం ఏమయిందమ్మా?”అంటూ వాపోయాను.”పోనీలే మామయ్య పోయినప్పటినుండి అత్తయ్య చాల ఒంటరి అయిపోయింది. అందుకే అలా ప్రవర్తించి వుండవచ్చు.తాపీగా కనుక్కుందాంలే”

జానకి గిరిజ స్నేహితులు క్లాసుమేట్లు, యింతే కాక గిరిజ తండ్రి జానికి తండ్రి క్లాసుమేట్లు.ఏనాటి స్నేహమో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించుకోవడమే తప్ప ముఖం తిప్పుకోవడాలు ఎప్పుడు జరగలేదు.

ఈ సంఘటన పక్కన పెట్టి పండుగ పనుల్లో సహాయం చేయసాగింది గిరిజ.పండుగ నాడు “పసుపు కుంకుమ పళ్ళు యిచ్చి వద్దాం వస్తావా?”అని తల్లి అడిగితే “యింటికి వచ్చే ముత్తయిదువులకు నేను తాంబూలం యిస్తాను.నువ్వెళ్ళి రామ్మా”అన్నాను.

రెండో వీధిలో వుండే జానకి యింటికే బయలు దేరింది సరస్వతి.తలుపు తట్టగానే కమలమ్మ తలుపు తీసింది,”రా వదినా బాగున్నావా?గిరిజ రాలేదా?””లేదు పిల్లడు ఒక్కడే యింట్లో వుండాలి అందుకే రాలేదు.అన్నట్లు జానకి ఏదీ బొట్టు పెట్టి తాంబూలం యిస్తాను.”

చేయి పట్టుకుని మూల గదిలోకి తీసుకెళ్ళి “ఏం చెప్పమంటావు వదినా, అల్లుడి ప్రవర్తన ఉప్పూ నిప్పూలా వుంది.జానకిని చూస్తే మండి పడుతున్నాడు.ఆరోజు జానకి వచ్చినప్పటికి మూడు రోజులనుంచి ఘర్షణ నడుస్తోంది. పిల్ల తిండి నిద్ర మరిచి కంటికీ మింటికీ ఏడుస్తోంది.పెద్దరికం వున్నా ఆడదాన్ని ఏమీ మాట్లాడలేకపోతున్నాను. మీ అన్నయ్య వుంటే ఏం పరిష్కారం చేసే వారో.ఒక్కగానొక్క పిల్ల అని రాఘవని యిల్లరికం తెచ్చుకున్నాం.ఏడాదికొకరు చొప్పున ముగ్గురు కొడుకులు పుట్టారు.అంతా బాగుందనుకుంటున్న సమయంలో శని దాపురించింది. రెండు నెలలై ఎవ్వరికీ మనశ్శాంతి లేదు.

“కారణం ఏమిటి వదినా? నాకు చెప్పు మీ అన్నయ్య రాఘవని మందలిస్తారు.”
“అబ్బో రాఘవ యిప్పుడు చాలా ఎత్తుకెదిగిపోయాడు వదినా ఎవరి మాటలు వినే స్థితిలో లేడు తను చెప్పిందే వేదం.యింక మా యింట పండుగ పున్నం లేదులా వుంది.”

శాంతంగా కూర్చోబెట్టి అసలు విషయం తెలుసుకుంది సరస్వతి.జానకికి మూడో అబ్బాయి పుట్టగానే రాఘవ వేసక్టమీ ఆపరేషను చేయించుకున్నాడు.అదో పెద్ద వార్తలా పల్లెటూర్లో బాగానే ప్రచారమైంది. చిన్నవాడు ఎనిమిదేళ్ళ వాడయాక జానకి గర్భవతైంది.రెండు నెలలయేదాకా ఏమీ అనుకోలేదు.తరువాత నర్సు పరీక్షించి నిర్ధారణగా తెలిపింది.అప్పటినుంచి యింట్లో తుఫాను మొదలైంది.తను ఆపరేషను చేయించుకున్నాక జానకి గర్భవతెలా అయిందని రోజూ గొడవ.ముగ్గురు బిడ్డల తల్లిని అనుమానించటం పాపం అని ఏడ్చినా జాలి కలగలేదు.

రోజూ ఏదో ఒక సందర్భంలో మాటల యీటెలతో జానకిని బాధ పెట్టడం,ఎవరితోనూ మాటా పలుకూ లేకుండా బయట తిరిగి రావటం చేస్తున్నాడు రాఘవ. జానకి వేసే ఒట్లు సత్యాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.

విషయాలన్నీవిన్నాక  సరస్వతి అడిగింది”జానకి ఏదీ?
“ఈ రెండు నెలలై స్టొర్ రూములో వుండటం పడుక్కోవడం చేస్తున్నాది.వంట పని చూసి లోపలికెళిపోతోంది.నేనే అల్లుడికి పిల్లలకి అన్నం పెడుతున్నాను పిల్లలు యీ పరిస్థితి చూసి బెంగ పడిపోతున్నారు.నాకు దారీ తెన్నూ కనిపించటం లేదు.ఈ వార్త బయటికి పొక్కితే దావానలంలా వ్యాపించి మా కుటుంబాన్ని రాబందుల్లా పీక్కు తింటారు.అందరం కట్టగట్టుకు ఏ గంగలోనో దూకడం మినహా గత్యంతరం లేదు వదినా.” అంటూ భర్త పోయిన నాటి కన్న ఎక్కువ దుఖంతో చెప్పింది కమలమ్మ.

తిన్నగా స్టొరులోకెళ్ళింది సరస్వతి. అశోకవనంలో సీతలాగే అనిపించింది జానకి. ముగ్గురు బిడ్డల తల్లయినా పచ్చగా పసిడి బొమ్మలా వుండే జానకి నలుపు రంగుకి మారి కళ్ళ చుట్టూ మసి పూసినట్ట్లయి జీవం లేనట్ట్లుంది. “జానకీ” అనగానే సరస్వతిని అల్లుకుపోయి “అత్తయ్యా! నా ముఖం అందరికీ ఎలా చూపించను? నేను నిర్దోషినని ఎలా నిరూపించుకో గలను? గిరిజ వచ్చిందని తెలిసినా బయటకు వచ్చి స్నేహితురాలిని పలుకరించలేని అశక్తత.ఏం చూసుకుని బ్రతకాలి?”బావురుమంది.

” వూరుకో జానకీ ఏడవకు.నీ కొడుకుల్ని చూసుకుని బ్రతకాలి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకోసం బ్రతకాలి.నేను చెప్పేది జాగ్రత్తగా విను.యిలా అధైర్యంగా బేలగా ఏడుస్తుంటే నీ భర్త ఎప్పటికీ నువ్వు నిర్దోషివనుకోడు.నువ్వు అమాయకురాలివి, నువ్వు ఏ తప్పు చేయలేదు ఊరందరూ ఆమాట ఒప్పుకోగలరు అందులో ఏమీ సందేహం లేదు. నీ భర్తకి ఒక్కటే చెప్పు పట్నం వెళ్ళి పెద్ద హాస్పిటల్ లో యీ పరిస్థితి వివరించితే ,తన ఆపరేషను విఫలమయిందా లేదా అన్నది వాళ్ళు పరీక్షించి చెపుతారు. బిడ్డ పుట్టిన తరువాత ఒక పరీక్ష వుంటుంది.అది తండ్రీ బిడ్డలిద్దరికీ చేస్తారు.అదికూడా చేయించుకోమను.వీటి ఫలితాలని బట్టి నీకు ఏ శిక్ష వేసినా భరిస్తాననిచెప్పు.కనీసం తన పరీక్ష అయేదాకా శాంతంగా వుండమను.ఏమీ భయపడకుండా నిలిచి పోరాడు,నీవెనుక మేమంతా వున్నాం.అంటూ బొట్టు పెట్టి తాంబూలం యిచ్చి కమలమ్మకి కూడా ధైర్యం చెప్పి, మరింకే యింటికి వెళ్ళే మనసు లేక యిల్లు చేరింది సరస్వతి.

