ప్రశాంతాశ్రమం | Peaceful Home

మొదటి భాగం

డియర్  సత్యానంద్,hemingway_beard

నేను శివ ఎన్నో సంత్సరాల తరువాత నీకు లెటర్
రాస్తున్నాను.నీ అడ్రసు ఎలా దొరికిందా అని ఆశ్చర్య పోతున్నావు కదూ! క్రిందటి వారం మీ మేనల్లుడు కిరణ్ కనుపించాడు.ఇంటికి తీసుకువచ్చి నీ గురించి వివరాలడిగాను.నీవు యుఎస్ లో నీ కొడుకు వద్ద వుంటున్నావని చెప్పి నీ అడ్రసు యిచ్చాడు.నాకున్న ప్రోబ్లమ్స్ ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియక తికమక పడుతున్న సమయంలో నీ అడ్రసు దొరకడం వరంలా అనిపించింది.

పన్నెండేళ్ల క్రిందట ఒక పెళ్లిలో కలిశాం. అప్పుడు సెర్వీసులో వున్నాను.ముఫై సంత్సరాలు నార్త్ లో రైల్వేలో చేసిన నాకు అటువైపు సెటిలవడం యిష్టం లేక రిటైర్మెంటు ముందుగా ఈ చిన్న పాటి టౌనులో చిన్న యిల్లు ఏర్పరుచుకున్నాను.సంతానం లేని మా దంపతులం ప్రశాంతంగా శేష జీవితాన్ని గడుపుదామని ఆశపడ్డాం.కాని .ఇక్కడికి వచ్చిన నెల నుంచి నాకు మీనాక్షికి అర్ధమయింది శాంతంగా వుండటం అన్నది ఎంత అడియాసోనని. మాబ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు మా బంధువులు. రోజూ ఎవరొ ఒకరు రావటం అనాయాచితంగా సలహాలివ్వటం.ముసలి వయసులో యిద్దరే ఎలా వుంటారు? యిద్దరిలో ఏఒక్కరి అరోగ్యం దెబ్బ తిన్నా చూసేవాళ్లెవరు? బంధువులలోంచి ఒక జంటని చేరదీసి మా తదనంతరం ఆస్థి వారికి చెందేటట్లు రాస్తే చివరిదాకా మమ్మల్ని కంటికి రెప్పలాచూసుకుంటారని హామీలిస్తున్నారు.మా అవసాన దశలో ఎవరు చూస్తారో లేదో తెలియదు గాని ఈ వచ్చి వెళ్లేవాళ్లకి రోజూ వండి వార్చలేక మీనాక్షి పని అవుతోంది.

ఇన్ని సంవత్సరాలు మాది చాలా ప్లాన్డ్ బడ్జెట్ వుండేది ఇక్కడికి వచ్చాక పెన్షను డబ్బులు ఎలా ఖర్చైపోతున్నాయో తెలియటంలేదు సేవింగ్సు చేసినదాంట్లోంచి కూడా తీయవలసి వస్తోంది. వీళ్లందరినుంచి తప్పించుకుని దూరంగా నలుగురు స్నేహితుల మధ్య ఆశ్రమవాసుల్లా గడపాలనిపిస్తోంది.ఈ రాబందుల్లాంటి బంధువుల నుంచి కాపాడే నాధుడెవరో తెలియటం లేదు. ఇటువంటి బాదరబందీల నుండి దూరంలో హాయిగా వున్నావు.మా దగ్గర కొచ్చి మాతో గడిపి కలిగింది మతో కలిసి తిని బయటకు వెళ్లి మేము పిసినార్లమని యిద్దరికోసం కడుపు కట్టుకుని కూడపెడుతున్నామని యింటికి వచ్చిన వాళ్లకి సరిగా భోజనాలు కూడా పెట్టమని పోయేటప్పుడు మూట కట్టుకుపోతామా అంటూ పదిమందికి చెప్తూంటే ఆ మాటలు మా చెవినపడి చాలా బా ధ గా వుం ది.
కొత్తగా వచ్చే ఆదాయం లేదు పిల్లలు లేరు ఏలోటైనా సర్దుబాటు చెయ్యడానికి యివేవీ వాళ్ల వూహలోకి రావు ఈ వయసులో ఎవరిని చేరదీస్తే ఎవరు చేస్తారు కన్న పిల్లలమీదే ఆశపెట్టుకునే రోజులుకావు

.స్నేహితుడి గా ఏమైనా సలహా యిస్తావని యింత వివరంగా లెటర్ రాశాను.మీ అబ్బాయికి కోడలికి మా ఆశీస్సులు.మనుమలుంటే వారికి కూడా అశీస్సులు.నా టెలిఫోను నంబరు రాస్తున్నాను వీలయితే ఫోన్లో మాట్లాడితే నిన్ను చూసిన్సంత సంతోషిస్తాను.

ఇట్లు

శివకామయ్య

వుత్తరం పోస్టు చేసిన మూడోనాటినుంచి ఎదురు చూస్తున్నాను.కాని వుత్తరం చేరటానికే పదిరోజులు పట్టవచ్చు.అనుకున్నట్లుగానే పది రోజుల తరువాత ఫోను వచ్చింది,

“హలో శివా ఎలావున్నావ్? నీ లెటరు చదివాను.నీ బాధ అర్ధమయింది.నెలరోజుల్లో నేను ఇండియాకి వస్తున్నాను.మనం కలిసి ఈ ప్రాబ్లమ్ కోసంసొల్యూషన్ ఆలోచిద్దాం అంతవరకు ఓపికపట్టు. తాపీగా నిర్నయిద్దాం ఏంచెయ్యాలో”

.అమృతధారలు చెవిలో కురిసినట్లనిపించింది.చిన్నప్పటినుంచి ఏ సమస్య వచ్చినా సత్యానంద్ తో చర్చించడం,వెంటనే సలహా చెప్తే ఆ గొడవ తీరిపోవడం అలవాటు.మళ్లీ యిన్ని సంత్సరాల తరువాత నదిలో కొట్టుకుపోతున్న వాడికి ఆధారం దొరికినంత ఆనందం కలిగింది.నెల రోజులు మీనాక్షి నేను స్నేహితుని రాకకై ఎదురు చూస్తూ ఎన్నో అందమయిన కలలు కన్నాము.

“వాడు మనని టెన్షన్ తీసుకోవద్దన్నాడు ఎందుకు వూరికే ఆరాట పడటం?వెళ్లాక అన్నీ తెలుస్తాయి.అక్కడికి వెళ్లి వాళ్లకి నాలుగక్షింతలు వేసి ఆశీర్వదించి మన పెద్దరికం నిలబెట్టుకుందాం”అంటూ వూరడించాను.అక్కడికి వెళ్లాక తెలిసింది అమ్మాయి పేరు సీమా సారధితోనే పని చేస్తోందని.తోవపొడుగునా ఏమనుకున్నా అమ్మాయిని చూడగానే మనస్ఫూర్తిగా “పిల్ల బాగుందండీ చిదిమి దీపం పెట్టుకోవచ్చును” అంది.మమ్మల్ని పరిచయం చెయ్యగానే కాళ్లకి నమస్కరించి “నమస్తే మమ్మీజి నమస్తే పాపాజి”అంది.పెళ్లి బాగా జరిగింది.మర్యాదలు బాగా చేశారు. కోడలికి నల్లపూసల గొలుసు ఒక వుంగరం పట్టు చీర యిచ్చింది కాంతం.” నాకేమీ లేదా అమ్మా”అడిగాదు సారధి.”నీకో మొట్టికాయ వేస్తాను”అంటూ ప్రేమగా కొడుకుని కోడల్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీదముద్దు పెట్తింది.సారధికి పదివేలిచ్చాను ఎటైనా తిరిగి వస్తారని.మనింటికి రమ్మనలేకపోయారా?అంది కాంతం “వాళ్లెప్పుడు వస్తే అప్పుడే నీ ముచ్చటలన్నీ తీర్చుకో.అన్నలు దూరాన వున్నారు తమ్ముడికి పరీక్షలు ఎవరూ రాకుండానే పెళ్లి జరిగిపోయింది అనుకుంటూ యిద్దరం యింటి దారి పట్టాం.

గోపాలు అనుకున్నట్లుగానే ఎంబిఎ పూర్తి చేశాడు.ప్రయత్నాలేమి చేసుకున్నాడో గాని నెల రోజుల్లో దుబాయిలో జాయిన్ అవాలన్నాడు.”అయ్యో!నలుగురు పిల్లలూ పక్షులకు రెక్కలొచ్చినట్లు ఎగిరిపోతున్నారు.”ఎంతో అవేదనగా అంది కాంతం.రెక్కలొచ్చాక పక్షి పిల్ల ఎగరకపోతే తల్లి పక్షి గూట్లోంచి నెట్టేస్తుంది. కాబట్టి యిదేమీ ప్రకృతి విరుధ్ధంకాదు”అంటూ సర్ది చెప్పాను.గోపాలుకూడా దూరప్రాంతానికి వెళ్తున్నాడన్న చింత నాకూ వుంది నేనే అధైర్యపడితే కాంతం నిలదొక్కుకోలేదని గాంభీర్యం ప్రదర్శించాను.

యిక వారం రోజులకి వెళ్తాడనగా ఒక రోజు చీకటి పడుతుండగా గోపాలు యింకో అమ్మాయి మెడలో దండలతో గుమ్మంలో నిలుచున్నారు. తలుపు తెరిచిన నేను నోరు కూడా తెరుచుకుని వుండిపోయానని కొంతసేపటివరకు తెలియలేదు.వాళ్లని అక్కడే నిలబడమని లోపలికి వెళ్లి కాంతాన్నీ ప్రిపేరు చేశాను.”గోపాలు పెళ్లి చేసుకుని కోడలితో గుమ్మంలో నిలుచున్నారు. హారతిచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకురా కాంతం. ప్రస్తుతంఏమీ మాట్లాడకు లోపలికి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం సరేనా”.అంటూసిధ్ధం చేయించి తీసుకు వచ్చాను.

హారతి ఎర్రనీళ్లు సిద్దం చేసి తెచ్చింది.యిద్దరికీ హరతిచ్చి దిష్టి తీసి పోసి లోపలికి రమ్మంది.వచ్చి సోఫాలో కూర్చున్నారు.లోపలికి వెళ్లి చక్కెర్ తెచ్చి యిద్దరికీ కాస్త కాస్త నోట్లో వేసింది.నేను చల్లటి మంచినీళ్లు పెట్టాను.ఎదురుగా కూర్చుని కొడుకు ముఖంవైపే చూస్తూ “యిప్పుడు చెప్పు యింత హడావిడిగా పెళ్లి ఎందుకు చేసుకోవలసి వచ్చింది? ఎవరీ అమ్మాయి? నువ్వు చేసిన పని తప్పు అననుగాని మాకు చెప్పకుండా రహస్యంగా చేసుకున్నావు అది నువ్వు చేసిన తప్పు.వూర్లో నలుగురూ ఏమనుకుంటారు ఒక్కసారి ఆలొచించావా?ఒక్క ముక్క మా చెవిన వేసివుంటే యీ పెళ్లి మేమే చేసి వుందుంకదా.ఒక్క క్షణం నేను గాని నాన్నగాని గుర్తు రాలేదా?”ఆవేదన కన్నీళ్ల రూపంలొ బయటికి వచ్చింది.

ఆమె మాటలకి అందరి కళ్లలో కన్నీరుబికింది.యిద్దరూ కాళ్లకి నమస్కరించారు. గోపాలు చెప్పాడు.అమ్మాయి పేరు వసుధ తనతో ఎంబిఎ చేసిందని పెళ్లి చేసుకుందామన్న నిర్నయం రెండేళ్ల క్రితమే చేసుకున్నారని,వేరే కులం కావటంనుంచి అమ్మాయి తలితండ్రులు యిష్టపడలేదని దుబై ప్రయాణం సడన్ గా రావటంతో నలుగురు స్నేహితులసమక్షంలో వేణుగోపాలస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుని అట్నుంచి రిజిష్టారాఫీసుకెళ్లి ఫార్మాలిటీ పూర్తి చేసుకుని వచ్చామని చెప్పాడు”. ఆమె తరఫువాళ్లు కాదన్నా మీరు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో తీసుకువచ్చాను.క్షమించండి వాళ్లవాళ్లు కాదన్న దగ్గరనుండి ఏడుస్తూనేవుంది.ఎన్నో కేసులు పరిష్కరించిన మీరు యీ చిన్న కేసు పరిష్కరించలేరా నాన్నా?”

“నా వృత్తి మీద నీకు గౌరవంలేదు గాని నీ సమస్య పరిష్కరించాలంటే నన్ను నా వృత్తిని అడ్డం వేసుకుంటావా?” నవ్వుతూనే ఛురకవేశాను .” మమ్మల్ని యింత వాళ్లని చేసిన మీరంటే ఎంతో గౌరవం భూదేవిలాటి అమ్మంటే కొండంత ప్రేమ.ఏం చెయ్యాలి యిది మా జీవితం”.”ఎంత మాటకారివయావురా!మాకు మీ యిద్దరిమీద కోపం లేదు చెప్పకుండా చేశారన్న బాధతప్ప.సరే యిదేమీ సమస్యకాదు.సమాజంలో యిటువంటి సంఘటనలు సర్వ సాధారణం .చింతపడకండి నేను చూసుకుంటాను”. రాత్రికి రాత్రి స్నేహితులకి బంధువులకి ఫోన్లు చేసి మా అబ్బాయి వివాహం జరిగిందని ఆదివారం సాయంత్రం రిసెప్షను యిస్తున్నాను తప్పక రమ్మని చెప్పాను.రిసెప్షనుకి వచ్చినవాళ్లంతా ఆశ్చర్యం ప్రకటించారు.క్లోజ్ ఫ్రెండ్సు మా ఔదార్యాన్ని పొగిడారు.కాంతం చాలా హుందాగా వ్యవహరించింది. ఏమయితేనేం చిన్నవాడి పెళ్లి ముచ్చటకూడా కొంత తీరింది.మూడు రోజుల తరువాత వాళ్లిద్దరూ దుబయి వెళ్లిపోయేరు.మాకున్న బాధ్యతలు పూర్తయాయి.మళ్లీ మా రొటీను మాకు మిగిలింది.

జీవితంలో ఏదో చెయ్యవలసిన పని మిగిలి వుంటే ఆ జీవితం నడక లక్ష్యంతో కొనసాగేది.పిల్లలంతా ప్రయోజకులయారన్న సంతోషం తప్ప వుత్సాహం తగ్గింది.నాకంటే కోర్టు కేసులు మనుషుల మధ్య గడిచేది.సాయంత్రం వరకు కాంతం యింటి పనులు దేముడి పూజ తప్ప వేరే వ్యాపకం పెట్టుకునేదికాదు.సాయంత్రాలు తప్పని సరిగా తనదగ్గరే కూర్చుని ఏవో కబుర్లు చెప్తూ నాకేదో తినాలని వుందని చేయించుకుని ఒకపూటయినా తనని బిజీగా వుంచేవాడిని.పిల్లలు వారానికోసారి పదిహేను రోజులకోసారి ఫోన్లో మాట్లాడేవారు.