తల్లి చెప్పిన విషయం విని గిరిజ నిర్ఘాంతపోయింది.ఎంత అన్యోన్య దాంపత్యామైనా నమ్మకం తగ్గగానే బ్రతుకు నరకం అయిపోతుందన్నదానికి జానకి నిదర్శనం. మూడొ నాడే తన ప్రయాణం వెళ్ళి కలుసుకోవాలా వద్దా అని మీమాంస పడింది. అమ్మ చెప్పినట్లు అమలు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది.తను వెళ్ళి బాధని కెలకడం ఎందుకని ఊరు ప్రయాణమైంది.

మరుచటి వారం అమ్మ ఫోను చేసింది రాఘవ పట్నం వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఆపరేషను విఫలమైందని ,యిటువంటి సంఘటనలు వేలలో ఒకటి సంభవించవచ్చని భార్యని అనుమానించకుండా జాగ్రత్తగా చూసుకోమని పెద్ద దాక్టరు చెప్పారుట.అప్పటినుంచి రాఘవ కాస్త శాంత పడ్డాడుట. అమ్మయ్య! కొంత నిశ్చింత అనిపించింది.పాపం జానకి ఈ పరిస్థితి నెలా భరించిందో.నిజంగా భూదేవికున్నంత సహనం వుందనుకున్నాను.

తొమ్మిదినెలలు నిండగానే పట్నం తీసుకెళ్ళి హాస్పిటల్లో పురుడు పోసుకున్నాక డాక్టరు సలహా మీద జానకికి ఆపరేషను చేయించారు. ఆడపిల్ల పుట్టింది.మూడోనాడు డి ఎన్ ఎ పరీక్ష చేసి రాఘవే ఆ బిడ్డకి తండ్రి అని సర్టిఫికేట్ యిచ్చారు.అది చూశాక రాఘవ చాలా సిగ్గు పడ్డాడు,చదుకున్న తనే మూర్ఖుడిలా ప్రవర్తిస్తే యిక చదువులేని వాళ్ళ సంగతేమిటి అని జానకికి పదే పదే క్షమాపణ చెప్పాడు.

కారు మబ్బులు విడిచినట్లుందని తల్లితో అంది జానకి.”అమ్మా అసలు జానకి ఆరు నెలలు పరాయి యింట చెరలో వుంటే నా యింట్లోనే నేను ఏడు నెలలు చెరలో వున్నాను.నాచెర విడిచినా ఊర్లో యీ సర్టిఫికేటు చూపిస్తూ తిరగం కదా, యీ బిడ్డని గూర్చి ఏమని చెప్పాలి?”

అక్కడే వున్న రాఘవ”యీ విషయంలో నువ్వేమీ చింత పడకు.వూర్లోవాళ్ళకి చెప్పడం నావంతు.”నిశ్చింతగా వూపిరి తీసుకుంది జానకి.

“పిచ్చిదానా అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే వుంటారు.వాళ్ళకి కూడా తెలియాలి అప్పుడప్పుడు యిటువంటి విడ్డూరాలు కూడా జరుగుతుంటాయని.”తల్లి జానకిని ఓదార్చింది.

అనుకోకుండా గిరిజ పుట్టింటికి వచ్చింది.జానకిని అభినందించి,”నీ జాతకంలో ఆడపిల్ల రాసి పెట్టి వుంటుంది.ఎంత కాదనుకున్నా డాక్టర్లని సవాల్ చేస్తూ యీ పాప పుట్టింది.ఏం పేరు పెడతావ్?బాలసార ఘనంగా చెయ్యి.జరిగిందంతా పీడకలలా మర్చిపో.”అంటూ స్నేహితురాలిని వుత్సాహ పరిచింది గిరిజ.వీళ్ళ మాటలు విన్న రాఘవ “నాలాంటి మూర్ఖుడు మరొకడుండడు. యిన్నాళ్ళూ కలిసి బ్రతికి ఎంత హీనంగా ప్రవర్తించానో గుర్తుకొస్తే నా మీద నాకే అసహ్యమేస్తోంది. సరైన సమయంలో మీ అమ్మగారు సలహా యివ్వకుంటే యీ సంసారం ఛిన్నాభిన్నమైపోయి వుండును.”

బాలసారనాడు నామకరణం చేస్తూ”కిరణ్మయి”అని పేరు పెట్టాడు.కొంత విషయం ముందుగానే తెలిసినా వచ్చిన బంధువులకు స్నేహితులకు తన కధ వినిపించి, ఎప్పుడయినా యిటువంటివి సంభవించినప్పుడు మనో ధైర్యం వీడకుండా ప్రవర్తిస్తే చాలా బాగుంటుది. చంటి బిడ్డని ఎత్తుకుని ముద్దాడుతూ పై మాటలు చెప్పాడు. జానకిలోని బెరుకు పోయి వెన్నెలకురిసినట్లు మల్లెలు విరిసినట్లు నవ్వింది.

Advertisements

ఒక రోజు నా తెలుగు క్లాసు

నేను తొమ్మిదో క్లాసు చదివుతున్న రోజులు. మా తెలుగు మాష్టారి క్లాసంటే మా అందరికీ చాలా యిష్టం.పద్యమైనా గద్యమైనా ఎంతో ఆసక్తికరంగా చెప్తూ విద్యార్ధులు తల తిప్పకుండా వినేలా చేయగల నేర్పు అతనిలో వుండేది.ఆ రోజు క్లాసులో పాండవుల అజ్ఞాత వాసం పాఠ్యాంశం చెపుతున్నారు. క్లాసులో నలభై మంది విద్యార్ధులలో నేనొక్కర్తినే అమ్మాయిని.నేనొక్కర్తినే  ఒక బెంచి మీద కూర్చునేదాన్ని.పాఠం చాలా ఆసక్తికరంగా చెప్తున్నారు.
అనుకోకుండా బెంచి కొసలో ఏదో కదలుతున్నట్ట్లుంటే నా దృష్తి దాని మీద పడింది. కందిరీగ కన్న చిన్న కీటకం ఆ కోవకి చెందినదే కాళ్ళతో చిన్న మట్టి వుండ తెచ్చి అంతకు ముందు నుంచీ కడుతున్న యింటికి చేర్చి కాళ్ళతో తడుతూ గోడలా కడుతోంది. మధ్య మధ్యలో నోటి తడిని కాలితో తీస్తూ రెండు కాళ్ళని చేతులలా వుపయోగిస్తూ పల్చటి గోడ కడుతూంటే గమ్మత్తుగా అనిపించి పరిసరాల్ని మరిచి ఆ దృశ్యాన్ని చూస్తున్నాను.మా మాష్టారు నా పరధ్యానం గమనించి చెప్పులు విడిచి అడుగుల చప్పుడు కాకుండా నా వెనుక కి వచ్చి నేను చూస్తున్నదేమిటా అని చూశారుట.(ఈ విషయం తరువాత మిగతా వారి ద్వారా తెలిసింది) ఒకప్రశ్న వేసి “హైమవతీ నువ్వు చెప్పు”అన్నారు గట్టిగా.తుళ్ళి పడి లేచి నిలుచున్నాను. క్లాసులో పరధ్యానంగా వుంటే పరీక్ష రిజల్టు పరాధీనమవుతుంది.ఏమిటంత దీక్షగా చూస్తున్నావు?”గద్దించారు. కాస్త తడబడ్డాను,”కందిరీగలాంటి కీటకం మట్టితో యిల్లు కట్టుకుంటూ వుంటే విచిత్రంగా అనిపించి చూస్తున్నాను మాష్టారూ.”

అమ్మా!క్లాసులో పాఠాలు సరిగా వినకుండా ప్రకృతి పర్యావలోకనం చేస్తుంటే పెద్దై మట్టిళ్ళు కట్టుకోవాలి.”
క్షమించండి మాస్టారూ తప్పైపోయింది,”
“సరే నా ప్రశ్నకి సమాధానమివ్వు”
“అడగండి మాష్టారూ”
“విరటుని కొలువులో సైరంధ్రి ఏ పేరుతో పరిచయమైంది?”