పెద్దవాడి వద్దనుంచి శుభసమాచారం వచ్చింది కోడలు నెలతప్పిందని. యిక కాంతం కాలు భూమి మీద నిలవ లేదు ఆ రోజు మైసూరుపాక్ చేసి పాలవాడు పనిమనిషితో సహా స్వీటు చేతిలో పెట్టి పెద్ద కోడలు విశేషం అంటూ చెప్పింది.అమ్మాయి తలితండ్రులు అమెరికాలోనే వుండటంతో మా సహాయం అవుసరమవలేదు.అబ్బాయి పుట్టాడని ఫోను వచ్చింది.”మన వంశోధ్ధారకుడిని చూడటానికే లేదా ? యిదేం దురదృష్టమండీ?”అంటూ వాపోయింది.సమయం వచ్చినప్పుడు వెళ్దాం మన పిల్లల కుటుంబాలని చూసి వద్దాం అంతవరకు ఓపిక పట్టమని నచ్చచెప్పాను.

“పోనీ సారధిని ఒక సారి రమ్మనండి కాలేజీకి శలవలుంటాయికదా!ఆ అమ్మాయిని కలలో చూసినట్లే అనిపించింది”.”నీ కోడళ్లంతా కలలో కనిపించే వాళ్లే ఎవరు నాలుగు రోజులు వున్నారు కనుక?ఫోను చేస్తాను రమ్మని. అన్నాను. వాడి జవాబు విన్నాక ఎందుకడిగానా అనిపించింది. యిక్కడికి వస్తే వేడి తట్టుకోలేరుట తన భార్యతో మాట్లాడటానికి మాకు హిందీ రాదని మా యింటి వాతావరణంలో ఆ అమ్మాయి కంఫర్టబుల్  గా వుండదని చెప్పాడు. వాడు చెప్పిన కారణాలు యథాతధంగా కాంతానికి చెప్తే గుండె పగిలిపోతుందని “వాళ్లకిప్పుడు రావటానికి వీలుకాదుట తరువాత వస్తామన్నారు మనమే ఎటైనా తిరిగి వద్దామా?కాస్త మార్పుగా వుంటుంది”.అన్నాను. వద్దంది మనసులో లేని వుత్సాహం ఎటో వెళితే వస్తుందా? అనవసరంగా హైరానా పడటమెందుకు?

యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి. కాంతం పైకి చెప్పటంలేదుకాని లోలోపల క్రుంగిపోయేది. పెద్దవాడికి చెప్తే అమ్మని మంచి డాక్టరుకి చూపించి బలానికి టానిక్ యిప్పించమన్నాడు. డాక్టర్లకి మందులగురించి తప్ప మనసులగురించి తెలియదనిపించిది. సురేష్ తో మాట్లాడేను.”మా జీవితాలు ఎంత బిజీ అంటే పని చెయ్యడానికే జీవిస్తున్నట్లుంది కాని జీవితంగడవడానికి పని చేస్తున్నట్లు లేదు.మీకు కావలిసినంత తీరిక సమయం వుందికాబట్టి యిన్ని ఆలోచనలు పెట్టుకుంటారు. యిద్దరూ ప్రశాంతంగా వుండండి అన్నీ సర్దుకుంటాయి”అంటూ సలహా యిచ్చాడు.

ఒకరోజు కూర్చుని కాంతానికి బోధపరిచాను”మనకి అన్న వస్త్రాకి లోటులేదు.పిల్లలంతా వృధ్ధిలోకి వచ్చారు.పెళ్లిళ్లు చేశాం మనుమడు పుట్టాడు యింకా ఏదో వెలితి ఫీలవుతున్నావు ఏమిటి నీ బెంగ?అనడిగాను.”మనిద్దరం యిలా దిక్కుమాలిన పక్షుల్లా వుంటూ కొడుకన్నవాడు దగ్గరలేకుండానే దాటిపోతానేమో అనిపిస్తోంది”అంటూ కళ్లు తుడుచుకుంది.ఒక్కసారి వెన్నులోంచి వణుకు వచ్చింది.నిజమే కాంతం భయంలో యదార్ధముంది.కాని చేయగలిగిందేమీ లేదు.అమెరికాలో వున్న యిద్దరన్నదమ్ములూ కూడబలుక్కుని సీజను చూసి తమవద్దకు మూడేసి నెలలకోసం రమ్మనిపిలిచారు. పాస్ పోర్టులు వీసాలు మనుమడు పుట్టినప్పుడే రెడీ చేసి వుంచాను ఎప్పుడయినా వెళ్లవచ్చునని.మనుమడు మూడేళ్లవాడయాక అవకాశం వచ్చింది.పదిరోజులలో ప్రయాణం,పిల్లడికోసం ఏవేవో కొంది.కొడుకులకిష్టమయినవి కొన్ని చేసిపట్టుకుంది.ఆఫీసుపని తాతారావుకు అప్పగించి బయలుదేరాం.
ముందుగా పెద్దవాడున్న ప్రదేశానికి వేళ్ళాం.ఎయిర్ పోర్టుకి వచ్చి యింటికి తీసుకువెళ్లాడు.ఆ రోజు ఆదివారం అందరూ యింటిలో వుండటంతో బాగానే అనిపించింది.చంటివాడికోసం చేతులుజాచింది కాంతం.వాడు సిగ్గుగా వాళ్ల అమ్మవెనుక దాక్కొన్నాడు.రెస్టు తీసుకుని లేచాక ఏవి ఎక్కడ వున్నాయో ఎలా వుపయోగించాలో చెప్తుంటే ఏమిటిదంతా అనుకున్నాను.మర్నాడు తెలిసింద్ తెల్లవారేసరికి వంట టిఫిను తయారుచేసుకుని పిల్లాడిని తయారుచేసి చెరోకార్లోని వెళ్లారు.పిల్లాడిని బేబీ కేర్ లో దింపి హాస్పిటల్ కి మాలతి వెళ్లింది వెళ్తూ వెళ్తూ “అత్తయ్యగారూ అన్నీ సిధ్ధంగా వున్నాయి మీకు తినాలనిపించినప్పుడు వేడి చేసుకుని తినండి అన్నం చల్లారిపోతుందని వండలేదు,టైము చూసుకుని బియ్యం పెట్టుకోండి.దేనికీ మొహమాటపడకండి.భోజనం చేసి రెస్టు తీసుకోండి”అంది.”సాయంత్రం ఎన్ని గంటలకి వస్తారమ్మా?”అడిగింది కాంతం.సాయంత్రం ఎక్కడ రాత్రి ఎనిమిది దాటుతుంది”అంటూ కారు స్టార్టు చేసింది.ఇక్కడా మేమిద్దరమే.ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. మర్నాడు “చంటివాడిని వుంచేస్తే బాగుంటుంది మాయిద్దరికీ కాలక్షేపం”అన్నాను.”నాన్నా మీరుండే మూడు నెలల కోసం వాడి రొటీను మారిస్తే తరువాత మాకిబ్బంది”అన్నాడు రమేష్. శలవరోజులు వస్తాయి ఆ సమయంలో బండెడు పనులు వాళ్ల బిజీలో వాళ్లుంటే “ఏమయినా చేసేదమ్మా” అని వెనుక వెళితే ” మీరు పెద్దవాళ్లు మీరు రెస్టు తీసుకోండి మాకివన్నీ అలవాటే” అనగానే చిన్నబుచ్చుకుని నాపక్కన కూర్చునేది కాంతం. “మన వూళ్లోనే బాగుందండి పాలవాడు పనిమనిషి పేపరువాడు చాకలి అప్పుడప్పుడు యిరుగుపొరుగు వాళ్లు మాట్లాడటానికి వుంటారు.కొన్నాళ్లయితే మాట్లాడటం మరిచిపోతామేమో”.మూడునెలల్లో చుట్తుప్రక్కల ప్రాంతాలు చూపించాడు బాగానే గడిచిపోయింది.

సురేష్ వచ్చి తనున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు.కాంతం ఆశపడింది శ్యామల మావూరమ్మాయి అక్కడ తనకి కాస్త ఫ్రీగా అనిపించవచ్చని.రెండు రోజులలో అదీ అడియాసే అనిపించింది.వీళ్ల దినచర్య వాళ్లకి భిన్నంగా లేదు.సాయంత్రంఏడు గంటలకి యిల్లు చేరితే అరగంత తినడానికి త్రాగటానికి కేటాయిస్తారు.సురేష్ లేప్ టాప్ మీద పని చేసుకుంటూంటే శ్యామలకి చదువు కొద్దిగా మిగిలిందని రాత్రి పదకొండు గంటలవరకు కూర్చునేవారు.మమ్మల్ని భోజనాలు టైముకి తినేయమని వాళ్లు లేటుగా తినేవారు.శని ఆదివారాలొస్తే కూరలు సాంబారు ఎక్కువగా చేసి ఫ్రిజ్ లో పెట్టుకుని రోజూ కొద్ది కొద్దిగా వెచ్చపెట్టుకుని తినడం,

“నేనున్నాను కదా శ్యామలా రోజూ కూర చేస్తాను యింత కష్టపడి వారం రోజులకోసం ఒక్క సారి చేసుకోవడం ఎందుకని అడిగింది”మాకు యివన్నీ అలవాటే ,మీరిలా అలవాటు చేస్తే మీరెళ్లాక చేసుకోలేకపోతాను”ఈ మాట విన్నాక వూరుకుంది కాంతం.పగలంతా ఆగిన్నె యిటు పెట్టి పుస్తకం తిరగేసి ఆగదిలోంచి ఈ గదిలోకొ తిరుగుతూ గడిపేది.

నెల రోజులయేసరికి కాంతం పూర్వంలా తిరగలేకపోతోంది. రాత్రి పడుకున్నప్పుడు వూపిరి తీసుకోవడం కష్టంగా వుంది.చలిఎక్కువగావుండెను. కండిషన్ రమేష్ తో మాట్లాడితే వాతావరణం మార్పునుండి కంగారుపడవలసినదేమీ లేదని సురేష్ ని ఏవో మాత్రలు కొని వేయమని చెప్పాడు.యిక కాంతానికి సహనం పోయింది.”యిక్కడికెందుకొచ్చామో అర్ధం కావటం లేదు. వీళ్ల బాధలు చూడలేకపోతున్నాను ఇంకా రెండు నెలలు గడపాలంటే నా వల్లకాదు. యింత కష్టపడి పని చేసి వేడిగా ఎప్పటికప్పుడు యింత వండుకు తినలేని బ్రతుకేమిటండీ యీ వయసులో కొత్త ప్రాంతాలు చూడాలన్న అసక్తి నాకయితే లేదు. యింత కష్టపడి పనిచేసి వేడిగా ఎప్పటికప్పుడు వండుకుని తినలేని బ్రతుకేమిటండీ?”అంటూ గోల చేసింది.కొడుకుతో శాంతంగా చెప్పింది “నాయనా మీరెంచుకున్న జీవితం మీ పధ్ధతిలో జీవించండి. మిమ్మల్ని చూడాలనుకున్నాం చూశాం.యికపై మీకు వీలున్నప్పుడు మావద్దకు రండి.యింకిక్కడ వుండలేను మా ప్రయాణానికి ఏర్పాటు చెయ్యి”ఖచ్చితంగా చెప్పింది.మరుచటి వారానికి టిక్కట్లు అరేంజయ్యాయి.రోజూ రాత్రి యిబ్బంది పడుతూనే వుంది.అమెరికా వెళ్లేముందు ఎంత సంబరపడిందో తిరిగి వస్తూ అంత నిర్లప్తంగా నిరాసక్తంగా వుంది.

ఫ్లయిటు కూర్చున్నాం యిరవైనాలుగు గంటల్లో మా వూరు చేరుతామన్న వూహే నాకు రిలీఫ్ అనిపించింది. కాంతం ఏమీ తినడానికి తాగడానికి యిష్టపడలేదు. పోనీ బిస్కట్లు తిను అన్నా “ఏమీ వద్దు చేరే వరకు కళ్లు మూసుకుని కూర్చుంటాను వూరికే అవస్థ పెట్టకండి”అంటూంటే ,యిక్కడికి వచ్చిన దగ్గరనుండి కలిగిన మానసిక అలజడి సర్దుకోనీ అని వూరుకున్నాను.యిరవై గంటల ప్రయాణం గడిచింది.

నిద్రపోతున్న నన్ను కుదిపింది కాంతం వూపిరి తీసుకుందికి కష్టంగావుంది.పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా వుండెను.ఎయిర్ హోస్టెస్ ని పిలిచాను ఆమె చూసి ఆక్సిజన్ మాస్క్ పెట్టింది.పావుగంట తరువాత శాంతించింది”.నిద్రపట్టింది యిక ఫరవాలేదు, మూడు గంటల్లో చేరిపోతాము డిస్టర్బ్ చెయ్యకండి” అంది

.కాంతానికి షాల్ కప్పి కూర్చున్న నాకు ఆమె నిద్రలోకి కాదు దీర్ఘ నిద్రలోకి జారిపోయిందని గ్రహించలేకపోయాను. దిగే సమయంలో సామాన్లు తీయాలని బెల్టు వూడదీసి “లేస్తావా కాంతం”అన్నాను సగం శరీరం వాలిపోయింది.అందరూ దిగే హడావిడి,ఏం చెయ్యాలో అర్ధంకాక తిన్నగా కూర్చోపెట్టి ముక్కుదగ్గర వేలుపెట్టి చూశాను.గాలి ఆడుతున్న సూచన లేదు.కొంత ఖాళీ అయాక ఫ్లైటు స్టాఫ్ కి తెలియజేశాను పరిస్థితి.స్ట్రెచరు తెచ్చి బయటకు తీశాక డాక్టరు వచ్చి పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు.తాతారావుకి విషయమంతా చెప్పాను. రంగనాధం తాతారావు మరో యిద్దరు స్నేహితులు వచ్చి యిల్లు చేర్చారు. వెళ్తున్నప్పుడు యిద్దరం నడుచుకుని వెళ్లాం వస్తున్నప్పుడు భుజాలమీద తీసుకు రావలిసి వచ్చింధి.స్నేహితుడు వియ్యంకుడు అయిన రంగనాధం ప్రక్కన అండగా నిలుచున్నాడు.

పిల్లలకి కబురు వెళ్లింది.అమెరికానుంచి పిల్లలు వచ్చే ప్రసక్తిలేదు. సారధి రెండో రోజుకి చేరాడు గోపాలు వాతావరణం బాగుండక మూడో రోజుకి వచ్చాడు.ఆమె కొడుకుల్ని చూడలేకపోయినా ఆమె శరీరాన్ని కొడుకులు చూశారు.చేయవలసినవి యాంత్రికంగా జరిగిపోయాయి. వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లారు. ఎప్పుడు రావాలనిపిస్తే తమవద్దకు రమ్మని చెప్పి వెళ్లారు. నా పరిస్థితి వూహించుకోలేకపోయాను.