పిల్లలంతా ఘొల్లున నవ్వారు. “సైలెన్స్! ఏమయింది?” నాకు నవ్వు వచ్చినా ఆపుకుని “మీ ప్రశ్నలోనే సమాధానముంది మాష్టారూ”
“అలాగా ప్రశ్న ఎలా వుండాలి?”
“విరటుని కొలువులో ద్రౌపది ఏ పేరుతో పరిచయమయింది అని వుండాలి.””నేనూ అదే అడిగాను”మీరు సైరంధ్రి ఏ పేరుతో పరిచయం అయిందని అడిగారు సార్”
చూశారా పిల్లలూ ! క్లాసులో మీరు పరధ్యానంగా వుంటే మా ధ్యానం కూడా చెదురుతుంది. తెలిసిందా? ఇంకెప్పుడూ క్లాసులో కూర్చుని కాకుల్ని కందిరీగల్ని గమనించకండి.”అంటూ సున్నితంగా మందలించారు. అతని మందలింపులో కూడా సున్నితమైన హాస్యం తొణికిసలాడేది. ఎన్ని సంవత్సరాలు గడచినా యీ చిన్ని సంఘటన నా జ్ఞాపకపు పొరల్లో నిక్షిప్తమై వుండిపోయింది.

జోగినాధం మాస్టారు

జోగినాధం మాస్టారికి ‘బెస్ట్ టీచర్ అవార్డ్ దొరకబోతున్నదన్న వార్త నేను కాలేజీలో చేరిన సంవత్సరం తెలిసింది. ఆ! జోగినాధం మాస్టారికి బెస్ట్ టీచర్ అవార్డా? నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు మా క్లాసు టీచర్.

ఆ రోజులు సినీమా రీలులా నా కళ్ళ ముందు మెదిలాయి .వెంటనే అతని రూపం గుర్తుకొచ్చింది.ముతక ఖద్దరు పంచ చొక్కా పై కండువా,కాస్త ఎత్తు పళ్ళు నూని రాసి నున్నగా దువ్విన క్రాఫుకళ్ళజోడు సగం సమయం ముక్కు చివరదాకా జారిపోతూంటుంది. క్లాసులో ప్రవేశించగానే బొంగురు గొంతుతో “యిప్పుడు ఏ పీరియడ్?” అని ప్రశ్నించి క్షణంలో అందరినీ పరికించి చూసేవారు ఎవరు తడబడుతున్నారో కళ్ళజోదులోంచి చూసేవారు.

బోర్డు మీద రాస్తున్నప్పుడు కూడా వెనుకనుంచి మేము ఏం చేస్తున్నామో గమనించేవారు. శిక్షించేటప్పుడు పక్షపాతం లేకుండా అందరికీ ఒకేలా వేసేవారు. అది మాలో కొం దరికి జీర్ణమయ్యేదికాదు.తెలివైన విద్యార్ధులను టీచర్లు కొంత అభిమానంగా చూస్తార, ని పక్షపాతం చూపిస్తారని విన్నాం,గాని మా జోగినాధం మాస్టారి వద్ద అవన్నీ అబధ్ధాలని రుజువైపోయింది.

స్కూలు ఆవరణలో వున్నంతసేపు ఏ క్లాసు కుర్రాడైనా కాగితం ముక్కగాని చెత్త గాని కింద పదేయడం చూస్తే వెంటనే వాడి చెవి పత్తుకుని చెత్త ఏరించి చెత్త కుండీలో వేయించేవారు.’స్కూలమంతా మాస్టారిదేలా ప్రవర్తిస్తారేమిటీ  అనుకునేవాళ్ళం.

ఒక రోజు  టీ చర్స్ కామన్ రూము లోంచి గట్టిగా మాటలు వినిపిస్తూంటే అదీ జోగినాధం మాస్తారి గొంతు వినిపించగానే తొంగి చూశాను ఏమిటా అని.చదివిన పేపరు చక్కగా మడిచి పెట్టలేదని మరో టీచర్ని మందలిస్తుంటే ఆశ్చర్యపోయాను .  పిల్లలమే కాదు టీచర్లు కూడా అతని జులుంకి బలి అయిపోతారని అర్ధమయింది.

జోగినాధం మాస్టారు ఒంటరి మనిషి ,మొదటి  భార్య పోయిన రెండేళ్ళకి మళ్ళీ పెళ్ళి చేసుకున్నారుట.ఆమె ఆర్నెల్లు కూడా బ్రతకలేదుట .అప్పటి నుండి తమ్ముని యింటి పక్కనే చిన్న యిల్లు అద్దెకి తీసుకుని తమ్ముని యింటిలో భోజనం చేస్తూ ఒక్కరే వుండటం అలవాటు చేసుకున్నారు.యితని చండశాసనత్వమ్ పడలేక యిద్దరు భార్యలు యీ లోకం విడిచి పోయారేమోనంటూ  పిల్లలం విమర్శ చేసుకునే వాళ్ళ చాటుగా.

వేసవి వచ్చిందంటే చాలు స్కూల్లో కొత్త కుండలు తెప్పించేవారు. వాటికోసం పిల్లల వద్దనుండే డబ్బులు వసూలు చేసేవారు. వాటిని ప్యూను చేత దగ్గరుండి నింపించి మూతలు పెట్టించేవారు.ఇంటర్వెల్ల్ సమయంలో పిల్లలు నీటిని వౄధా చేయకుండా కుండలు పగలకొట్టకుండా అందరూ నీళ్ళు తాగేలా చూసేవారు.

ఒక రోజు ఒక స్టూడెంట్ చేతిలోంచి గ్లాసు జారిపడి కుండ పగిలి పోయింది. వెంటనే ఆ కుర్రాడి పేరు క్లాసు కనిక్కుని కుండ ఖరీదు చెల్లించమని ఆర్డరు జారీ చేశారు.ఆ పిల్లాడు ఏడుస్తూ తను పేద విద్యార్ధినని, డబ్బులు యిచ్చుకోలేనని గోల పెట్టాడు. వెంటనే ఆ అబ్బాయి క్లాసుకి వెళ్ళి వున్న సంగతి పిల్లలందరికీ చెప్పి అందరూ తలో కాస్త వేసుకుని కుండ కొని యధాస్థానంలో పెట్టమని సలహా యిచ్చారు.పిల్లలందరికీ కోపం వచ్చి,”మేమెందుకు చెల్లించాలి? ఎవరు పగలగొట్టారో వాళ్ళనే చెల్లించమనండి.”అంటూ వ్యతిరేకించారు.”సరే రేపటినుంచి డ్రమ్ములో నీళ్ళు తాగండి.ఈ మాత్రం సహకారం లేకుంటే జీవితంలో చాలా కష్ఠ పడావలసివస్తుంది ఆలోచించుకోండి.”అవి మాటలు కావు శిలా శాసనాలు.

యిలా క్లాసు  టీ చరుగా ఆ సంవత్సరంలో రోజూ తెలిసే విషయాలు యివన్నీ .అయితే స్కూలు చదువు పూర్తయేదాకా ఏదొ ఒక సందర్భలో పిల్లలందరికీ అతనితో భేటీ అవుతూనే వుంటుంది.అన్ని సంవత్సరాలలో అనారోగ్యంతోగాని వూరికి వెళ్ళో శలవు పెట్టడం చూడలేదు.అతన్ని ఎంత విమర్శించుకునీవాళ్ళమో కనిపించకుంటే అంత వెలితిగా భావించేవాళ్ళం.

సంవత్సరం పూర్తయి ఏన్యువల్ పరీక్షల ముందు చాలమంది టీచర్లు స్పెషల్ క్లాసులు పెట్టి కోర్సు పూర్తి చేసేవారు.కాని జోగినాధం మాస్టారు ఫిబ్రవరిమొదటి వారానికి కోర్సు పూరి చేసేసి రివిజన్ మొదలు పెట్టేవారు.మిగతా టీచర్లకి చాలా ఆశ్చర్యం అతను కోర్సు అంత త్వరగా ఎలా పూర్తి చెయ్యగలరా అని.అతని క్లాసులో పిల్లలు కూడా మంచి పర్సెంటుతో   పాసయ్యేవారు. ఒకరో యిద్దరో పరీక్షలో తప్పేవారు.ఒక స్టూడేంటుగా అతనిని పైపైన చూసినప్పుడు కొంత శాతమే అర్ధమవుతారు.

అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో యింటికి వెళ్ళాను.  ఒక్కసారి జోగినాధం మాస్టారిని కలవాలనిపించింది. స్కూలుకి శలవలు ప్రారంభం కాలేదు. స్కూల్లోఅడుగు పెడుతూంటే ఒక అనిర్వచ్నీయమైన ఆనందం కలిగింది.ఇదే స్కూల్లో నా బాల్యం, పెద్ద చదువులకి పునాది ఏర్పడింది దానికై దోహదం కల్పించిన మాస్టాలందరికీ జోహార్లర్పిస్తూ టీచర్స్ రూము ముందు నిలబడ్డాను అనుమతికోసం.

నీడకదలగానే,”ఎవర్రా?”గొంతు జోగినాధం మాస్టారిదే. “నేనే మాస్టారూ సతీష్ ని మీ స్టూడెంటుని,”
“ఓరి! నువ్వా? రా! రా! ఎలా వున్నావ్? ఎక్కడ చదువుతున్నావ్?”యింత ఆప్యాయంగా మాట్లాడటం మాస్టారి స్వభావమే కాదు ఎంతో విచిత్రమనిపించింది. కంగ్రాట్యులేషన్స్ మాస్టారూ! మీకు బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చిందని నా స్నేహితుడు రాశాడు. అది తెలిసి మిమ్మల్ని కలవకుండా వుండలేకపోయాను,” అన్నాను వినయంగా.
“నాకు అవార్డ్ రాకపోతే నన్ను కలియవురా? పోనీలే అలాగైనా నన్ను చూడాలనుకునే వాడు ఒకడున్నాడన్న సంతోషంకలిగింది.అన్నట్లు హెడ్మాస్తర్ గారు నా కోసమని చిన్న సన్మానం లాంటిది చేద్దామని టీచర్లని పిల్లలని కూడపెడుతున్నారు.స్కూల్లో ఏ ఫంక్షనయినా ఏర్పాట్లన్నీ నేనే చూసే వాడిని,కాని యిది నాకు సంబంధించినది కావటంతో నేను కాస్త ఎడంగా వుండాల్సి వస్తోంది.  నువ్వు ఓల్డ్ స్టూడెంటువి నీ సహాయం తీసుకుంటారేమో ఒక్క సారి హెడ్మాస్టర్ గారిని కలుసుకో.” అంటూ పురమాయించారు.
మంచి సమయంలోనే వచ్చాననిపించిది. మే ఐ కమిన్ సార్!” హెడ్మాస్టర్ గారు తల తిప్పి చూసి ఎవర్న్నట్లు నొసలెగరేశారు.
“నా పేరు సతీష్ సార్! లాస్టియర్ బేచ్ స్టూడెంట్ ని.యిప్పుడు ఇంటరు తెనాలిలొ చదువుతున్నాను.జోగినాధం మాస్టారికి అవార్డ్ వచ్చిందని తెలిసి ఆయన్ని అభినందించుదామని వచ్చాను.మిమ్మల్ని కలవమన్నారు.మీరు మాస్టారికి సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారని మీకు సహాయపడమని చెప్పారు.”

“ఓ! రా కూర్చో.” ఫరవాలేదు సార్!యీ ఫంక్షన్ పనుల్లో నేనూ సహాయం చేస్తాను, యీ విధంగా మాస్టారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను.”
మన గోపాలం మాస్టారి వద్ద వివరాలన్నీ వున్నాయి,తెలుసుకుని నీకు చేతనైన సహాయం చెయ్యి. అవసరమైన దబ్బు అతని వద్దే వుంది సంకోచించకుండా తీసుకో.ఈ సందర్భం మన స్కూలుకే గర్వ కారణం.”
“అవును సార్!మరి నేను వస్తాను.”
రెండు రోజుల తరువాత శనివారం సాయంత్రం ఆరు గంటలకి సన్మానం. సింపుల్ గా హాలునలంకరించాం. పుష్ప గుచ్ఛాలు పూలమాల ఒక శాలువ తెచ్చాం.పిల్లలు కొంతమంది,టీచర్లు సమావేశమయ్యాం.
ఆ రోజు కూడా ముతక ఖద్దరు దుస్తులు ధరించే వచ్చారు జోగినాధం మాస్టారు. తన ప్రక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టారు హెడ్మాస్టరుగారు .జోగినాధం మాస్టారి మెడలో పూల దండ వేసి శాలువ కప్పి చేతికి పుష్ప గుచ్ఛ మిచ్చారు.
“శ్రీ జోగినాధం మాస్టారు అత్త్యుత్తమ వుపాధ్యాయునిగా పురస్కారం అందుకోవడం మన స్కూలుకే గర్వకారణం.నిగర్వి,నిరాడంబరుడూ, నిజాయితీపరుదు యిన్ని ‘ని ‘ లని తనస్వంతం చేసుకున్న యితను నిస్వార్ధపరుడు కూడా.టీచరంటే యిలాగే వుండాలనిపించేలా అర్ధం చెప్పారు మనందరికీ.
ఈ సందర్భంగా యితన్ని సన్మానించడం మనని మనం సన్మానించుకున్నట్లే. యితని ప్రవర్తన బాహ్యంగా కనిపించినదానిక్ పూర్తిగా భిన్నం.మాట ఎంత కరుకో మనసు అంత వెన్న.

స్కూలు కార్యక్రమాలన్నింటిలోను సహాయపడుతూ ఏవి కొనాలన్నా ఎవరికీ అవకాశం యివ్వకపోతే ,మొదట్లో డబ్బులు మిగుల్చుకునేందుకా అని అపోహ చెందాను. కాని అది ఎంత తప్పో తరువాత తెలిసి వచ్చింది.కొనేటప్పుడు చౌకగా అమ్మేటప్పుడు లాభసాటిగా చేసి ఎంతో కొంత మొత్తం మిగిల్చి పేద విద్యార్ధులకు ధన సహాయం చేసేవారు
పాత పుస్తకాలకు బైండు చేయించి మరుచటి సంవత్సరంలో కొనుక్కోలేని విద్యార్ధులకు యిచ్చేవారు. మన స్కూల్లో అందమైన పూలతోట మాస్టారి అభిరుచే.మనం వృధా చేసే నీటిని వుపయోగించి పూలు పూసేలా చేయించారి.ఈ స్కూల్లో జోగినాధం మాస్టారు చాలా సంవత్సరాలనుంచి పని చేస్తున్నారు.నేను వచ్చిన ఆరు సంవత్సరాలలో ఆరు నెలలు అతనిని అపార్ధం చేసుకున్నాను.నెమ్మదిగా అతని ఆశయాలు ఆలోచనలు గ్రహించాక అతనికి అండగా నిలిచాను.
ఎవరేమనుకుంటారోనన్న జంకు లేదు. ప్రతివారు తన వెనుక విమర్శలు చేస్తున్నారని తెలిసినా లెక్క చేయక అతని ఆశయ సిధ్ధికై ముందడుగు వేస్తున్నారు.తనకంటూ ఎవరూ లేరని బాధపడుతూ కూర్చోక తన జీతంలో కొంత భాగం ఆదా చేస్తూ వచ్చారు.పేద విద్యార్ధులకై వినియోగించాలని అతని ఆశ.ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఆదా చేయగల నేర్పు జోగినాధం మాస్టారికే వుంది.
పై విషయాలన్నీ తెలిశాక జోగినాధం మాస్టారంటే ఏమిటో అందరికీ తెలిసిందనుకుంటాను.ఎవరికీ తెలియని విషయం మరొకతుంది. ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళి తన మరణానంతరం తన అవయవాలు యితరులకు వుపయోగించమని దాన పత్రం రాసి వచ్చారు.(కరతాళ ధ్వనులతో హాలు మారు మ్రోగింది) యీ పురస్కారం దొరకటం జోగినాధం మాస్టారికే కాదు మనందరికీ కూడా గర్వ కారణం .” అంటూ తన ప్రసంగం ముగించారు.

జోగినాధం మాస్టారు యోగిలా అంతా విన్నా చివరలో కనులు చెమర్చి పై కండువాతో తుడుచుకున్నారు. మిగతా టీచర్లు కూడా అంతకు ముందున్నా అభిప్రాయం మార్చుకుని జోగినాధం మాస్టారి సుగుణాలే నాలుగేసి మాటలు చెప్పారు. పిల్లల తరఫున నేను మాస్టారిపై వ్రాసుకొచ్చిన కవిత చదివాను.