కాంతం ఎందుకలా పిల్లలు అంటూ కలవరించిందో అర్ధమయింది.ఈ వయసులో వంటరి జీవితం దుర్భరం.తాతారావు చిన్నవాడే తనభార్య యిద్దరు పిల్లల్ని తెచ్చి మా యింటిలో వుంచి నాకు ఒంటరితనం అనిపించకుండా పిల్లల్ని నా చుట్టూ తిరిగేలా చేసి భోజనసదుపాయం చూశాడు.ఒక వారం చూశాక అనిపించింది ఈ పని కాంతం వుండగా చేసి వుంటే తను బ్రతికి వుండేదేమో.తిరుణాలలో చేయి విడిపోయి తప్పిపోయిన పిల్లలా వెళ్లిపోయింది.ఎప్పటికీ పిల్లలు వాళ్ల కుటుంబాలతో వాళ్ల వుద్యోగాలతో వుక్కిరిబిక్కిరి అయేవాళ్లే గాని నాలాటివాడికోసం టైము కేటాయించలేరు.ఈ వేడి తగ్గాక తాతారావు కూడా తనదారి చూసుకుంటాడు.యింకేదయినా మార్గం ఆలోచించాలి అనుకుంటున్న సమయంలో ఈ ప్రశాంతాశ్రమం అడ్వర్టైజ్ మెంటు చూసి సంప్రతించాను. యిక్కడికి చేరడానికి కారణాలు యివి.

అతని కధ మొత్తం వుగ్గబట్టుకుని విన్నారందరూ. కొందరికయితే కనులు చమర్చాయి.శ్రీనివాసరావు లేచి మాట్లాడటం మొదలు పెట్టారు.నేడు ఈ వృధ్ధాశ్రమాలు చాలా స్తాపించబడుతున్నాయి. దేశకాల పరిస్థితులను బట్టి భార్యా భర్తలిరువురూ వుద్యోగం చెయ్యకపోతే గడవని పర్థితి కొందరికీ వూపిరిసలపని దినచర్య పిల్లల చదువులు వీటన్నిటినీ మనం సమస్యలని అనుకోలేం. ప్రతి వృధ్ధ వ్యక్తి యిలా ఆశ్రమాల్లో చేరడం సంభవమేనా ఆలోచించండి.

మన దేశంలో వుమ్మడి కుటుంబాలకి యిప్పటికీ గౌరవం వుంది.అందులో కొన్ని యిబ్బందులుండవచ్చు,సదుపాయాలు కొన్ని వుండవచ్చు.గుణదోషాలన్నవి అన్నింటా వుంటాయి.అడ్జస్టయే మనస్తత్వం పిల్లలకు పెద్దలకూ సమంగా వుండాలి.మనలో సగం మంది పిల్లలు విదేశాలలో వుండి పెద్దలు యిబ్బందులకు గురవుతున్నారు. వారికిటువంటి ఆశ్రమాలు తప్పదు. కాని పరిస్తితులు అనుకూలంగా వున్నా పిల్లలు మనని చక్కగా చూసుకుంటున్నా మన స్వేచ్ఛకి భంగం వాటిల్లిందని భావించి పిల్లల్ని వదులుకుని ఆశ్రమాల్ని నమ్ముకోవడం అంత భావ్యంకాదేమో ఆలోచించండి. విధి వక్రించి జీవితాలని అస్తవ్యస్తం చేసిన పరిస్తితులలో తప్పనిసరిగా ఆశ్రమాలని ఆశ్రయించండి.స్కూళ్లని కాలేజీలని ప్రోత్సహించినట్లు అనాధాశ్రమాలని వృధ్ధాశ్రమాలని ప్రోత్సహించలేం.అయితే యిటువంటివి తప్పనిసరి పరిస్తితుల్లో తీసుకోవలిసిన నిర్నయాలు.మీరంతా పెద్దలు మంచి చెడ్డలుఆలోచించగలవారు.

ఎవరయినా బిడ్డల వద్దకు వెళ్లాలన్న వుద్దేశం కలిగిననాడు అనవసరమైన అభిమానంతొ వెనుకడుగు వేయకండి.క్షమించండి సత్యానంద్ గారూ మీ ఆశ్రమాన్ని నిరుత్సాహపరుస్తున్నాననుకోకండి. వృధ్ధాశ్రమాల ప్రారంభోత్సవంనాటికన్నా అవి మూతపడిననాడు ఎక్కువ సంతోషిస్తానన్న మహాత్మ గాంధిగారి మాటలు గుర్తుకివచ్చి పై మాటలు చెప్పాను.తప్పనిసరిగా చేరిన మీరంతా సంతోషంగా సోదరభావంతో మెలగాలని మీ అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా వుండాలని భగవంతుడిని కోరుతూ ముగిస్తున్నాను నాకు మాట్లాడే అవకాశమిచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.

పిల్లలూ! సత్యనారాయణగారి కధ నా మాటలు విన్నాక భవిష్యత్తులో పెద్దలతో ఎలా మసలుకోవాన్నది నేర్చుకోండి.వ్యాసాలు రాసి మర్కులు తెచ్చుకోవడంకాదు,పెద్దలని అర్ధంచేసుకుని వారి ఆశీస్సులు పొందండి”. అందరూ సరదాగా భోజనాలు చేసి కార్యక్రమాన్ని ముగించారు.

English translation

Part 1

hemingway_beard

Dear Satyananda,

Hi I am Shiva. It has been a long time since I wrote a letter to you. You must be surprised how I managed to get your address. Well,  a week ago, I met your niece, Kiran, at the market. He told me that you stay in America with your son and also gave me your address.  It came to me as a blessing in disguise, for I am in the midst of problems that I can’t understand whom to share with.

Twelve years back when we met at a wedding, I was in service. Then, after having served the Railways in North India for thirty years, I wished to spend my retired life peacefully at my home town. I bought a small house there. As you know, I don’t have children, all my wife and I wanted was to lead a quiet and undisturbed life. But, within one month of coming here, Meenakshi (my wife) and I, realised how impossible that was. Almost everyday, we have distant relatives coming over to our house, giving free advice on how children are the only support system in old age and hence our life is incomplete without them. Some even suggested we adopt a young couple or an adult to look after us and act as our inheritors. But I am sure you would agree, in this day and age, when it is becoming difficult to trust even biological children, how do I trust a stranger to care for us?

Moreover, the visitors not only waste our time, they also take full advantage of our hospitality only to go out and spread rumours that we are stingy misers who don’t even treat their guests properly. We always led a simple and restrained life and believed in living by a fixed budget. But now, after retirement, because of these unwanted guests and their ever increasing demands, we have even exhausted our savings. We are deeply hurt and pained by their behaviour. The one thing we so craved is now being denied to us by these people. This situation has even forced me to think of going away  to an ashram (hermitage)! I sometimes envy you as you are far away from all this mess. I have approached you for every problem since childhood and you always gave me good advice. I sincerely hope you help me this time too.

Blessings to your son and daughter and to your grandchildren. if any.I am also including my phone number at the end of this letter. Please call me as soon as you receive this letter. Looking forward to hearing your voice.

                                                                                                       Yours lovingly,

                                                                                                        Shivakamayya

 It has been only three days but I am already expecting the phone call. Of course I know it takes more than ten days for the letter to reach U.S.!

After ten days, as expected, the phone rang.

Hello Shiva, how are you? I got your letter. I can understand your problem. I will be  coming to India in a month. We will then discuss the solution in depth. Don’t take any decision in haste. We will both decide with a cool head. Have faith and keep patience. Bye.

My friend’s words felt like sweet nectar to my parched ears. His advice was something I sought and followed even in childhood. The joy on hearing his voice after so many years was like that of a man being rescued after being mercilessly lashed by a mighty river.

My wife and I were eagerly awaiting Satyananda’s arrival.

To be continued…

Advertisements

ప్రశాంతాశ్రమం

ఆ రోజు రానే వచ్చింది.సత్యానంద్ రాకతో మాలో పోయిన వుత్సాహం చోటుచేసుకుంది.రెండు చేతులు జాచి స్నేహితుడిని కౌగలించుకున్న ఆనందం వూహాతీతం.వచ్చినప్పటినుంచి వుత్సాహంగా తన ప్లాన్లు చెప్పడం మొదలుపెట్టాడు. సత్యానంద్ కి అమెరికాలో వుండిపోవడం యిష్టంలేదు. అయితే యిక్కడ ఒక్కడూ వుండటం కొడుకు యిష్టపడక కొడుకుతో వుంటున్నాడు. ఎప్పటికయినా మనవాళ్లమధ్య యిక్కడ గడపడం తన అభీష్టం అన్నాడు.
హైదరాబాదుకి నలభై కిలో మీటర్ల దూరంలో తనకి పెద్ద బంగళా చుట్టూ పెద్ద ఆవరణ వున్నాయని దానిని మనలాటి వాళ్లం కొంతమందిమి వుండేందుకు వసతిగా ఏర్పరచి దానికి తగిన సౌకర్యాలు కూర్చుకుని వుందాం. ముందుగా ఫౌండర్ మెంబర్లుగా మన ముగ్గురమే వుందాం. నెమ్మదిగా మనలాంటివాళ్లు చేరవచ్చు.అనగానే ఏమిటీ ఓల్డ్ హోమా?అంటూ ప్రశ్నించాను. పేరేదయినా పెట్టుకోవచ్చు కాని మనలాటి వాళ్లు ఒకరికి బర్డెన్ కాకుండా మనకి యింకొకరి ప్రమేయంలేకుండా బ్రతకడానికి పేరేదయినా అనుకోవచ్చు.

ముగ్గురం హైదరాబాద్ వెళ్లాం.ఇల్లు చాలా విశాలంగా వుంది.నాలుగు బెడ్రూములున్నాయి.సత్యానంద్ అన్నాడు కాంపౌండు గోడనానుకుని ఎల్ షేపులో పది రూములు ఎటాచెడ్ బాత్రూములతో కట్టించితే యింకా మనుషులు వచ్చినా సరిపోతుంది.అంతవరకు ఆ ఇంటిలోనే మేము వుండవచ్చనిఅన్నాడు. యిది ఎస్టాబ్లిష్ అయేవరకు మనిద్దరం కాస్త శ్రమ పడాల్సి వుంటుందన్నాడు.మరి దీని మైంటెనెన్సుకి డబ్బు కావద్దా?అని సందేహం వెలిబుచ్చాను.మన నెలలో ఖర్చు చేసే దానిలో కొంత భాగం నిఖరంగా జమచేసుకుంటే దీనిని నడపడం కష్టమేమీ కాదు.అయితే ముందుగా కొంత మదుపు పెడతాను నాకు వెనుకా ముందు ఎవరూ లేరు అడిగేవాళ్లు లేరు నాకొడుకు అమెరికాలో సెటిల్ అయి నా మీద ఆధారపడడు”అయితే అందరూ ఒకే విధంగా చెల్లించ లేక పోవచ్చు అప్పుడెలా?”అన్నాను.చూద్దాం ఎంత చెల్లించాలన్నది అడ్వర్టైజ్ మెంటులో వేద్దాం అంతగా ఎవరైనా అంత యివ్వలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. 
ఇంకొంతమంది సలహా తీసుకుని అప్రూవల్ తీసుకున్నాం.ఈ లోపున మాయిల్లు అమ్మకానికి పెట్టాను.ముగ్గురంకలిసి పని మొదలు పెట్టాము.పేరు నిర్ణయించి రిజిస్ట్రేషను చేయించాలి అని ముగ్గురం ఆలోచించాం మీనాక్షి చెప్పింది ప్రశాంతత కోసం ఒక్ చోటికి చేరాలనుకున్నాం కావున’ప్రశాంతాశ్రమం’ అని పేరు పెట్టుకుందాం అంది. ఆ పేరే బాగుందని ఖాయం చేశాం.

వంటమనిషిని ఏర్పాటు చెయ్యాలని సత్యానంద్ అంటే మీనాక్షి ప్రపోజ్ చేసింది మా వూర్లో దూరపు బంధువు పేరు సీతమ్మ పెళ్లయిన ఆరు నెలలకే భర్త దేశాలు పట్టిపోతే తండ్రి పంచన వుండేది. తండ్రి బ్రతికున్నంతవరకు అమె జీవితం సాఫీగానే గడిచింది.తండ్రి పోయి అయిదేళ్లయింది.తాతలనాటి యిల్లు కొద్దిపాటి ఆస్థి వున్నాయి.కాని వాటితో పూర్తిగా ఆమె భుక్తి గడవటం లేదు. మనిషి ధృడంగా వుంది ఆవూర్లో ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసి వారిచ్చిన దానితో తృప్తి పడుతోంది.మా యిల్లు అమ్మి మావూరినుంచి వచ్చేసే ముందు ఆమెని యిక్కడికి తీసుకు వస్తే పది పన్నెండు మందికి వంట చేసి పెట్టగలదు.ఆమెకి జీతంలా కొంత సొమ్ము బేంకులో జమచేస్తే ఏ రోజునైనా వైద్య సహాయానికి పనికొస్తుంది అని చెప్పి మా అభిప్రాయం కోసం ఆగింది.ఈ అయిడియా బాగుందని ఆమె ఆశ్రమంలో మెంబరుగా వుంటూ పనికూడా చెయ్యగలదని ముగ్గురం ఏకీభవించాం.అన్ని ఏర్పాట్లు చేసి ఒక డాక్టరుతో మాట్లాడాం వారానికి ఒక సారి ఆశ్రమానికి వచ్చి అందరినీ చెకప్ చెయ్యటానికి.పేపర్లో అడ్వర్టైజ్ మెంటు వేయించాం.

నాలుగు రోజుల తరువాత ఒక జంట వచ్చారు ఆశ్రమాన్ని వెతుక్కుంటూ.తమని తాము పరిచయం చేసుకున్నారు.అతని పేరు రంగనాధం భార్య లలిత,హైస్కూలు హెడ్మాష్టరుగా చేసి ఆరు నెలల క్రితమే రిటైర్ అయినట్లు చెప్పారు. సత్యానంద్ అడిగాడు “మీ గురించి క్లుప్తంగా చెప్పండి ఏ కారణంతో యిక్కడ చేరాలనుకుంటున్నారు

“.ఏం చెప్పమన్నారు నాకు యిద్దరు పిల్లలు. అమ్మాయి పెద్దది దాని వివాహం చేసి పదేళ్లయింది యిద్దరు పిల్లలు.మా రెండో సంతానం అబ్బాయి.నేను వుపాధ్యాయ వృత్తిలో వుండి వేలాది స్టూడెంట్లకి విద్యాబోధ చేసిదారి పెట్టాను కాని నా కొడుకుని దారిలో పెట్టలేకపోయాను.ఏడవక్లాసునుంచి చెడు సహవాసాలు చేసి సరిగా చదవక గట్టిగా మందలించితే యిల్లు వదిలి రెండు మూడు రోజుఇలు ఎక్కడో గడిపి వచ్చేవాడు .తల్లి పెట్టిన తిండి తిని చాటుగా తప్పించుకుని తిరిగేవాడు.ఆకతాయితనం కాస్త వయసుపెరిగితే వాడే దారిన పడతాడని కఠినచర్యలు తీసుకోలేదు. నడవడి సరిగాలేక చదువు ఒంటబట్టక జీవితంలో ఏం చేస్తాడన్నది మా మనోవ్యధ.