జోగినాధం మాస్టారంటే పిల్లలకి హడల్
ముతక ఖద్దరు దుస్తులు
ముక్కు మీదకు జారే కళ్ళజోడులోంచి నిశిత ధృక్కులు
మాటేమో కరకు – పిల్లలకు అది వింటే ఒణుకు
తప్పు చేసినందుకు లేదు బాధ
మాస్టారు చూసి కేకలేస్తారేమోనన్న వ్యధ
యివన్నీ మాస్టారి బాహ్య రూపం
తన మంచితనం కనిపించనీయక గోప్యం
మంచి గంధపు సువాసనని అరికట్టలేనట్లు
మాస్టారి ఆశయాలకు లేవు ఆనకట్టలు
పిల్లలు,వారి విద్యాభ్యాసం వారి లోకం
స్కూలు పరిశుభ్రత వారి ప్రపంచం
మీ వద్ద నుండి దూరమైన తరువాతనే గ్రహించాం
మీ మాటల విలువ ప్రతి క్షణం
మీ వృత్తిలో వున్న అంకిత భావం
పొందింది అత్త్యుత్తమ వుపాధ్యాయ పురస్కారం
విన్న మేమంతా ధన్యులం
జోహారు జోగినాధం మాస్టారూ జోహారు
ఓపికగా విని అంతా అభినందించారు.హెడ్మాస్టరుగారు లేచి యిప్పుడు జోగినాధం మాస్టారు మాట్లాడతారు.
జోగినాధం మాస్టారు లేచి అందరికీ నమస్కరించారు. “నేను చేతలవాడినే గాని మాటలవాడినికాను.నేను ఏదో చేశానని భావించటం లేదు.యింకా ఏమేం గలనా అని ఆలోచిస్తున్నాను.నా ప్రియ శిష్యుడు సతీష్ నాపై తమకున్న అభిప్రాయం ,అభిమానం కవిత రూపంలో తెలియ జేశాడు, చాలా బాగుంది. హెడ్మాస్టరుగారు నా సహోద్యోగులు నాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞుడిని.నా దగ్గర వున్నంత వరకు నాశిష్యులు నాపై ఏ అభిప్రాయంతో వున్నా,నాకు తెలుసు యీ స్కూలు వదిలి బయట ప్రపంచంలో అడుగిడితే నా మాటల ప్రభావం పరోక్షంగా పని చేస్తుంది.
నాకు కావలసినది అదే! నా ముందు ముఖస్తుతి నాకొద్దు.యిక హెడ్మాస్టరుగారు చెప్పినట్లు నన్ను అపార్ధం చేసుకుందికే ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తారు.’నీటిని తేరిస్తే గాని పరిశుభ్రత తెలియదు,అలాగే నా ఆలోచల్ని ఆశయాలని తేర్చిచూస్తే గాని అందులో విలువ తెలియదు ‘.

నా విద్యాభ్యాసానికి ఒక దాత అజ్ఞాతంగా ధన సహాయం చేశారు.నేనూ పేద విద్యార్ధినే.అందుకనే పేదవిద్యార్ధులు ధన సహాయం లేక వంచింప బడకూదదు. అది నా ధృఢ సంకల్పం. నా సహోద్యోగులకు నా విన్నపం నెలలో ఒక రూపాయి అయినా దాచండి.ఎవరికి జీవితాన్ని ప్రసాదించడానికి వుపయోగపడుతుందో. యిక పోతే పారితోషికాలూ పొగడ్తలూ తాత్కాలికం మన ఆదర్శమే మనకి శాశ్వతం కావాలి! యింతకన్నా చెప్పడానికేమీ లేదు.యింత అభిమానంతో నాకు చేసిన యీ సన్మానానికి కృతజ్ఞుడిని.

యిన్ని సంవత్సరాల వుపాధ్యాయ వృత్తిలో వుత్తమ వుపాధ్యాయునిగా ఎన్నికవటం మాటలు కాదు జోగినాధం మాస్టారు చండశాసనుడే కాదు ఆల్ రౌండర్  కూడా.”హేట్సాఫ్ మాస్టారూ”  అని మనసులోనే జోహారులర్పించాను.జీవితంలో కొంత భాగం వృత్తికై వినియోగించే వాళ్ళుంటే, జీవితమే వృత్తిగా భావించేవాళ్ళు జోగినాధం  మాస్టారిలాంటివాళ్ళు.

పాము భయం

Image

“ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి,పాము పాము”అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని “ఎక్కడ?ఎక్కడ?అంటూయింట్లో కి దూసుకెళ్ళాడు.భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి నోటమాట రాక పాము దూరిన వైపు చేయి చూపింది.పాత కాలం యిల్లు పట్ట పగలైనా వెలుతురు తక్కువగావుండి మసకగా వుంది.

ఏ సామాన్ల సందులో యిరుక్కుందో తెలియదు ఎంత ప్రమాదమైన పామో తెలియదు. ఒక గది లోంచి వేరే గదిలో దూరిందా? వంటింటిలో ప్రవేసించిందా?పాపం ఒక్కామె యింట్లొ వున్నట్ట్లుంది అనుకుంటూ కరీం భాయ్ “లైటు స్విచ్ ఎక్కదమ్మా”అనగానే తన తల దగ్గరున్న స్విచ్ వేసింది సోమిదేవమ్మ.

ఆ గదిలో సామాన్లు ఎక్కువ లేవు దాక్కొనే అవకాశం లేదు, పక్క బెడ్రూములో పెట్టెలు జరిపి మంచం కింద చూశాడు. ఎక్కడా కనిపించ లేదు.ఇక వంటింటిలో దూరి వుంటుందనుకుని అక్కదా వెతకడానికి అడుగు ముందుకు వేశాడో లేదో “ఆ! ఆ! లోపలికెళ్ళకు మడి వస్తువులన్నీ మైల పడిపోతాయి!”

“అయితే పాముతో పాటే వంటిట్లో పని చేసుకుంతారమ్మా?ఒక్కరే వున్నట్లున్నారు విషం పామయితే కుట్టినా ప్రమాదం కదా?మైల పడితే మళ్ళీ మడి చేసుకోండి.” అంటూ వినిపించుకోకుండా వంటింట్లో జొరపడ్డాడు కరీం భయ్.చేసేది లేక నిలువు గుడ్లేసుకుని చూస్తుంటే ,”అమ్మా! మీరు మంచం మీద కాళ్ళు పైన ప్ట్టుకుని కూచోండి పాము దొరికాక మిమ్మల్ని పిలుస్తాను .”

“అయ్యో! నన్ను పిలవదమెంసుకు? దాన్ని చంపృయ్ నా కసలే పామంటే చచ్చే భయం.”మంచం మీద మఠం వేసుకుని కూర్చుంది సోమిదేవమ్మ .

వంటిల్లా ? అది పెద్ద యుధ్ధరంగంలా వుంది.నీళ్ళ ఎద్దడి నుంచి నాలుగు బిందెల నీళ్ళు పట్టి వున్నాయి.పప్పులు బియ్యం సామాన్లు పోసుకున్న డబ్బాలు లెక్క లేదు.”ఎంత మంది వుంటున్నారో మరీ యిన్ని సామాన్లా?”అనుకున్నాడుకరీం భాయ్.ఒక్కొక్క సామాను జరిపుకుంటూ పోతే వంట గట్టు కింద చివర వూరగాయ జాడీలు ఏదెనిమిది వున్నాయి.వాని కదిలించబోతే ‘బుస్స్!’మన్న శబ్దం వినిపించింది.

“అమ్మ గారూ! దొరికింది”అన్న మాట వింటూనే ఒక్క అంగలో వంటింట్లోకి వచ్చి “ఎక్కడ?” అంది సోమిదేవమ్మ.”యిదిగో యీ వూరగాయ జాదీల వెనుక . ‘

అయ్యో! అయ్యో! నా మడి ఆవకాయలన్నీ మండిపోయాయి ఈ పాముకేం పోయేకాలమొచ్చిందో నాఅవకాయ జాడీల దగ్గిరేచోటు దొరికిందా?ఏడాదంతా ఎలా గడపాలి? ఆవకాయలేందే ముద్ద దిగదే నా ఖర్మ.”

“ఇంతకూ చంపాలా వదిలేయనా వేగంగా చెప్పండి నాకవతల పని వుంది.” “బాబ్బాబు చచ్చి నీ కడుపున పుడతాను మా వారు వూరు వెళ్ళారు.అతను వచ్చే దాకా వంటింతిలో పాముతో నేనెలా వుండాలి? చంపేయ్ బాబూ నీకు పుణ్యముంటుంది.”

అంతే! మరి ఆలోచించకుండా ,అయితే మీరు బెడ్ రూము తలుపేసుకుని కూర్చోండి రెండు నిముషాల్లో దీని పని పూర్తి చేస్తాను.”

అయిదు నిముషాలు క్ష్టపడి జాడీలు జరిపి పాముని చంపాడు కరీం భాయ్.

“అమ్మా పాము చచ్చింది ,బయటికి రండి పెద్దగానే వుంది.” అనగానే తలుపు తెరుచుకు ఒక్క ఛెంగులో బయటికి వచ్చింది సోమిదేవమ్మ.

చచ్చిన పాముని చూసి నిశ్చింతగా ఫీలయింది.”దాన్ని బయట పారేయ్ నాయనా ఎంతైనా పామనగానే భయపడి మనకి హాని చేస్తుందో లేదో గాని దాని ప్రాణం మనం తీసేస్తాం.” కరీం భాయ్ చచ్చిన పాముని దూరంగా పారేసి కర్ర గోడవారగా పెడుతూంటే,సోమిదేవమ్మ యాభయ్ రూపాయలు చేతిలో పెడుతూ “మైల పడ్డవన్నీ పార్వ్సి స్నానం చెయ్యాలి. నీ వుపకారాం మార్చిపోలేను నాయనా.”

పై మాట వినగానే”అమ్మా! మీరు పారేయదల్చుకున్నవేమిటో చెప్తే, రిక్షా తెచ్చుకుని నేను పట్టుకెళ్ళి పోతాను.పిల్లలవాడిని మీ పేరు పాము పేరు చెప్పుకుని నాలుగు రోజులు తింటాం.బయట పారేయకండి. అమ్మా!అన్నట్లు కొంత సేపు ముందు చచ్చి నా కడుపున పుడతానన్నారుకదా? నేను ముట్టుకుంటే ఎలా మైల పడ్డాయి?నేను ముట్టుకుంటే మైల పడ్డాయా?పాము ముట్టుకుంటే మైల పడ్డాయా? నేను కాక ఎవరొచ్చినా యివన్నీ తీసి పాముని చంపుతారు.”అంటూ ఆమె యిచ్చిన యాభయ్ రూపాయలు తీసుకున్నాడు.

సోమిదేవమ్మకి అర్ధం అయింది ప్రాణ భయం వున్నప్పుడు మాట్లాడిన మాటలు భయం తీరాక వుండవని.”ఆగాగు నీ పిల్లల కోసం కాస్త ఆవకాయ పొట్లం కట్టి యిస్తాను.మరెప్పుడూ యిలా మాట్లాడను.యిలాంటి సంఘటనలు నాలుగైదు ఎదురైతే నా ఛాదస్తం తగ్గుతుందేమో.”

ఆవకాయ కాస్త పెద్ద పొట్లమే కట్టి యిచ్చింది సోమిదేవమ్మ. సంతోషంగా తీసుకున్నాడు కరీం భాయ్.

మర్నాడు సాయంత్రం భర్త అవధాని వూరినుంచి వచ్చాడు.కాఫీ చేసి గ్లాసుల్లో పోసి వీధి అరుగు మీద కుర్చీల్లో కూర్చుని తీరికగాపాము దూరిన వుదంతం భర్తకి వివరిస్తోందిసోమిదేవమ్మ. ఇంతలో కరీం భాయ్ అటుగా వెళ్తుండటం చూసి “యిదిగో అబ్బాయ్! మాట ఒక్ సారి యిలా రా !”అంటూ సోమిదేవమ్మ పిలిచింది.”మళ్ళీ పాము వచ్చిందేమిటమ్మా?పిలుస్తున్నారు.””లేదు నాయనా మా వారు యిప్పుడే వూరినుంచి వచ్చారు. నీ గురించే చెప్తున్నాను,అనుకోకుండా నువ్వు కనిపించావు.నిన్ను మావారికి చూపిద్దామని పిలిచాను.యితడేనండీ నిన్న ఎంతో సాహసంతో పాముని చంపాడు.”

చాలా సహాయం చేశావు నాయనా! సమయానికి దేవుళ్ళా వచ్చి మా ఆవిడ భయం పోగొట్టావు .”

‘దానిదేముంది బాబూ! ఎవరయినా అంతే చేస్తారు.అన్నట్లు అమ్మగారూ మీ వూరగాయ తిన్నాక తెలిసింది అంత రుచి గల వూరగా తినలేక పోయినా వాసనయినా చూద్దామని వచ్చి వుంటుంది ఆ పాము. పాపం దానికి ఆయువు మూడి పోయింది.”

“భలేగా చెప్పావు భాయ్! నీ మేలు మర్చి పోలేము.”అన్నాడు అవధాని నవ్వుతూ.”వస్తాను బాబూ శలవు” అంటూ నిష్క్రమించాడు కరీం భాయ్.

జీవన సంఘర్షణ

కధ ప్రారంభించటానికి కాకులు దూరని కారడవి చీమలూ దూరని  చిట్టడవి అంటూ మొదలు పెట్ట నక్కర లేదు. అనగా అనగా ఒక చిన్న వూరు . ఆవూర్లో వంద గడపల సామాన్యులతో పాటు నాలుగైదు సంపన్నుల లోగిళ్ళు ఉన్నాయి.ఆ వూర్లొ ఒక అక్కా ఒక చెల్లి, అక్క బాల వితంతువు చెల్లి నడి వయసు వితంతువు.పిల్ల పీచూ బాదరాబందీ లేదు.ఉన్న చిన్న పొలం మీద ఫలసాయం సంవత్సరానికి  కొంత ధాన్యం వస్తాయి. చిన్నామె భర్త   వదిలి వెళ్ళిన  చిన్న ఇల్లు. వూరి వాళ్ళంతా చింత పడేవారు ఈ  యి ద్దరక్కచెల్లెళ్ళు ఎలా బ్రతుకు బండి  లాగించుతారని . భర్త పోయిన నాటినుంచి చెల్లెలు బయటికి వెళ్లేది కాదు.

బ్రతికినంత కాలం బ్రతుకు ని లాగుకునో  నెట్టు  కునో  నడపాల్సిందే!   చిన్నామెకు  దిష్టి మంత్రం ,తేలు మంత్రం  యిరుకు మంత్రం చప్పి మంత్రం  వచ్చు.పల్లెటూరు కావున ఎవరో ఒకరు వస్తారు.. యుక్తిగా తేలు మంత్రం వేయించు కునే టప్పుడు చిన్న పళ్ళెంలో బియ్యం పెసరపప్పు వేసి రూపాయ బిళ్ళ దానిపై ఉంచి తెమ్మనేవారు.మంత్రించిన తరువాత రూపాయి కొంత పప్పు బియ్యం ఉంచుకుని కొద్దిగా పప్పు బియ్యం మిగిల్చి ఒక కొసలొ కొద్దిగా పసుపు కుంకుమ వేసి, తెలు కుట్టిన చోట పసుపు కుంకుమ అద్ద మానేవారు. మిగతా వాటకి కూడా ఏవో తెమ్మనేవారు .

దిష్టి మంత్రానికి పిల్లల్నితేచ్చేటప్పుడు చిన్న గిన్నెలో అయిదు చెంచాల పంచదార తెమ్మనేవారు. అందులోంచి కొంత పంచదార అట్టే పెట్టుకుని మంత్రం వేసేక ఒక చెంచాడు పంచదారగిన్నెలో ఉంచి చిటికెడు పంచదార పిల్లల నోట్లో వేసే వారు.వీటితో వారి దినం తిరుతూందా అంటే తీరదు  కానీ వారి కాఫీ లోకి కొంత పంచదార సరిపోతుంది.ఎవరి పిల్లల్నయినా అతి ముద్దుగా ఆప్యాయంగా పలకరించేవారు.ఆవిధంగా పిల్లలు వారితో పాటు తల్లులు వచ్చేవారు.