వీటికి తోడు మా అల్లుడికి ధన దాహం.ఒక్కతే పిల్లని ఎన్ని ముద్దు ముచ్చటలు తీర్చినా ప్రతీ సారీ ఏదో ఒకటి మా తలకుమించినది కోరుతూంటాడు.యివ్వలేకపోతే అమ్మాయిని హింసిస్తుంటాడు. రిటైర్ అయ్యాక కూడా ఏపిల్లలు  వచ్చి మా యిద్దరి కాళ్లకు నమస్కరించినా ఆరోజున నా భార్య తిండి తినేది కాదు నిద్రపోయేదికాదు.”యింత మంది మిమ్మల్ని గౌరవంగా నెత్తిన పెట్టుకుంటూంటే కడుపున పుట్టిన కొడుకు శతృవులా ప్రవర్తిస్తున్నాడు యిదేం ఖర్మండీ?” అంటూ వాపోయేది

నెల క్రితం యింట్లోంచి వెండి వస్తువులు పట్టుకెళ్లి నాకొడుకు అమ్మకానికి పెట్టాడు.దుకాణం యజమాని ధరకట్టడానికి టైము పడుతుందని కూర్చోపెట్టి నాకు కబురు చేశాడు.నేను వెళ్లి అదంతా చూసి నిశ్చేష్టుడనయ్యాను.నన్ను చూసి నాకొడుకు కూడా అంతే అశ్చర్యపోయాడు.యింటికి తీసుకువచ్చి శాంతంగా కూర్చో పెట్టి చెప్పాను. చదువబ్బకపోతే మానె ఏదయినా చిన్న దుకాణం పెట్టుకుని గౌరవంగా బ్రతకమని. జీవతంలో ఎప్పటికి సెటిల్ అవుతావు?నేనా రిటైర్ అయ్యాను యింతకన్నా ఏం చెయ్యగలనని నిగ్గ దీస్తే వాడికిలాంటి పనులు చేసి బ్రతకటం యిష్టం లేదన్నాడు.మరి యిలా దొంగతనాలు చెయ్యడం యిష్టమేనా?మన యిల్లు గుల్లయాక పొరుగిళ్లుకూడా దోచడం మొదలెడతావా అని గద్దించాను.ఆ రోజు వెళ్లిన వాడు వారం దాకా రాలేదు.

యిక లాభం లేదని పోలీసు కంప్లైంటు యిచ్చాను.నా కొడుకు నడవడిక సరిగా లేదని శతవిధాలా ప్రయత్నించి నేను విఫలుడినయానని,యికపై వాడికి నాకు ఎటువంటి సంభంధం లేదు వాడు ఏమయినా నేరాల్లోయిరుక్కుంటే నా పూచీలేదు మీకు తోచిన చర్యలు తీసుకోండని రాసిచ్చాను. అది తెలిసి నా భార్య కన్నీరు మూన్నీరుగా ఏడ్చింది.ఎంతో గౌరవంగా బ్రతికిన మేము అక్కడే వుంటే యింకా ఏం వినాలో ఏం చూడాలోనని భయపడ్డాం నేను శ్రీకాకుళలో జిల్లాలో మారుమూల గ్రామంలో వుంటాను అక్కడే వుంటే నాకూతురి బ్రతుకు కూడా నా అల్లుడు నరకం చేస్తాడు. వాళ్ల బ్రతుకులు ఎలాగయితే అయింది యిక పిల్లల చింత మానుకోడానికి నిర్ణయించుకున్నాం.

యిటువంటి తరుణంలో ప్రశాంతాశ్రమం అడ్వర్టైజ్ మెంటు చూశాం. ఇక్కడ వుండి శేష జీవితం ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం.మేమిద్దరం మానసికంగా క్రుంగిపోయాం గాని శరీర దారుఢ్యం బాగానే వుంది యిక్కడ మేము చెయ్య గలిగే పని చేస్తూ అయిడిల్ గా వుండకుండా గడుపుతాం”.అంతా విన్నాక ఫారాలిచ్చాము నింపడానికి.ఫారాలు నింపి వారంరోజుల్లో వస్తామని చెప్పి వెళ్లారు రంగనాధం లలితమ్మలు. అయిదు మందితో ఆశ్రమం ప్రారంభించాం.నాలుగు నెలలు గడిచాయి వేటికీ యిబ్బంది పడటంలేదు.మీనాక్శీ లలితమ్మ సీతమ్మలు.అది ఆశ్రమంలా కాక ఒక యిల్లు నడుపుతున్నట్లే నడుపుతున్నారు

ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలకి పోలీసు వద్దనుంచి ఫోను వచ్చింది.ఒక ముసలామె ఆత్మ హత్యా ప్రయత్నం చేసుకూంటూ పట్టు పడిందని ఆమె పరిస్తితి చాలా దీనంగా వుందని మా ఆశ్రమంలో చేర్చుకుంటారా అని అడిగారు.ఆమెని తీసుకు రమ్మని పరిస్థితి చూసి తగిన సహాయం చేస్తామని చెప్పాము.అరగంటలో ఒక పోలీసు ఒక సోషల్ వర్కరు ముసలామెను తీసుకు వచ్చారు.వొళ్లంతా వణుకుతోంది నోట మాటరాక అయోమయ స్థితిలో వుంది.ఏమైందని ప్రశ్నించాము.

ఈ వూరి మనిషి కాదు ఎక్కడినుంచి వచ్చిందో అడుగుతుంటే చెప్పటం లేదు.పన్నెండో అంతస్తునుంచి దూకింది.ఆమె చీర అదే ఫ్లోరులోవున్న హుక్కుకి తగిలి వేలాడుతుంటే పిల్లలు గోలచేశారు.నలుగురూ పోగయి రక్షించి మాకు ఫోను చేశారు.డాక్టరుకి చూపించాము.చేసినపని అసఫలమవటంతో షాకు తగిలి ఏమీ మాట్లాడటం లేదు,ప్రమాదమేమీలేదు మెంటల్ షాకు తగ్గితే కోలుకుంటుందని మందిచ్చారు.ఈ లోగా సొషల్ సర్వీస్ వారికి ఫోను చేస్తే మీ సంస్థ గురించి తెలిసిందని ఆమె వయసుని బట్టి యిక్కడ వుంచుతారేమో ఎంక్వైరీ చేశాము అన్నారు. సరే వుంచండి ఆమె కోలుకున్నాక విషయం తెలుసుకుని తగిన సహాయం చేస్తాము అనిచెప్పి వాళ్లని పంపించాము. యింత విన్నాక ఆమెని విసిగించకుండా బలవంతంగా కాస్త తినిపించి గ్లాసుడు పాలు పట్టించి తన గదిలో పడుకోపెట్టింది సీతమ్మ.

రాత్రంతా గాఢ నిద్రపోయిన ఆమె వుదయంలేచి రిలీఫ్ గా ఫీలయింది.ముఖం కడుక్కోమని కాఫీ తెచ్చి యిచ్చింది సీతమ్మ.కాస్త తేరుకున్నాక మీనాక్షి లలితమ్మలు కూడా వచ్చి కూర్చున్నారు.”మీ పేరేమిటమ్మా?” చాలా సున్నితంగా అడిగింది లలితమ్మ.”నాపేరు కమలమ్మ”ఎంత అడిగితే అంతే సమాధానం యిచ్చింది. ఈ వూర్లో ఎవరింటికి వచ్చారు? ఏదైనా పనిమీద వచ్చారా?మీ దేవూరు?”యిన్ని ప్రశ్నలు వేయగానే భోరున ఏడిచింది.
ముగ్గురూ ఓదార్చి జరిగినది చెప్పమని అడిగారు.

“నా గురించి ఏం చెప్పమన్నారు దురదృష్టమంతా నా నొసటనే రాశాడు భగవంతుడు.నాకు ముఫై అయిదేళ్లు వచ్చేసరికి మూడొంతుల జీవితం ముగిసిపోయింది.నా భర్త గవర్నమెంటు ఆఫీసులో క్లర్కుగా చేసేవారు.నాకు వరుసగా ఏడుగురు పిల్లలు పుట్టి పురిటిలోనే పోయారు.ఎనిమిదోసారి పట్నం తీసుకెళ్లి పెద్ద డాక్టరుకి చూపించి విషయమంతా చెప్పారు. నెలలు నిండాక తన హస్పిటల్లో పురుడుపోసుకోమన్నారు.అలాగే చేశాము దేముని దయవలన మగబిడ్డ దక్కాడు.ఎంతో సంతోషంగా యింటికి తీసుకువచ్చాము. బిడ్డని ఒళ్లో పెట్టుకుని ఆరోజు ఎంత సంతోషించానో మర్నాడు అంతకు రెట్టింపు దుఖం పొందాను. మరునాడు ఆదివారం నా భర్త భోజనం చేసి కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటూ ఒరిగిపడి  పోయారు. గుండాగిపోయిందన్నారు.

ఎందుకు బ్రతకాలని ఏడుస్తుంటే ఒళ్లోని పిల్లడు కేరుమన్నాడు.ఎన్ని కష్టాలెదురయినా వాడిని పెంచి పెద్ద చేయాలని నిర్ణయించుకున్నాను.వచ్చే పెన్షనుతో పిల్లడిని పెంచి పెద్ద చేశాను.నేను తిన్నా తినక పోయినా వాడికి పెట్టి కంటికి రెప్పలా చూసుకున్నాను.మా కష్టాలు గట్టెక్కి నా కొడుక్కి వాళ్ల నాన్న ఆఫీసిలోనే అకౌంటెంటుగా వుద్యోగం వచ్చింది.మరుచటి సంవత్సరమే చక్కని పిల్లని చూసి పెళ్లి చేశాను.కోడలు అడుగు పెట్టిన నెల్లాళ్లనుంచి తన స్వభావం బయట పెట్టడం ప్రారంభించింది.నా కొడుకు యింట్లో వున్నంత వరకు ఎంతో వినయంగా ప్రవర్తిస్తూ ఆఫీసుకెళ్లగానే సూటిపోటి మాటలనడం కొడుకుని కొంగున ముడేసుకున్నానని వాళ్లిద్దరూ స్వేఛ్చగా వుండే అవకాశమే లేదని అంటూండేది.

నా పంచ ప్రాణాలు నా కొడుకు చుట్టూనే అల్లుకున్నాయి.నేనెక్కకి పోవడానికి నాకెవరూ లేరు.అప్పటికీ సాయంత్రం పూట వంటచేసి ఏగుడికో పోయి కూర్చుని భోజనాల సమయానికి వచ్చేదాన్ని.రోజూ ఎక్కడికమ్మా వెళ్లిపోతావని కొడుకడిగితే రామా కృష్నా అనుకుందికి గుడికెళ్లానంటూ సర్ది చెప్పేదాన్ని మూడేళ్లు మూడు యుగాల్లా గడిచాయి.నాకొడుకు నన్ను వదలడు నా కోడలు నేను వాడి ఛాయలకు పోయినా సహించదు.ఒక సారి చూచాయగా నాకొడుకుతో చెప్పాను ప్రతి క్షణం నాగురించి తలవడం కాదు భార్యా భర్తలిద్దరూ అన్యోన్యంగా వుండాలని.అన్యోన్యంగాలేమని సందేహమెందుకొచ్చింది నాకు నీ తరువాతే ఎవరైనా అంటూ ఖచ్చితంగా చెప్పాడు.అలా అనకూడదు భార్య తరువాతే మిగతా వాళ్లంతా అన్నాను.తారాజువ్వలా లేచాడు.యిన్ని కష్టాలు పడి కంటికి రెప్పలా పెంచావు యిప్పుడు తనగురించి అలోచిస్తావేమిటి భార్యనైనా వదులుకుంటాను గాని కడుపు కట్టుకుని పెంచిన తల్లిని వదిలుకోను అన్నాడు.

యిక నేనా యింట్లో వున్నకొద్దీ ఘర్షణ పెరగడమేకాని తగ్గదు. నాకు చదువు లేదు బయట ఎలా బ్రతకాలో తెలియదు.నాకొడుకు వున్న చుట్టుపక్కల నేనేదయినా అఘాయిత్యం చేసుకుంటే కోడల్ని బ్రతకనివ్వడు తను బ్రతకడు.హైదరాబాడు వస్తున్న రైలెక్కేశాను. దిగాక టిక్కెట్టు అడిగితే వెర్రి చూపులు చూశాను.నా అవతారం చూసి కసిరి పంపేశాడు.

అలా నడుస్తూంటే పెద్ద బిల్డింగు కనిపించింది.దాని పైనుంచి దూకితే చావడం ఖాయం అని మెట్లు ఎక్కుదామని వెళ్తుంటే ఒక కుర్రాడు లిఫ్టుంది మామ్మగారూ రండి ఏ ఫ్లోరుకెళ్లాలి అడిగాడు పన్నెండు అన్నాను తడుముకోకుండా.రండని తీసుకెళ్లి పన్నెండో అంతస్తు రాగానే బయటికెళ్లమని తను యింకా పైకి వెళ్లాడు.బయటకు వచ్చాను.వరండాలావుంది అడ్డంకులేమీ లేవు ఎవరూ చూడటంలేదని చూసి గోడేక్కి దూకానుచీర ఏదో కొక్కేనికి తగిలుకుంది ప్రాణ భయంతో చేతికి అందినది గట్టిగా పట్టుకున్నాను చావులో కూడా దురదృష్టమే వరించింది”. కాసేపు కరువుతీరా ఏడవనిచ్చాం తరువాత తనే ప్రశ్నించింది “మీరంతా ఎవరు?యిదెవరిల్లు?”అంటూ. అప్పుడు మాగురించి వివరించాం.రెండుచేతులెత్తి నమస్కరించి నన్నిక్కడే వుండనివ్వండి నేను డబ్బులేమీ యిచ్చు కోలేను గాని మీ అందరికీ సహాయంగా పనులు చేయగలను.యిక కొడుకు కోడలి గురించి ఆలోచించను.రామా కృష్ణా అనుకుంటూ మీ అందరితో వుండనివ్వండిఅంది ప్రాధేయ పూర్వకంగా. మిగతా మెంబర్లతో సంప్రతించి ఆమెని మాతో వుంచాం.

ఆశ్రమం మొదలై ఆర్నెల్లయింది ఓవరాల్ గా చూసుకునే మనిషిని అపాయింట్ చేస్తే బాగుంటుందని తమ సంస్థలో పని చేసేందుకు ముఫై అయిదు నలభై మధ్య వయసు కలిగి గ్రాడ్యుయేట్ అయి ఎటువంటి బాదరబందీ లేకుండా ఆశ్రమంలోనే వుండి బాగోగులు చూసుకునేందుకు కావాలని ప్రకటన యిచ్చారు.