ఇక పెద్దామె ఉదయాన్నే ఏడు గంటలవగానే ఒక చిన్నసత్తు గిన్నె కొంగు చాటున పట్టుకుని సంపన్నుల ఇంటికి  వెళ్లి ” ఏం చేస్తున్నారు అమ్మడూ ?”అంటు పలకరించేది .ఫ్రిజ్ లు లేని కాలం . కూరల బుట్ట వద్ద కెళ్లి చిందరవందరగా పడి ఉన్న కూరలన్నీ చక్కగా ఏరి ఎండిపోయిన వాటిని వేరు చేసి మంచి వాటిని సర్ది చుట్టూ శుభ్రం చేసి ,”అమ్మడూ !యీ నాలుగూ ఎండి పోయాయి తీసుకు వెళ్ళనా ? నువ్వైనా అవతల వేసేదే కదా ! ఏదో పెద్ద వాళ్ళం కురో పచ్చడో చేసుకుంటాం ,సరేనా అమ్మా!” అన్నాక కాదనడానికి ఇల్లాలికి నోరు రాదు .
అలాగే యింకో యింటికి వెళ్లి కాస్త పని సహాయం చేసి “అమ్మాయ్ కొద్దిగా పుల్ల మజ్జిగ వుంటే పోయ్యమ్మా. చెల్లికి వేడి  చేసింది .”ఉన్నంత లో గిన్నెలో పోసే వారు .తమ అవసరానికి మించి ఏ కాస్త కయినా ఆశ పడేవారు కాదు .

పెద్దింటి లోగిలిలో శాంతమ్మ కోడలు పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చారు.వుదయాన్నే ముసలామె వచ్చి కూరలు సర్ది కొన్ని అడిగి పట్టుకుపోవడం చూసి ఆశ్చర్యపోయింది.మర్నాడు ఆమె వచ్చే లోపున కూరలన్నీ సర్దేసి చుట్టూ శుభ్రం చేసేసింది.అది చూడగానే నిరుత్సాహం చెందింది. శాంతమ్మ వద్దకెళ్ళి “అమ్మడూ యీ రోజు కూరలన్నీ సర్దేసుకున్నావు,రోజూ అలవాటుగావస్తున్నాను కోపం వచ్చిందామ్మా?” “లేదు పిన్నిగారూ కోడలు వచ్చింది కదా తను సర్ది వుంటుంది.నేను చూసి కూరలేమైనా వుంటే యిస్తాను.”
ఫరవా లేదమ్మా వెళ్ళొస్తాను.”అంటూ వెళ్ళింది కావమ్మ అని పిలవబడే కామేశ్వరమ్మ.

మనసు కలతజెంది యింకో యింటికివెళ్ళాలన్న ధ్యాస కూడా మర్చిపోయి వుత్తి చేతుల్తో యిల్లు చేరింది.”యికపై మన బ్రతుకులు గడవడం కష్టమనిపిస్తోంది చిట్టీ.” “ఏమయింది అక్కా యిన్నాళ్ళూ లేని చింత యీ రోజెందుకు?”

జరిగిన సంగతి చెల్లికి వివరించిది.”మన ముందు తరం వాళ్ళకి అర్ధం చేసుకోవడం తక్కువ.పోనీలే వూరికే బాధ పడకు మన పెరట్లో కరివేపాకు నిమ్మచెట్టుకి కాయలు పచ్చి మిరప మొక్కకి కాయలున్నయి.కరివేపాకు పచ్చడి చేస్తాను.రేపటి సంగతి ఆలోచిద్దాం.”

అక్కకి ధైర్యం చెప్పింది గాని చిట్టెమ్మ గుండెల్లో ఒక మూల గుబులుగానే వుండెను.యిదే విధంగా అన్నిళ్ళవాళ్ళూ ఆలోచిస్తే తమ గతేమిటా అని,సరే అన్నింటికీ పరమాత్ముడే వున్నాడు.ఒక దారి మూసుకు పోతే నాలుగు దారులు కనిపిస్తాయి అనుకుంటూ అశావాదంతో లేచి పచ్చడి నూరడానికి బయలు దేరింది.

పచ్చడి అన్నం తింటున్న కావమ్మకి పచ్చడి కారానికి కడుపులో మంట తిరస్కారంతో గుండెల్లో మంట నాలుగు గ్లాసుల మంచి నీళ్ళు తాగింది.

మర్నాడు అలవాటుగా బయలుదేరింది,కాని మనసులోనే తర్కించుకుంటోంది రోజూ తను చేసే పని ఒక విధంగా యాచనే.ఏదయినా పని చెయ్యడానికి దొరికితే ఏదో కొంత ఆధారం ఏర్పడుతుంది. అనుకుంటూ లలితమ్మగారింట్లో అడుగు పెట్టింది. వాళ్ళిల్లు బంధువులతో హడావిడిగా వుంది. లలితమ్మ కంగారుగా అటూ యిటూ తిరుగుతోంది.

“ఏమయింది లలితమ్మా దేనికి కంగారు పడుతున్నావు?”
“ఏం చెప్పమంటారు పిన్నిగారూ, యీ రోజు మా శ్యామలకి సీమంతం వుదయాన్నే వియ్యాలవారు ఆరుగురు దిగారు.వంట మనిషికి యీ రోజు వుదయాన్నే రమ్మని చెప్పాను యీ రోజు వంటతో పాటు సాయంత్రం పేరంటానికి లడ్డూలు చేస్తానని నిన్న చెప్పింది.యీ రోజు వుదయాన్నే కబురు చేసింది మైల వార్త తెలిసింది రాలేనని. యిప్పటికిప్పుడు యీ పల్లెటూర్లో వంట కెవరు దొరుకుతారు?వియ్యాలవారిచేత చేయిస్తానా ఓపలేని పిల్లచేత చేయిస్తానా ఒక్క దాన్ని ఎలాగా అని కంగారు పడుతున్నాను.”

“ఎందుకమ్మా కంగారు? లడ్డూల సామగ్రి తీసుకెళ్ళీ మా చెల్లికి యిస్తాను మధాహ్నం కల్లా చేసి వుంచమని చెపుతాను.నేను తిరిగి వచ్చి నీకు వంటలో సహాయం చేస్తాను.” ” హమ్మయ్య రక్షించారు పిన్నిగారూ అలాగే చేయండి.”అంటూ లడ్డూల సామగ్రి సర్ది యిచ్చింది. అలా వెళ్ళి యిలా తిరిగి వచ్చిన అక్కని చూసి యీ రోజేమయింది అన్నట్లు చూసింది చిట్టెమ్మ.

వుత్సాహంగా విషయమంతా వివరించింది కావమ్మ.”సరే నువ్వు లలితమ్మకి సాయం చెయ్యి యీ లోగా నేను లడ్డూలు తయారు చేస్తాను.”దేవుడా రక్షించావు అనుకుంటూ మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది.ఆ రోజు కావమ్మ చేదోడు వాదోడుగా వుండి వంట పూర్తి చేసింది.సీమంతం కార్యక్రమం అయింది,పన్నెండయేసరికి వెళ్ళొస్తాను లలితమ్మా పనయింది.” “అయ్యో భోజనం చేసి వెళ్ళండి పిన్ని గారూ”అంది. “లేదమ్మా చెల్లి ఒక్కర్తీ అయిపోతుంది యింటికెళ్ళి తింటాను.” “ఒక్క నిముషం వుండండి,”అంటూ ఒక కేరేజీలో బూరెలు పులిహోర కూర పులుసు పచ్చడి యిచ్చింది.”మా యిద్దరికోసం యిన్నెందుకమ్మా?” “ఎంతోలేదు తీసుకెళ్ళండి పిన్నిగారూ” అంటూ పంపింది సంతోషంగా.”మూడింటికల్లా మనిషిని పంపుతే లడ్డూలు యిస్తాను”అంటూ బయలుదేరింది కావమ్మ.

ఆరోజు అక్కా చెల్లెళ్ళిద్దరు నిన్నటి బాధ మర్చిపోయి సంతోషంగా విందు భోజనం చేశారు,రాత్రి కోసం కొంత అట్టే పెట్టుకున్నారు.