వీరి ప్రకటన చూసి యిద్దరే వచ్చారు.ఒకామె నలభైయ్యేళ్లు భర్త త్రాగుబోతు రోజూ వచ్చి హింసిస్తుంటాడు.యిద్దరు పిల్లలు పన్నెండు  పది క్లాసులు చదువుతున్నారని  చెప్పింది. ప్రకటన పూర్తిగా అవగాహన చేసుకోలేదో లేక తన అవసరం కోసం వచ్చిందో ఆమెని లాభం లేదన్నాం.

రెండో ఆమె యిరవైయెనిమిదేళ్లు భర్త మిలటరీలో చేస్తూ చనిపోయి రెండేళ్లయిందని.నా అన్నవాళ్లెవరూ లేరని చెప్పింది. యివన్నీ సరిపోయేయి కాని వయసు ముఫై అయిదేళ్లుండాలని ప్రకటనలో రాశాముకదా అంటే వయసుదేముంది సార్! నా జీవితానుభవం యిరవైయెనిమిదేళ్లకే అరవైయేళ్లంత వుంది అంది.కామర్సు గ్రాడుయేట్ అని నాలుగైదు ఆఫీసులు మారాననీ ఎక్కడికెళ్లినా ఏవో చేదు అనుభవాలే ఎదురయాయని మేము రాసిన వయసు లేకపోయినా పెద్దవాళ్లమధ్య ఒక పిల్లలా అందరికి సేవచేస్తూ పొట్ట పోషించుకునేందుకు నిర్ణయించుకున్నానని చెప్పింది.

ఆమె మాటల్లోని నిజాయితీ మమ్మల్ని ఆకట్టుకుంది.అపాయింట్ చేసుకున్నాం. ఆమె పేరు సుగుణ.
ఆమె ఆశ్రమంలో అడుగు పెట్టినప్పటినుంచి అశ్రమం చైతన్య శ్రవంతిగా మారింది.అచ్చటనున్న అందరినీ తాతయ్యగారూ బాబయ్యగారూ బామ్మగారూ పిన్నిగారూ అంటూ బంధుత్వంతో పిలుస్తూ వారి వారి అవసరాలు తీరుస్తుండేది.సత్యానంద్ గారిని మాత్రం బాబు గారూ అని పిలిచేది. ఒకరోజు నవ్వుతూ అడిగారు “ఏమ్మా! సుగుణా అందరితో బంధుత్వం ఏర్పరుచుకున్నావు నాతో బంధుత్వం లేదా?అని ప్రశ్నిస్తే

“ఎందుకు లేదు బాబుగారూ భగవంతునికి భక్తునికి మధ్య వున్న బంధుత్వం.ఇంతమందికి మనోవేదనతీరే వుపాయం చూపిన మీరు అందరికీ దేముడే!అదే బంధుత్వం మనది”.అనగానే సత్యానంద్ ఆప్యాయంగా తల నిమురుతూ “నువ్వొచ్చాక నాకు కాస్త రిలీఫ్ గావుందమ్మా.నేను మూడు నెలలకోసం అమెరికా వెళ్దామనుకుంటున్నాను”.అంటే”బాబుగారూ మూడు నెలల్లో ఈ సంస్థ స్థాపించి ఒక సంత్సరం అవుతుంది కదా ఆ సమయానికి మీరు వచ్చేయండి చిన్న ఫంక్షన్ ఏర్పాటుచేద్దాం”. అనగానే అలాగేనమ్మా నీ మీద యింకొక బాధ్యత పెడుతున్నాను.యిక్కడ చేరే వాళ్లంతా తమ తమ పరిస్థితులను కొంత చెప్పారు.అన్నింటినీ ఒక డైరీలో హింట్సులా రాశాను.అందరూ యిక్కడే వున్నారు కాబట్టి హింట్సుని కాస్త్ వివరంగా కనుక్కుని ఒక కధలా తయారు చెయ్యి. ముందు తరాలవారికి వుపయోగ పడవచ్చు.ఇక ముందు ఎవరైనా వస్తే వాళ్ల వివరాలు కూడా తెలుసుకుని రాసి వుంచు” సరేనంది . సత్యానంద్ వెళ్లేముందు అందరికీ వాళ్ల వాళ్ల డ్యూటీలు సెట్ చేసి అన్నీ సక్రమంగా జరిగేటట్లు చూడమని సుగుణకి అప్పచెప్పేడు.

అతను అమెరికా వెళ్లే ముందు రోజు ఒక ఫోను వచ్చింది.హైదరాబాదులో పోష్ లొకాలిటీ నుంచి, తమకు తాముగా రాలేమని ఎవరినైనా సహాయం పంపితే వస్తామన్నారు. సుగుణని పంపితే వచ్చారు. ముసలాయనకి డెభ్భైఅయిదేళ్లు భార్యకి డెభ్భైయేళ్లు వుంటాయి. సుగుణ డ్రైవరు నడిపించి తెచ్చారు.ఆఫీసుగదిలో కూర్చోపెట్టాము సత్యానంద్ శివకామయ్య యిద్దరూ కూర్చుని వారి గురించి వివరాలడిగేరు.

“నా పేరు సారంగపాణి నా భార్య ప్రియంవద.మాకు నలుగురు పిల్లలు.ఆస్థి పాస్థులకు లోటు లేదు.ముగ్గురు మగ పిల్లలు అమెరికాలో సెటిల్ అయారు. అమ్మాయి సింగపూరులోవుంది.వాళ్లంతా వెళ్లిన కొత్తలో మూడేళ్లకి అయిదేళ్లకి వచ్చేవారు మమ్మల్ని చూడటానికి.ఇప్పుడు వాళ్ల పిల్లలు పెద్ద చదువులకి వచ్చాక యిండియా రావటం తగ్గిపోయింది. వచ్చినా చుట్టం చూపుగా మూడునాలుగు రోజులు మావద్ద వుండి సైట్ సీయింగుకని పిల్లలిని తీసుకు వెళ్లిపోతారు. నాకు శక్తి వుడిగిపోయింది నడవలేకపోతున్నాను. నాభార్య కూడా వయసు పైబడి పూర్వంలా తిరగ లేకపోతోంది.మా యింట్లో మేము కాక నౌకర్లు అన్నింటికీ వున్నారు.

ఈ మధ్య మా అసహాయత చూసి చెప్పకుండా శలవలు పెట్టేయటం చేయవలసిన పనులు సమయానికి చేయక అడిగితే తల బిరుసు సమాధానాలు చెప్పడం చేస్తున్నారు. డబ్బు వుండగానే సరిపోదు.శరీరంలో శక్తి అయినా వుండాలి లేదా పిల్లలన్నా దగ్గరుండాలి.ఈ రెండూ కాని పక్షంలో యిటువంటి సంస్థలే మమ్మల్ని ఆదుకుంటాయని భావిస్తున్నాను. మేము అక్కడ వుంటే మాజీవితాలకి రక్షణలేదు.చిన్నగా నవ్వి ఈ వయసులో రక్షణ దేనికి అనిపిస్తుంది గాని చావు సహజంగా రావాలిగాని మాధనం కోసం ఆశపడి ఎవరు ఎలాంటి అఘాయిత్యానికి పూనుకుంటారో తెలియదు. మీరు చెప్పిన ఫీజే కాక చెరో లక్ష విరాళంగా యిస్తాను.వైద్యానికి మందులకి నేనే ఖర్చు చేస్తాను.మా ఆలనా పాలనా చూసే బాధ్యత మాత్రం మీది”.అనగానే

“తప్పకుండా మీ డబ్బు కోసం కాకకున్నా మీ వయసుని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటాం మీరెప్పుడు వస్తారో చెపితే మీకోసం రూము అరేంజి చేస్తాము”అన్నారు శివకామయ్య. “అయితే యింకొక విన్నపం మా కారు యిక్కడే వుంచుదాం మాకేకాదు ఎవరికి అవుసరమయినా వాడుకోవచ్చు”.

“సరే అలాగే చేద్దాం మేము ఒక వేను కొనాలన్న వుద్దేశంలొ వున్నాం నేను రేపు అమెరికా వెళ్తున్నాను మూడు నెలల్లో తిరిగి వస్తాను అవుసరమయితే తొందరగానే వచ్చేస్తాను”అన్నారు సత్యానంద్.

వాళ్లు వెళ్లగానే సుగుణ అంది” ఈ రోజుల్లో ఓల్డేజి యింత అభిశాపమా?వీళ్లని జాగ్రత్తగా చూసుకుని మన సంస్థ పేరు నిలపెట్టాలి”. నీ మీద నాకు నమ్మకముందమ్మా నువ్వు కారు డ్రైవింగు నేర్చుకొ ఏ అర్ధరాత్రయినా అవుసరమైనప్పుడు సమయానికి చేరగలుస్తాము” అన్నారు సత్యానంద్.వాళ్లిద్దరూ మర్నాడే వచ్చి సభ్యులుగా చేరారు.

సత్యానంద్ అమెరికా వెళ్లినా శివకామయ్య రంగనాధంలు అన్నీ చూసుకునేవారు. సత్యానంద్ వెళ్లిన వారానికి ఒకాయన వచ్చ్చాడు మనిషి చాల ఆందోళన పడుతున్నట్లు వుండెను.ఆఫీసులో కూర్చోపెట్టి వివరాలు సేకరించాం. అతని పేరు వెంకట్రామయ్య,బట్టల వ్యాపారం సిటీలో పెద్ద షోరూం వుంది. అయిదుగురు పిల్లలు నలుగురు కొడుకుల్లో పెద్దవాడు వ్యాపారం చూసుకుంటున్నాడు. మిగతా వాళ్లు వుద్యోగస్తులు.యిద్దరు ఈ వూరే ఒక్కడు చెన్నైలో వున్నాడు. కూతురు భర్తతో ఢిల్లీలో వుంటోంది.నలుగురు కోడళ్లలో యిద్దరు వుద్యోగస్తులు యిద్దరు యింటిపట్టునే వుంటారు.

“ఈ వివరాలతో మీరు యిక్కడికి వచ్చిన కారణం?” “అదే చెప్తున్నాను నా భార్య లక్ష్మి పిల్లల పెళ్లిళ్లయి యిన్ని సంత్సరాలయినా ఎవరింట్లోను వారం రోజులు మించి వుండదు. పైగా కోడళ్లని ఏదో ఒకటి అంటూంటుంది. వాళ్లు చేసే పని నచ్చదు,పోనీ అమ్మాయి వద్ద నాలుగు రోజులుందామని వెళ్తే అక్కడకూడా ఏదో అసంతృప్తి కోడళ్లు జవాబివ్వకుండా మా యిద్దరి అవసరాలు జాగ్రత్తగా చూసుకుంటారు. అయినా ఆమెని మెప్పించలేరు.

ఈ విధంగ ఎవరిదగ్గరా వుండలేకపోతే మేమిద్దరమే వుందామని వేరే కాపురం పెట్టాను. అక్కడ మూడు రోజులు వుండలేకపోయింది.డాక్టరుని సంప్రతించాను.డాక్టరనటం తనకన్నా చిన్నవాళ్ల మధ్య తన ఆధిక్యత చూపించుకుందికి అలా ప్రవర్తిస్తున్నదేమో తన వయసు వాళ్లతో మసలుతూ వాళ్ల సమస్యలు అవీ గ్రహిస్తే ఏమైనా మార్పు కనిపించవచ్చునని సలహా యిచ్చారు. ఈ సంస్థలో ఆమెని వుంచవచ్చునా?మీరడిగిన ఫీజు యిచ్చుకుంటాను”.అంటూ ఆగారు,ఏంచెప్పాలో శివకామయ్యగారికి తోచలేదు

.రంగనాధంగారు చెప్పారు”అయ్యా మీ సమస్య అంత సులువుగా పరిష్కారం కాకపోవచ్చు.మీ భార్యనొక్కరినే వుంచడంకాక మీరిద్దరూ ఒక వారం రోజులకోసం వచ్చి వుండండి.మేమంతా ఆమెని అర్ధం చేసుకుందికి ప్రయత్నిస్తాము.వారంరోజులు యిక్కడ ఆమె బాగానే ప్రవర్తిస్తే ఒక నెలకోసం ఫీజు కట్టండి.తరువాత ఆమె యిక్కడ అడ్జెస్ట్ అవగలరనుకుంటె సభ్యులుగా చేరండి కాని ఎట్టి పరిస్థితిలోను ఆమెని ఒక్కర్తినీ యిక్కడ వుంచకండి. వుండదలుచుకుంటే యిద్దరూ వుండండి” అంటూ సలహా యిచ్చారు.

ఈ సలహా బాగుందని మర్నాడు చిన్న బేగుతో వచ్చారు.వీళ్లందరూ యిక్కడెందుకున్నారని ప్రశ్నించింది లక్ష్మి.ముసలి వయసులో ప్రశాంతత కోసం అందరూ ఒక చోట చేరామని చెప్పాం. వారం రోజులు ట్రయలుగా వుందామని వచ్చిన వెంకట్రామయ్య లక్ష్మిలు ఆశ్రమ వాతావరణం అందరి దిన చర్య చూసి ముగ్ధులయారు. ముఖ్యంగా లక్ష్మి అక్కడున్న ఆడవాళ్లందరి దగ్గర కూర్చుని వాళ్లగురించి విన్నాక తనెంత అదృష్టవంతురాలో అర్ధమయింది. తన పిల్లలు కోడళ్లు మనుమలు తననెంత అభిమానంగా చూసుకున్నా తనకెందుకు నచ్చేదికాదో బోధపడలేదు.అది వాళ్ల చర్యలలో కాదు తన అసంతృప్తి అని అర్ధం చేసుకుంది.వెంకట్రామయ్య మరో ఆలోచన లేకుండా సభ్యత్వం తీసుకున్నాడు. వూరిలో తన వాళ్లంతా వున్నారు కావున ఎప్పుడైనా చూడాలనుకుంటే వెళ్లవచ్చన్న అభిప్రాయం వెలిబుచ్చాడు.

లక్ష్మి మనస్తత్వంతోనే విచిత్రంగా ఫీలవుతున్న ఆశ్రమ సభ్యులకు మరొక విచిత్ర స్వభావంగల వ్యక్తి భానుమూర్తి రావడంతో ఖంగు తిన్నారు . భానుమూర్తిగారిని అతని కొడుకు తీసుకు వచ్చాడు. భానుమూర్తి గురించి జయ రాంని అడిగారు శివకామయ్యగారు”మీ నాన్నగారిని యిక్కడ ఎందుకు వుంచదలిచారు?”

“ఏముంది నా పీడ వదిలించుకుందికి” అని దురుసుగా జవాబిచ్చారు భానుమూర్తిగారు.డెభ్బైఏళ్లవ్యక్తిలో వుండవలసిన పెద్దరికం గాంభీర్యం లేవుసరికదా చిన్నపిల్లాడిలావుంది ఆ జవాబు.”ప్లీజ్! నాన్నగారూ! సార్! మా నాన్నగారిముందు నేనేం చెప్పినా అతను హర్టవుతారు. మేము అతన్ని సరిగా చూసుకోలేకపోతున్నాము. మీ ఫేజు సంవత్సరంది అడ్వాన్సుగా కడుతున్నాను. అతను యిక్కడ వుండటానికి యిబ్బంది పడితే నాకు తెలియజెయ్యండి నేనే వచ్చి తీసుకెళిపోతాను.నాన్నగారూ!యిక్కడంతా మీ వయసువాళ్లే కాలక్షేపానికి లోటుండదు.మీకు నచ్చకపోతే బలవంతమేమీలేదు.నేను వచ్చే వారం మళ్లీ కలుస్తాను”.అంటూ చిన్న పిల్లాడిని బోర్డింగు స్కూల్లో వదిలినట్లు విడిచి వెళ్లాడు జయరాం.

భానుమూర్తిగారినెలా టాకిల్ చెయ్యాలో కాస్త తికమక అనిపించింది . రూము చూపించి యిక్కడి పద్ధతులు వివరించింది సుగుణ.  ముభావంగా తలూపాడు.మర్నాడు భానుమూర్తి అలా తిరిగి రావాలని బయలుదేరితే బయట వాచ్ మేను అడ్డుకున్నాడు. చిరాకుగా తిరిగివచ్చి శివకామయ్యగారితో పేచీవేసుకున్నాడు.” బయట తిరగకూడదంటే యిదేమన్నా జైలా? ఎటువంటి స్వతంత్రం లేకుండా యింత వయసు వచ్చాక యిక్కడెందుకు వుండటం?” అంటూ గట్టిగానే వాదించాడు.

శివకామయ్య మాత్రం శాంతంగా. “అలా బయట తిరగాలంటే ఆశ్రమం చుట్టూ యింత ఆవరణ వుంది,అక్కడ తిరగండి ఒక్కరూ బయట యీ వయసులో తిరగడం మంచిదికాదు. మీ మంచి చెడ్డల  మా బాధ్యత మాది మీ పిల్లలకి మేము జవాబిచ్చుకోవాలి సంస్థలో వుంటే యిక్కడి నిబధనలు పాటించాల్సి వుంటుంది ప్రతివారికి అంతమాత్రాన జైలనుకుంటే ఎలా? అందరూ ఎలా కాలక్షేపం చేస్తున్నారో అలాగే మీరూ కాలక్షేపం చెయ్యండి. పేపర్లున్నాయి పుస్తకాలున్నాయి. యివికాక యింతమందిమి వున్నాం మీ ఫీలింగ్సు షేర్ చేసుకోవచ్చు. అందరం యించుమించు వొకే వయసువాళ్లమే”. ఇన్ని మాటలు విన్నాక ముభావంగా తన గదికి వెళ్లిపోయాడు. యితన్ని టేకిల్ చెయ్యడం కష్టమే అనుకున్నారు శివకామయ్యగారు మనసులో.

జయరాం వధ్ధ నుంచి ఫోను వచ్చింది,”నాన్నగారు ఎమీ యిబ్బంది పెట్టడం లేదుకదా?”వెంటనే ముందు రోజు జరిగినది చెప్పి “అసలు అతని స్వభావం అంచనా వెయ్యడానికి మీ ఫేమిలి బేక్ గ్రౌండ్ తెలిస్తే తగిన విధంగా చర్య తీసుకోగలం.”శివకామయ్యగారు చెప్పారు ” క్షమించండి మీకు శ్రమ కలిగిస్తున్నాను .మీకు కవర్లో పెట్టి యిచ్చిన చెక్కుతోపాటు మా కుటుంబం గురించి వివరంగా రాసి పెట్టాను.మా నాన్నగారి ముందు ఆవిషయాలేమీ చెప్పలేను. అంధుకే ముంధుగా రాసి పెట్టాను. అలా రాసినట్లు తెలిసినా అతనికి కోపం వస్తుంది. ప్లీజ్! మీరది చదువుకుని అర్ధం చేసుకోండి. నేను రెండు మూడు రోజులకోసారి ఫోను చేస్తాను.పరిస్తితి యిబ్బందికరంగా వుంటే అతన్ని తీసుకెళిపోతాను. మాకెలగూ అలవాటే అతని ప్రవర్తన. ఏమయినా మార్పు వస్తుందేమోనని మీలాంటి పెధ్ధలమధ్య వదిలి పెట్టాను తప్ప మాకు తండ్రి బరువై కాదు. అతని ప్రవర్తన నుంచి వూహ తెలుస్తున్న మా పిల్లల మీద ప్రభావం పడుతోంది.ఇంతకన్నా వేరే కారణం లేదు. మరోలా భావించకండి” అర్ధిస్తున్న స్వరంతో చెప్పాడు జయరాం.

“వర్రీ అవకండి మా శాయ శక్తులా ప్రయత్నిస్తాము”.అంటూ ఫోను పెట్టేశారు.సుగుణని పిలిచి జయరాం వుత్తరం యిచ్చి దీనిని స్టడీ చేసి భానుమూర్తిగారి స్వభావాన్ని అంచనా వెయ్యడానికి ప్రయత్నం చెయ్యి. మన సంస్థ సాఫీగా నడుస్తున్నాది. లక్ష్మిగారిని భానుమూర్తిగారిని దారిలో పెట్టడం మనకొక చాలెంజే!”అంటూ కాగితలని సుగుణకిచ్చారు.అమె చదవడం మొదలుపెట్టింది.

శ్రీ సత్యానంద్ గారికి
నమస్కరించి వ్రాయునది. మీసంస్థలో చేరే ముందు ఫేమిలి గురించి వ్రాయాలని మీ అప్లికేషనులో వుంది ఈ వివరాలన్నీ రాస్తున్నాను. మరోలా భావించకండి.మా అమ్మ నాన్నలకు మేము నలుగురు పిల్లలం ఒక అక్క యిధ్ధరు తమ్ముళ్లు నాకు. మా నాన్నగారు ఒక ప్రైవేటు కంపెనీలో చేశారు.మా చదువులు పూర్తయేలోపునే మా అక్క పెండ్లయింది. మా ముగ్గురం మంచి వుద్యోగాల్లో సెటిలయాం మా పెళ్లిళ్లయాయి కాని మా చిన్నతనంనుంచి మా అమ్మ వద్దనున్న చనువు  మా నాన్నగారి వధ్ధ వుండేదికాదు. మా నలుగురిలో ఎవరినీ చేరదియ్యడంగాని ముద్దు చెయ్యడంగాని మేమెరుగం.ఆ ముధ్ధు మురుపాలన్నీ మా అమ్మ వధ్ధే లభించేవి. చివరికి అతని రిటైర్మెంటు తరువాత కూడ అతని అవుసరాలు చూసేది సలహా చెప్పేది మా అమ్మే. అతని భావాలు మా వరకు వచ్చేవి కాదు.

మా పిల్లలు జూనియర్ కాలేజీకి వచ్చారు అయినా మా నాన్నగారంటే మాకు జంకు. ఇటువంటి పరిస్తితిలో రెండేళ్ల క్రిందట మా అమ్మ జబ్బు చేసి చనిపోయింది.అప్పటినుండి మా నాన్నగారు మా ఎవరివధ్ధ అద్జస్ట్ అవలేక పోతున్నారు. మా అక్క కూడా తీసుకెళ్లింది. వారం రోజులకన్నా వుండలేకపోయారు నేను మా తమ్ముళ్లు అడిగాం అతనికి మాలో ఎవరి వధ్ధ సంతోషంగా అనిపిస్తే అక్కడే వుండమని అతని జవాబు విన్నాక మాకేమీ పాలు పోలేదు.”మీరంతా మీ మీ పనుల్లో వుంటారు. మీ అమ్మ వుంటే నా ఆలనా పాలనా చూసేది.తనులేని ఏ ప్రాంతం నాకు నచ్చటం లేదు నన్ను విసిగించకండి”.యిది వినాక ఏం చెప్పాలో తెలియలేదు. మా బంధువు ఒకాయన సలహా యిచ్చారు మీ సంస్థలాంటి చోట వుంచితే అందరూ అతని వయసు వాళ్లే వుంటారు.వాళ్ల మధ్య యితని మనసు కుదుట పడుతుందేమోనని. మీ అందరి మధ్య కూడా అతను వుండలేకపోతే యిక మా అదృష్టం అంతే అనుకుంటాం.                                                                                                        కృతజ్ఞతలతో శలవు .                                                                                                  జయరాం

ఈ వుత్తరం చదివి దీర్ఘంగా నిట్టూర్చింది సుగుణ. యిప్పటివరకు వున్న సభ్యులతో సాఫీగా గడుస్తోంది గాని యికపై లక్ష్మిగారితో భానుమూర్తిగారితో ఏం సమస్యలొస్తాయో అనుకుంది. ఒక నెల గడిచేసరికి లక్ష్మిలో మార్పు వచ్చింది. అందరి విషయాలు విన్న తరువాత ఆమె అనేది” నా పిల్లలు మనుమలు నన్నెంత అభిమానంగా చూసుకునే వారు నేనే అత్తగారిలా పెత్తనం చెలాయించాలని వాళ్లనేదో ఒకటి అనేదాన్ని”. సీతమ్మ ఆమెని వూరడించి,” మనిషన్నాక ఏవో బలహీనతలుంటాయి.అవి మనకి తెలియకుండానే బయట పడుతుంటాయి. మీలా ఒప్పుకునేవాళ్లెంతమంది చెప్పండి?”

ఒక రోజు సారంగపాణిగారు సుగుణని పిలిచి “కాలక్షేపం అవటం లేదమ్మా పుస్తకాలు చదవాలంటే కళ్లు లాగుతున్నాయి”. అనగానే మీకు నచ్చిన పుస్తకం యివ్వండి కాసేపు చదువుతాను” అంది. “కాసేపు ఏమైనా కబుర్లు చెప్పు అన్నారు.” మాలాంటి వాళ్లకి మనుషులు మాటలు కావాలి అంతకన్నాఏం అక్కర లేదు”. అంది ప్రియవద నవ్వి “బాబయ్యగారూ మనం రోజూ ఒక టైము అనుకుని టిఫిను తినే ముందు తయారై హాలులో అందరం కూర్చుని పాటలు లేదా శ్లోకాలు చదువుకుని అరగంట ప్రార్ధనలా చేసుకున్నాక డైనింగు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టిఫిను చేసి ఎవరి గదులకు వాళ్లు ఎవరి పనులకు వాళ్లు వెళితే బాగుంటుందికదా? యిది నా అయిడియా మీరు పెద్దవాళ్లు మీరు ఓకె అంటే అందరితో సంప్రతించి రేపటినుంచి అలా చేద్దాం”.

“ఈ అయిడియా బాగుందమ్మా టైము నిర్నయించు నేను ఆంటీ రెడీగా వుంటాం.నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లాలి”.”అదెంతపని అందరికీ ఈ మాట చెప్పి వస్తాను”అంటూ లేచింది.అందరూ సరేనన్నారు,భానుముర్తిగారు మాత్రం అంత ప్రొద్దుటే లేచే అలవాటు లేదన్నారు.”ఒక రోజు ట్రై చెయ్యండి అంకుల్ అందరం కలిసి ప్రార్ధన చేసి తిఫిను తిని కబుర్లు చెప్పుకుంటే మనం ఒంటరి వాళ్లం కాదు అన్న ఫీలింగు వస్తుంది” .“సరే చూద్దాం ఉదయం నా తలుపు తట్టు తయారవుతాను” అన్నారు.”అమ్మయ్య! “అనుకుంది.

మర్నాడు ఉదయం అందరూ ఎనిమిది గంటలకు హాలు చేరుకున్నారు.అందరికీ కుర్చీలు వేసి వుంచింది.ఒక చిన్న టేబిలు మీద దేముడి పఠం పెట్టి పూలదండ వేసి దీపం వెలిగించింది.వచ్చిన వాళ్లంతా బాగుందమ్మా సుగుణా అన్నారు శుక్లాం బరధరం విష్ణుం అంటూ గణేషు స్తుతి చేశారు.లక్ష్మి ఒక పాట పాదింది అందరూ ఫాలొ అయారు.మీనాక్షి అష్టకం చదివింది.”మరి మగవాళ్లేం పాడరా?” అంది సుగుణ సారంగపాణిగారు కృష్ణుడి మీద పాట పాడేరు.అతని కఠం చాలా బాగుంది.ఆంటీ మీరు పాడరా?” అడిగింది సుగుణ ” రేపు మేమిద్దరం కలిసి పాడుతాం” అంది ప్రియంవద. ప్రార్ధనా కార్యక్రమం మొదలు పెట్టాక అందరిలో వుత్సాహం పెరిగింది మరిచిపోయిన పాటలు ఖాళీ సమయాల్లో గుర్తు చేసుకుని మరీ పాడుతున్నారు.

మనుషులు ఏదో ఒక పనిలో నిమగ్నమయి వుంటే అనారోగ్యాలగురించి తలుచుకుని చింత పడటం తగ్గుతుందని సుగుణ అభిప్రాయం. భానుమూర్తిగారు రోజూ వుదయం ప్రార్ధనలో పాల్గొంటారు తప్ప పాటలో కంఠం కలపడం యిష్టం వుండదు. ఎవరు ఏ విషయం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా వాదించడం అతని అలవాటు. ఒక రోజు అతనితో మాట్లాడిన వాళ్లు రెండవ రోజు మాట్లాడటానికి యిష్టపడరు.ఈ కొద్దిమందితో యిలా వుంటే నెల రోజుల్లో యితను తిరిగి వెళిపోతారనుకునేది  సుగుణ. అదే మాట శివకామయ్యగారితో అంటే “అతనికి యింటరెస్టయిన సబ్జెక్టు ఏమిటో తెలిస్తే ఆ విషయం మీదే మాట్లాడితే సరిపోతుంది” అన్నారు. “అలా గ్రహించడం చాలా కష్టం బాబయ్యగారూ అతనికి ఏ విషయం మీద నిర్దుష్టమయిన అభిప్రాయాలున్నట్లు లేదు.చూద్దాం కాలమే అతన్ని సరి చేస్తుందెమొ”అంది.

ఒక రోజు అతన్ని లేపడానికి వెళ్లి తలుపు తడితే ఎంతకీ తియ్యలేదు.శివకామయ్యగారిని పిలిచింది.నలుగురూ  కంగారు పడుతూ వచ్చారు. బలవంతంగా తలుపు తెరిచారు. భానుమూర్తిగారు పూర్తి తెలివిలొ లేరు బట్టలలో వాంతి విరోచనం అయి ఆ దుర్గంధంలొ పడివున్నారు.అతని స్తితి చూసి అందరికీ నోట మాట రాలేదు. వెంటనే అంబులెన్సుకోసం ఫోన్ చేశారు. సుగుణ పూనుకుని ఆ దుర్గంధంలోంచి అతన్ని బయటికి తీసి   బాత్రూం వరకు సాయంపట్టి తీసుకెళ్లి శుభ్రం చేసి బట్టలు మార్చి పని మనిషి చేత పక్కబట్టలు మార్పించి ఫినాయిలు వేసి శుభ్రం చేయించింది యీలోగా అంబులెన్సు వచ్చింది.