మర్నాడు లలితమ్మకి కేరియరు యివ్వడానికి వెళ్తే లలితమ్మ సంతోషంగా “రండి పిన్నిగారూ నిన్న మీరు చేసిన సహాయం వల్ల మా యింటి శుభ కార్యం చక్కగా ఒద్దెక్కింది.మా వియ్యాలవారు మరో మూడు రోజులుంటారు.నిన్నటిలాగ మీరు కాస్త సహాయం చేయండి మీ కష్టం వుంచుకోను.”

దానిదేముంది లలితమ్మ్ ఒకరికొకరం తోడు పడకపోతే ఎలా?తప్పక చేస్తాను చెల్లికి ఆలశ్యమవుతుందని చెప్పి వస్తాను.” “మీరెందుకు వెళ్ళడం?నేను కబురు చేస్తాను మీరు కూరలు తరగడ మొదలు పెట్టండి.”

నాలుగు రోజులు చింతలేకుండా భోజనం జరిగిపోయింది. నూరు రూపాయలు చేతిలో పెట్టి “పిన్నిగారూ పిల్ల పురుడు పోసుకుని అత్తవారింటికి వెళ్ళేదాకా రోజూ రండి ఏదో ఒక పని వుంటుంది”అంది శాంతమ్మ.”అలాగేనమ్మా పిల్ల చల్లగా కానుపు అయి తల్లి బిడ్డతో అత్తవారింటికి వెళుతుంది.చింత పడకు నేను రోజూ వచ్చి నీకేం కావాలన్నా చేస్తాను.”

యీమె సహాయం గురించి విన్నవాళ్ళు ఎవరింట అవుసరం వున్నా పిలిచి సహాయం పొంది తగిన ప్రతిఫలం యిచ్చేవారు.యింటిలో చేసే అవకాశం లేకుంటే సామగ్రి యిచ్చి కావమ్మగారింట్లో చేసి తెమ్మనేవారు.

యివేకాక పెరట్లో బచ్చలి కూర తోటకూర టమాటాల మొక్కలు పెంచింది చిట్టెమ్మ. వచ్చిన ప్రతి రూపాయి జాగ్రత్త చేసి ఒక ప్రణాళికగా బ్రతకడం ప్రారంభించారు.ఆత్మ గౌరవంతో ఎన్నాళ్ళు బ్రతకగలిగితే అదే చాలనుకున్నారు ఆ సోదరీమణులు.

భిన్నత్వం లో ఏకత్వం

539727_469857959752547_1384282696_n

హిమగిరి శ్రేణులు మకుటముగా
సుందర ప్రకృతి ప్రతీకగా
కుంకుమ పూత పరిమళ భరితమ్
నాకాశ్మీరం నాకాశ్మీరం
భరత మాత మకుటం
నాకాశ్మీరం నాకాశ్మీరం

traditional_pahari_pothohari_dresses_by_dizneykhan-d5h9wux

భరతమాత గజ్జెల పదములు
మూడు సాగరముల లయ తాళములో
పచ్చని ప్రకృతి పరదాపై
నాట్యము సలిపే రాష్ట్రం
నా కేరళ రాష్ట్రం

images (6)

త్రివేణి సంగమ తీర్థముగా
చరిత్రకెంతో ప్రసిధ్దిగా
రాముడు కృష్ణుడు పుట్టిన రాష్ట్రం
రాజసాల నిలయం నా ఉత్తర దేశం
నా ఉత్తర ప్రదేశం

dresses_in_Uttar_Pradesh_India

 

ప్రాచీన సౌంస్కృతి సంగమము
కళలకు నిలయం నా రాష్ట్రం
ఆది శంకరుని ఒడిలో నిడిన
దేవళముల రాష్ట్రం నా తమిళ నాడు

man_and_woman__tamil_nadu_ca35

 

కవీంద్రుడు సుభాష్ బోసు
ప్రసిధ్ద పురుషుల కన్నది బెంగాల్
సుందర వనములతో అలరారు
బెంగాల్ నా బెంగాల్

images (2)

భరతమాత పచ్చని పయ్యద
నారాష్ట్రం ఆంధ్రరాష్ట్రం
త్యగయ గీతి రాయల కీర్తి
ఖ్యాతిగన్న రాష్ట్రం
తెల్లవాని తుపాకి గుళ్ళకు
రొమ్మిచ్చిన అల్లూరిని కన్నది
నా రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం
భారతావనికి అన్నపూర్ణ
నా రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం

OQAAAGy4243PpAYGpk9QqWvoPNW-2p_LKhMyIe7XKnkhrDaz7_LnVyJHM3Tx2bGrXTymoyG8sJRuCTf5BQk8DsU_L_8Am1T1UDv4U5ak7C66ajHW1ORksoFROSsI

దేశ భక్తికి మాతృరక్షణకు
ప్రాశస్త్యం నా పంజాబ్
అమర వీరుడు భగత్ సింగుని
అర్పించిన నాపంజాబ్
పంచ నదులతో పునీతమైనది
పంజాబ్ నా పంజాబ్

dresses_of_Punjab_India

 

 

తల్లి దాస్య విముక్తికి అసువులు బాసిన                                                                    మహాత్ము కన్నది నా గుజరాత్                                                                                         శబరమతి తీరంలొ ఈశ్వర్ అల్లా నాదంలా                                                                ఘూర్ణిల్లిన నా గుజరాత్                                                                                                   ఘూర్ణిల్లిన నా గుజరాత్

Gorgeous-Gujarat-Showcased-At-the-Tarnetar-Mela

మరుభూమిని మల్లెలు పూచిన రీతి                                                 ఎడారిలో కళలను పెంచి                                                                        ప్రసిధ్ది చెందిన రాష్ట్రం                                                                          రాజస్థాన్ నా రాజస్థాన్                                                                                  రాణీ పద్మిని రాణా ప్రతాప్                                                                       శౌర్యానికి ఎనలేని రాష్ట్రం                                                                                                                                                      రాజస్థాన్ నా రాజస్థాన్

Rajasthani_Dress

 

మరాఠ కొదమ సింగముగా
వీరశివాజి వాసి కెక్కగా
వస్త్రోత్పత్తికి వరదానం
పూర్వ పశ్చిమల సంగమం
నా రాష్ట్రం మహరాష్ట్రం

shivaji-GA62_l

చేయి చేయి కలిపి పాడుదాం
భరత మాతకు జయం జయం
భారత మాతకు జయం జయం

వేషం భాషా వేరే అయినా
జాతి మతము వేరైనా
అడుగు అడుగు కలిపి నడుద్దాం
ఏక కంఠమున పాడుదాం
ఏక కంఠమున పాడుదాం…..చేయి

ఆనందానికి ఆవేదనకు భాషతొ పనిలేదూ
భాషకు మూలం భావం కాదా
హావానికి యీ బేధమెందుకు …..చేయి

సత్యాహింసలె ధర్మముగా
నమ్మిన బాపూ మార్గములొ
భారత నవ నిర్మాత నెహ్రూ
కలలను సాకారము సేయుచును…..చేయి

 Children

భారత జాతి మా జాతి
ఐకమత్యమే మా మతమూ
మానవత్త్వమే మా ధనమూ
వేద్దాం ప్రగతికి సోపానం
వేద్దాం ప్రగతికి సోపానం…..చేయి

వసంతగానం

కమ్మగా కూసింది కోయిలమ్మ సిగ్గుగానవ్వింది ముద్దుగుమ్మ

2dkzFjJ

మల్లె మందారాలు సన్నజాజుల తొను
సంపెంగ విరజాజి పూల విందుల తోను
పుడమి పులకించె పండు వెన్నెలలోన
వచ్చింది వయ్యారి వాసంత లక్ష్మి ..కమ్మగా

వీణమీటినలా వేణునాద రవళిలా
మందహాసము చేసె అందాల ఆమని
కన్నె మనసున పలికె ప్రేమ రాగాలేవో
సిగ్గు దొంతర లోన మదుర భావాలేవో ..కమ్మగా

Vapa_13

యమునా తీరాన రాస లీలల తేలు
చిలిపి కృష్ణుని తీరు తలచెనేమొ
గున్న మామిడి పైన గువ్వ జంటల వలపు
గుట్టుగా గుర్తుకి వచ్చెనేమొ ..కమ్మగా

మృదు మదుర భావాలు పిల్ల గాలుల తేలి
మూగ బాసలలొన మురిపించెనెంధుకో
ఊహలలో వరుని రూపు ఊరించెనేమొ ..కమ్మగా