హాస్పిటల్ చేరేక దాక్టరు చూసి కడుపు అప్సెట్ అయింది తప్ప మరే చికాకు లేదని యింజక్షనిచ్చి గ్లూకోజ్ ఎక్కించారు.సుగుణ అంది “అంకుల్ ని నేను చూసుకుంటాను.వాళ్లబ్బాయికి ఫోను చెయ్యండి వీలయితే వస్తారు లేదా యింతకు ముందెప్పుడయినా యిలా జరిగిందేమో కనుక్కోండి” అంది. “వద్దమ్మా ఈ పాటిదానికి అతన్ని కంగారు పెట్టడమెందుకు రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది ఆమాత్రం మనం చూసుకోలేమా?”అని శివకామయ్యగారన్నారు. సాయంత్రానికల్లా లేచి కూర్చున్నారు భానుమూర్తిగారు.

“సుగుణా నిన్న రాత్రి కడుపులో వికారం అనిపించి బాత్రూముకి వెళ్దామనుకునేలోపున పెద్ద వాంతి అయింది లేవలేకపోయాను.బెడ్దు పక్కన అలారం స్విచ్ వుందన్న మాట గుర్తు రాలేదు ఎంతసేపు అలా పడున్నానో తెలియలేదు.మీ అందరికీ శ్రమ కలిగించాను. ఆ గలీజంతా ఎవరు తీశారమ్మా? నాకు చాలా సిగ్గుగా వుంది”అన్నారు. “నేనే తీసాను అంకుల్, మనిషికి మనిషి సహాయం చేయకపోతే మరెవరు చేస్తారు?

“”నా భార్య వున్నప్పుడు యివన్నీ చూసుకునేది తను పోయాక నేను ఒంటరి వాడినయి పోయాను”.అనగానేసుగుణ నవ్వి “అంకుల్ మీ మేరీడ్ లైఫ్ ఎన్ని సంత్సరాలు గడిపారు?” “ముఫై ఏడు సంత్సరాలు”.

“మన ఆశ్రమంలో వున్న సీతమ్మగారు ఆర్నెల్ల వైవాహిక జీవితం గడిపాక భర్త దేశాలు పట్టిపోయాడు బ్రతికి వున్నాడో లేదో కూడా తెలియదు.ఆమెకున్న ధైర్యం మీకు లేదేంటి?యిక నా సంగతికొస్తే మిలట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుని అతను అవగాహన కాకముందే కార్గిల్ వార్ లో పోయాడు.మేమంతా వాళ్లు లేరే అని బాధపడుతూ కూర్చోలేదు. ఆమెకి నాకు వెనుక చూసుకుందికి ఎవరూ లేరు.అలాగని మేమెవరిని నిందిస్తాం క్షమించండి అంకుల్, జీవితం అన్నాక ఆటు పోటులు వస్తూనే వుంటాయి. మీకేం జీవితం చాల వరకు సాఫీగానే గడిపారు. అయిదుగురు పిల్లలున్నారు.  వున్నవాళ్లని లెక్క చెయ్యక పోయిన మీ భార్యని తల్చుకుంటూ మిగతా జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారు. మీకున్న శక్తిని ఏదైనా సహాయ కార్యక్రమాలకై వుపయోగించండి.మీకు చాలా తృప్తినిస్తుంది”.

“లేదమ్మా సుగుణా యిక మీదట నీ మాటల్ని పాటించడానికి ప్రయత్నిస్తాను.మొదటినుంచి పిల్లలు నా పెద్దరికాన్ని గౌరవించి నా అవసరాలు తీరుస్తుండాలని కోరుకున్నానే గాని వాళ్ల యిబ్బందులని లెక్క చెయ్య లేదు.ఏమయినా నా ప్రవర్తన సరికాదని ఎత్తి చూపిన వ్యక్తివి నువ్వే. చాల ధైర్యవంతురాలివి”. మర్నాడు అతన్ని డిశ్చార్జి చేశారు.

మర్నాడు వుదయం ప్రార్ధనా సమయానికి ముందుగా తయారయి సుగుణతో అన్నారు”సారంగపాణిగారిని నేను నడిపించుకు తెస్తాను నువ్వు వేరే పని చూసుకో”.భానుమూర్తిగారు సారంగపాణిగారిని నడిపించుకుంటూ వస్తున్న దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.వెంకట్రామయ్యగారన్నారు “నా భార్యే తలతిక్క మనిషనుకుంటే ఆమెని మించి ఈయన హెడ్ స్ట్రాంగ్ గా వుండేవాడు రెండు రోజులు హాస్పిటల్లో వున్నాక ఏమందు పని చేసిందోగాని మనుషుల్లో పడ్డాడు”.”మన సుగుణ యిటువంటి విషయాల్లో ఎవరితో ఎలా లౌక్యంగా మాట్లాడాలో బాగా తెలుసు అదే పనిచేసి వుంటుంది”.

మూడు నెలలు సాఫీగా సాగిపోయాయి.సత్యానంద్ అమెరికా నుంచి వచ్చారు.అతన్ని చూడగానే ఆత్మబంధువుని చూసినంత ఆనంధించారు.  ప్రశాంతాశ్రమం వార్షికోత్సవం చెయ్యడానికి ఏర్పాట్లు చేశారు. ఆశ్రమానికి కొద్ది దూరంలో వున్నఅ నాధాశ్రమం పిల్లల్ని పనిచేసేవారిని ఆరోజు ప్రొద్దుట భోజనాలు పెట్టారు.

సాయంత్రం కార్యక్రమానికి సోషల్ ఆర్గనైజర్ శ్రీనివాసమూర్తిగారిని ఆహ్వానించారు. పదిమంది కాలేజి స్టూడెంట్లు వృధుల జీవితాలపై ఆర్టికల్ రాస్తున్నారు వాళ్లని మీ ఫంక్షనుకి తీసుకురావచ్చా అనడిగారు శ్రీనివాసమూర్తిగారడిగారు. తప్పక తీసుకు రమ్మన్నారు సత్యానంద్. సాయంత్రం ఆరుగంటలకల్లా అందరూ వచ్చారు. స్టూడెంట్లలో ఆరుగురబ్బాయిలు నలుగురమ్మాయిలు వున్నారు.ప్రార్ధనా గీతం తరువాత సత్యానంద్ మాట్లాడేరు.

“ఈ ఆశ్రమం స్థాపించడానికి ప్రేరణ కలిగించిన సంఘటన నా చిన్ననాటి స్నేహితుడు శివకామయ్య వ్రాసిన వుత్తరం. ఆ తరువాత మేమిద్దరం కలిసి ఈ ఆశ్రమానికి ఒక రూపం కలిపించాం. ప్రారంభించిన సంవత్సరం పూర్తయేసరికి వారం క్రితం చేరిన సత్యనారాయణగారితో కలిపి పన్నెండు మంది సభ్యులయారు. విభిన్న మనస్తత్వాలుగల వ్యక్తులు తమతమ యింటి పరిస్తితులను బట్టి యిక్కడ చేరారు. అందరినీ ఒక తాటిమీద నడిపించే వ్యక్తి సుగుణ. వయసులో చిన్నదయినా అందరినీ తల్లిలా చూసుకుంటుంది.ప్రతివారి అలవాట్లను ఆకళింపు చేసుకుని అందరి అవసరాలను గమనించి సమయానికి అందేలా చూసుకుంటంది. ఆమె సేవ గురించి యీ రోజు చెప్పకపోతే యీ కార్యక్రమానికి పరిపూర్ణత ఏర్పడదు. మా సభ్యులు ఏ కారణంతో యిక్కడికి చేరారో వారు చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకుంటాము అందువల్ల వారి మనస్థితిఏమిటో అంచనా వేసే అవకాశం వుంటుందని అన్నీ నోట్ చేసుకున్నాం.ఆ మేటరంతా ఒక ఆర్డర్లో రాసి పెట్టింది సుగుణ.అది మీతో వచ్చిన స్టూడెంట్లకి వుపయోగపడుతుందంటే తెలుసుకోవచ్చు”.

అనగానే స్టూడెంట్లనుంచి ఒక అమ్మాయి లేచి “అంకుల్ మీలో ఎవరయినా ఒకరు తమ జీవిత విశేషాలు చెప్తే మేము వివరంగా తెలుసుకుంటాం.మీరు రాసిన మేటరు కూడా చదువుతాం.అయితే వివరంగా చెప్తే అందరం ఒకసారి వినటానికి వీలవుతుంది అభ్యంతరం లేకుంటేనే ప్లీజ్”అంది. అప్పుడు సత్యనారాయణగారు లేచి నేను కొత్తగా వచ్చాను, నాగురించి చాల కొద్దిగా చెప్పాను.ఈ రోజున వివరంగా చెప్తాను అలా చెప్పడంవలన మాగురించి తెలుసుకోవడమేకాదు యువతరం మీ బాధ్యత ఏమిటో పెద్దలయెడల ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో మీరే నిర్ధారించుకోండి.మా జీవితాలు సంధ్యా సమయానికి చేరుకున్నాయి. కాని వృధ్ధులంతా ఆశ్రమాలకి చేరుకునే పరిస్థితి కల్పించకుండా ఏం చెయ్యాలో మీరే నిర్నయించుకోండి. అంటూ తన గురించి చెప్పడం మొదలు పెట్టారు.

నా పేరు సత్యనారాయణ నేను క్రిమినల్ లాయరుగా చేసి రెటైర్ అయ్యాను. నాకు నలుగురు కొడుకులు.మా నాలుగోవాడు పుట్టినప్పుడు నా స్నేహితుడు “నీకేమిటోయ్ దశరధ మహారాజులా నలుగురు కొడుకులు.చాలా అదృష్టవంతుడివి”అనగానే ఏనుగు అంబారీ మీద వూరేగినంత సంబరమయింది.భార్య కాంతం అనుకూలవతి.లాయరుగా సంపాదనకు లోటు లేదు.అంతో యింతో తాతలనాటి ఆస్తి యిల్లు వున్నాయి. స్వంత వూరు హితులు స్నేహితులు జీవితం పూలబాట మీద నడుస్తున్నట్లుండేది. మా పెద్దవాడు రమేష్ చదువులో చాలా చురుకు పదవతరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఏ సబ్జెక్ట్ తీసుకుంటావని అడిగితే తనకి మెడిసిన్ చదవాలనుందన్నాడు. లా చదివితే నా ప్రాక్టీసు అందుకోవచ్చు కదా అంటే “వద్దు నాన్నా అన్ని కాలాల్లోను ఆ నల్ల కోటు తొడుక్కుని కోర్టుల చుట్టూ తిరగడం నాకిష్టం లేదు అయినా మెడిసిన్ చెప్పిస్తారా లేదా?”అంటూ ఖండించాడు.”వూరికే అడిగాను కన్నా నీకు నచ్చిన సబ్జెక్టు చధువుకో “అన్నాను.పన్నెండో క్లాసు తరువాత ఈజీగా మెడిసిన్ లో సీటు దొరికింది.

యిక రెండో వాడు పదకొండో క్లాసుకి రాగానే అడిగాను మేథ్సు తీసుకుని యింజినీరింగు చదుతానన్నాడు.లా చదవమని సూచనప్రాయంగా అడిగితే వాడి జవాబు విని ఆశ్చర్యపోయాను.”పగలనక రాత్రనక నేరాలు నేరస్థుల గురించి ఆలోచిస్తూ పెద్ద పెద్ద లా పుస్తకాలు తిరగేస్తూ మీరేం సుఖపడ్డారు నాన్నా?నాకయితే ఒక్క రోజు కూడా వూపిరి సలపదు మీ లా పుస్తకాల మధ్య నేను సాఫ్ట్ వేర్ యింజినీరింగు చేద్దామనుకుంటున్నాను. దాని కోసమే కృషి చేస్తాను”

నా పిల్లలకి నా వృత్తిమీద యింతటి ఘోరమయిన అభిప్రాయాలున్నాయని తెలియదు. చెప్పడమే కాదు ఎంట్రన్సులో మంచి రాంకు తెచ్చుకుని కంప్యూటర్ సైన్సులో సీటు సంపాదించుకున్నాడు సురేష్. వున్న యిద్దరినీ అడిగే సాహసం చెయ్యలేదు. మిత్రులు బంధువులు మా పిల్లల ప్రగతిని మెచ్చుకుంటూంటే ఎంతో గర్వంగా ఫీలయాను. పెద్దవాడు ఎం బి బిఎస్ పూర్తి చేసి కార్డియాలజీలో ఎమెస్ చెయ్యడానికి అమెరికా వెళ్లాడు. రెండేళ్ల తరువాత సురేష్ యింజినీరింగు పూర్తి చేసి ఎమెస్ చెయ్యడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ కూడా అన్నదమ్ములిద్దరూ ఒకరు దక్షిణప్రాంతం యింకొకడు ఉత్తరప్రాంతం. నా సంపాదన  మీద వారి చదువులకై అధారపడలేదు. ఇక మూడో వాడు సారధి వంతు రాగానే ఏ సబ్జెక్టు చదువుతావని అడిగితే ఏ చదువు చదివినా వుదయం ఆఫీసుకెళ్లి సాయంత్రం యింటికి వచ్చి భార్యా బిడ్డలతో హాయిగా గడిపే వుద్యోగం చేస్తాను సబ్జెక్టు ఏది దొరికినా ఫరవా లేదు అన్నాడు.మేథ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.బనారస్ యూనివర్సిటీలో పి హెచ్ డి చెయ్యడానికి వెళ్లాడు .

ఇక చిన్నవాడు మిగిలాడు. వాడిచదువు, వీళ్లందరి పెళ్లిళ్లు ఎన్ని బాధ్యతలు మిగిలాయి. అనుకుంటూనే యాభయ్యో పడిలో పడ్డాను. కాంతం రోజూ సణుగుతుండేది.”నలుగురు పిల్లలన్నమాటే గాని పెద్ద చదువులంటూ తలో దిక్కు వెళ్ళిపోతున్నారు,మన దగ్గర వుండేదెవరు” అంటూ.”వాళ్ల భవిష్యత్తుకై చదువుకుందికి వెళ్తున్నారు ఎప్పటికీ చిన్నపిల్లలుగా గోరుముద్దలు తినిపిస్తూ పిల్లల్ని నీ చుట్టూ వుంచుకోవాలనుకుంటే ఎలా? వాళ్లని ప్రయోజకుల్ని చేసేవరకు మన బాధ్యత ఆపైన వాళ్లిష్టం”అని సర్ది చెప్పాను. నాలుగోవాడు గోపాలాన్ని లా చదవమని అడకముందే ఎంబిఏ చదువుతానని తెలియజేశాడు.”

“నలుగురిలో ఎవరూ లా చదవకపొతే నాన్న ప్రాక్టీసు యిన్ని లా పుస్తకాలు ఏం చేసుకోవాలి కన్నా”అంటూ ముద్దుగా అడిగింది కాంతం.”ఆ పుస్తకాలు వ్వుత్తినే పోతాయని మేము లా చదవాలమ్మా?నాన్న పుస్తకాల షెల్ఫ్ దగ్గరకెళితే చాలు తుమ్ములు దగ్గులు వస్తాయి అంత దుమ్ము పేరుకుంది.రోజూ నాన్న జూనియర్ తాతారావు వస్తాడుగా యివన్నీ అతనికి ధారాదత్తం చేస్తే యింట్లో కాస్త జాగా వుంటుంది”. “నీ యిష్టం బాబూ నీకేం చదవాలనుకుంటే అదే చదువుకో కాని నాన్న యింత కష్టపడి మిమ్మల్ని చదివిస్తుంటే అతని వుద్యోగాన్నే వెక్కిరించే వాళ్లయ్యారు కలికాలం”.నా భార్య అమాయకత్వానికి నవ్వొచ్చింది.

అయిదేళ్ల తరువాత రమేష్ సురేష్ లు నెల రోజులకోసం వస్తున్నారన్న కబురు తెలియగానే వాళ్ల పెళ్లి గురించి అదిగాను.రెండోవాడు యింజినీరింగు చేసిన పిల్లని చూడమన్నాడు. పెద్దవాడు అక్కడ తనతో డాక్టరుగా చేస్తున్న తెలుగమ్మాయిని చేసుకునే వుద్దేశం వుందన్నాడు.

రేండో వాడికోసం ప్ర్యత్నాలు చేశాను నా తోటి లాయరు రంగనాధం కూతురు శ్యామల యింజినీరింగు చేసి గేట్ రాసిందని సీటు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ఫొటో యిస్తే వాడు వచ్చే లోపున పంపుతాను కొంత పని అవుతందని అంటే “యింకా ఏకాలంలో వున్నావు?ఇంటర్ నెట్ లో చూసుకుని మాట్లాడుకుని యిష్టపడితే మనం అన్నీ సిధ్ధం చేద్దాం”.అన్నాడు. కాంతం “అమ్మాయి జాతకమైనా యివ్వండి జాతకాలు సరిపోయాక మీ పధ్ధతులు కానివ్వండి”అంది. పాతకాలం మనిషని సర్ది చెప్పుకున్నాడు రంగనాధం. కాంతానికి మరో అయిడియా వచ్చింది “యిక్కడున్న పిల్లని అమెరికాలో చూడొచ్చంటే అక్కడున్న పిల్లని మనంకూడా చూడ వచ్చు కదా?”అంది.మనింట్లో కంప్యూటర్ లేదుకదా అన్నాను గోపాల్ అన్నాడు”నేను అన్నతో మాట్లాడి ఏ రోజు ఏ టైముకి తను ఆ అమ్మాయిని చూపిస్తానంటే ఆ టైముకు మనం అమ్మని సైబరుకేఫు తీసుకెళ్లి కాబోయే కోడల్ని చూపిస్తాను దిగులు పడకమ్మా “అన్నాడు. అన్నీ సరిపోవడం రెండు పెళ్లిళ్లూ ఒకేసారి జరిపించి అమ్మయ్య అనుకున్నాం.

మూడో వాడికి కాలేజ్ ప్రొఫెసర్ గా నార్త్ లో వుద్యోగం వాచ్చింది .రేండేళ్ల తర్వాత వాడి పెళ్లి సంగతి కదిపాను.”నా గురించి శ్రమ పడకండి నాకు యిటువైపు అమ్మాయి నచ్చింది,రిజిష్టర్ మేరేజ్ గాని ఆర్యసమాజంలో గాని పెళ్లి చేసుకుంటాను.”అన్నాడు.”సరే ఎప్పుడు చేసుకుంటావో అదేనా చెప్తావా లేదా?””అలాగేం కాదు మీకు ముందుగా తెలియపరుస్తాను. ప్రతి దానికి టెన్షన్ పెట్టుకోకండి”అన్నాడు. కాంతానికి చెప్తే “కలికాలం మన పెంపకంలో పిల్లలు యిలా తయారయారేమిటండీ? చదువులు వాళ్లిష్టం పెళ్లు వాళ్లిష్టం యిక మన పెద్దరికమెందుకూ?” అంది బాధపడుతూ.

“చూడు పిల్లలమీద మన యిష్టాయిష్టాలు రుద్దకూడదు. అప్పుడే వాళ్లకి వికాశం మనకి మనశ్శాంతి. చిన్నవాడుకూడా సెటిల్ అయిపోతే రామా కృష్ణా అనుకోవచ్చు”.శాంతంగా చెప్పి నా  నా స్వరంలో అసంతృప్తి నాకే ధ్వనించింది. మరో ఆర్నెల్లకి సారధి వద్దనుంచి పిలుపు వచ్చింది.అమ్మాయి తలితండ్రులు ఢిల్లీలో వున్నారని పంజాబీ అమ్మాయని, పెళ్లి తారీకు చెప్పి ఒకరోజు ముందుగ మీరంతా వచ్చేయండి అడ్రస్సు చెప్పాడు.”అదేమిటండీ వీడి వుద్యోగం వేరే చోట అయితే డిల్లీ అమ్మాయి ఎలా తారసపడింది?మరీ ఒక్క రోజు ముందు దూరపు బంధువుల్లా వెళ్లడమేమిటి అసలు అమ్మాయి పేరేమిటో కులమేమిటో కనుక్కోకుండా వాడు చెప్పినవాటికి సరేనంటారేమిటి?”

చిగురించిన పందిరి

లావణ్యకి యిటువంటి పరిస్థితిలో ఏంచెయ్యాలో దిక్కు తోచలేదు. తండ్రి వ్యాపార రీత్యా బెంగుళూరు వెళ్లి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినట్లు ఫోను వచ్చింది. చందూని సాయం తీసుకుని బెంగుళూరు చేరుకుంది. డాక్టర్లు పరిస్థితి అదుపులో వున్నా ఆపరేషను చేయందే ఆరోగ్యం చక్కపడదని నిర్ధారించారు. నాలుగు రోజుల తరువాత అతన్ని తీసుకుని తమ వూరికి చేరుకున్నారు. ఎంతో వుత్సాహంగా వెళ్లిన తండ్రి ఢీలా పడిపోవడంతో లావణ్య దిగులు పడింది. అయితే ధైర్యంగా నిలబడవలసిన సమయంలో తన అధైర్యం తండ్రిని క్రుంగదీస్తుందని లేని నిబ్బరం ప్రదర్శించింది. అన్ని టెస్టులు చేయించాక ఆపరేషను తేదీ నిర్నయించారు డాక్టర్లు.

ఆరోజు సాయంత్రం తండ్రి తనని చందూని కరుణని పిలిచి మంచం పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఏం మాట్లాడతాడోనని ఆతృతగా ఎదురు చూసింది. తన చేయి పట్టుకుని “అమ్మా! లావణ్యా! పురిటిలో మీ అమ్మ చనిపోతే పసికందుని గుండెలమీద పెట్టుకుని పెంచాను. నెలల బిడ్డగా వున్నపుడు జ్వరం వస్తే డాక్టర్లు పోలియో అన్నారు.ఎన్ని మందులిచ్చినా నీచేయి కాలు నయం చెయ్యలేకపోయారు. ఆరోజునుంచి నా జీవితంలోసంతోషం ఎలా వుంటుందో మర్చిపోయాను, కాని విచిత్రం ఏమిటోగాని నేను ధనవంతుడినే అయినా ఏటికేడాది వ్యాపారం పెరిగి నేనూహించలేనంత ఎత్తుకెదగ గలిగాను కాని నీ జీవితం చక్రాల కుర్చీ నుంచి తప్పించలేకపోయాను. ఇప్పుడిదంతా ఎందుకంటే ఆపరేషను తర్వాత నా పరిస్థితి ఎలా వుంటుందో తెలియదు,నాబ్రతుకు చుక్కాని లేని నావలావుంటే నీకొక దారి పెట్టకుండా ఎలాగమ్మా?” అలసట తీర్చుకునేందుకు ఆగారు.

ముగ్గురూ కళ్లనీళ్లతో వుగ్గబట్టి వింటున్నారు.”యిప్పుడిదంతా ఎందుకు నాన్నా మీరు బాగుంటారు” వెక్కిళ్ల మధ్య లావణ్య అంది. “బాగుండాలనే నేనూ కోరుకుంటున్నానమ్మా అయితే భగవన్నిర్ణయం మనకి తెలియనపుడు పరిస్థితి కొంతయినా చక్కబెట్టడం నాధర్మం. చందూ! నాయనా నిన్ను పరాయి వాడిలా ఎప్పుడూ చూడలేదు. నీ తండ్రి నిన్ను నా చేతుల్లో పెట్టిననాటినుంచి యీ నాటి వరకు కన్నకొడుకులా చూసుకున్నాను. ఋణం తీర్చుకోమని అడిగే హక్కు లేదు  గాని నాబిడ్డని నావ్యాపారాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అభిమానంవుంచి లావణ్యని పెళ్లిచేసుకోమని అర్ధిస్తున్నాను. అమ్మా కరుణా! తుఫాను రాత్రి ఒంటరిగా పార్కు పక్కన తడిసి ఏడుస్తున్న నిన్ను యింటికి తెచ్చి నా లావణ్యకి తోడుగా వుంటావని పెంచాను. మీముగ్గురిని ఒక చోట చేర్చి పెంచిన నాడు నా బిడ్డకి తోడుగా వుంటారనే ఆలోచించాను గాని యీ రోజున స్వార్థపరుడిలా కొరిక కోరినందుకు సిగ్గు పడుతున్నాను. అయినా అసహాయుడిని నాకు మాటివ్వగలవా చందూ?” అంటూ రెండు చేతులూ జాపిన రఘునాధరావుగారిని ముగ్గురూ ముప్పేటల్లా అల్లుకు పోయారు.

చందూ పెదవి విప్పి మీరెలాచెపితే అలా చేస్తాను అంకుల్ లావణ్య మనసు కూడా తెలుసుకోండి” “ఏమంటావు తల్లీ?”అనగానే “మీ యిష్టం నాన్నా” అంది కారు మబ్బులు విడిపోయినట్లయింది.రఘునాధరావుతేలికగా వూపిరి తీసుకున్నారు. మర్నాటినుంచి ఆపరేషను తేదీ లోపున సింపుల్ గా పెళ్లి చెయ్యటానికి అన్ని ఏర్పాట్లు చేయించారు. వేంకటేశ్వరుని సన్నిధిలో వివాహం జరిగిపోయింది. వధూవరులు పసుపు బట్టలు మార్చక ముందే రఘునాధరావుగారు హాస్పిటల్లో జాయిన్ అయి హార్ట్ సర్జరీ చేయించుకున్నారు.

పది రోజుల తరువాత యింటికి వచ్చారు.లావణ్య చక్రాల కుర్చీలో కదులుతూనే తండ్రి సేవలు స్వయంగా చూసుకుంటోంది. యింట్లోని నౌకర్లు కరుణ లావణ్య రఘునాధరావుగారి సేవలు చేస్తుంటే చందూ అనబడే చంద్రశేఖర్ వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. నెలరోజులు గడిచి కోలుకుంటున్నారు అనుకునే సమయంలో జరిగింది ప్రళయంలాంటి సంఘటన. లావణ్య అన్నం స్పూనుతో తండ్రికి తినిపిస్తోంది “ఏమిటమ్మా నన్ను మరీ పసిపిల్లాడిని చేస్తున్నావు” ఏమీ ఫరవాలేదు నాన్నా” .  మీరు తొందరగా కోలుకోండి మనమంతా ఎటయినా ప్రశాంతమైన ప్రదేశానికి పది పదిహేను రోజులు వెళ్లి గడిపి వద్దాం” అంటూ అన్నం తినిపించింది. సడెన్ గా పలమారింది ఎంత చేసినా తట్టుకోలేక మెలికలు తిరిగిపోతుంటే గట్టిగా కేకలు పెట్టి అందరినీ పోగు చేసింది డాక్టరు వచ్చి పరీక్షించి పెదవి విరిచాడు.

చుట్టు వున్నవాళ్లంతా ఘొల్లుమన్నారు లావణ్య జరిగినది గ్రహించి డాక్టరుని పట్టుకుని కుదిపేసింది,”చెప్పండి డాక్టర్!నావల్లే యిలా జరిగిందికదా? అన్నం పెడుతూంటే పలమారి నాన్న పోయారా?” అంటూ విలపిస్తున్నా ఒదార్పుగా తలనిమురుతూ “లేదమ్మా లావణ్యా! యిటువంటి సంఘటనలు మావైద్య చరిత్రకేసవాల్ గా నిలుస్తుంటాయి.అన్నం తినక పోయినా వుమ్మి అడ్డం పడి పలమారి ప్రాణం పోతుంది వైద్య సహాయం అందే సమయం వుండదు.” 
లావణ్యకి చుట్టూ అంతా చీకటయినట్లయింది. తల్లీతండ్రీ తనే అయి అహర్నిశలూబిడ్డ సంతోషం కోసం జీవించిన తండ్రి, యిరవైఆరు సంత్సరాలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్న తండ్రి గాజు గ్లాసు చేయిజారినట్లు అవటంతో తట్టుకోలేకపోయింది. కరుణ చందూ చెరో ప్రక్క నిలుచుని ఒదార్చారు. రావలిసినవారు రావటం చేయవలసిన కార్యక్రమాలు లావణ్య ప్రమేయం లేకుండానే జరిగి పోయాయి.

లావణ్యలో ఎంత నిర్లిప్తత చోటు చేసుకుందంటే రోజూ గంటల తరబడి దండవేసిన తండ్రి ఫోటో ముందు తన కుర్చీలో కూర్చుని తన చిన్నప్పటినుండి తండ్రితో గడిపిన అనుబంధపు పుటలు తిరగవేస్తుండేది. ఆసమయంలో కరుణగాని చందూగాని మాట్లాడించడానికి సాహసించలేకపోయేవారు. లావణ్య తన అసహాయత అర్ధమయి తనపై తను దయకలిగే పరిస్థితి ఏర్పడకుండా యిల్లంతా ఎక్కడికయినా కుర్చీలో సులువుగా తిరుగగలిగేలా యింటిని మార్చారు. చదువుకుందికి స్కూలికి వెళితే తోటివారు హేళన చేయకుండా అన్ని సబ్జక్టులకీ టీచర్లని యింట్లో ఏర్పాటు చేసి పదవ తరగతి పరీక్ష యిప్పించారు.

తన నాలుగవ ఏట తడిసిముద్దయిన కరుణని యింటికి తీసుకు వచ్చి నౌకరు చేత స్నానం చేయించి తన బట్టలు కట్టించి పాలు పట్టించి అన్నారు “అమ్మా! లావణ్యా నీకో చెల్లిని తెచ్చాను. నీతో ఆడుకుందికి .” తరువాత కరుణ ఎలా దొరికింది మర్నాడు పోలీసులచే ఎంక్వైరీ చేయించి ఆమెని పెంచే దాతలెవరూ లేరని తెలుసుకుని చట్టరీత్యా దత్తత చేసుకుని తనకి సవతి తల్లిని తేకుండా ఒక చెల్లిని తెచ్చారు.

ఇక చందూ సంగతి సరేసరి తన చిన్న నాటి స్నేహితుడు ఆర్ధికంగా చితికిపోయి ఆరోగ్యం కోల్పోయి మిగిలిన తన పదకొండేళ్ళ కొడుకుని తీసుకుని వైద్యం కోసం ఆర్ధిక సహాయం అర్ధించడానికి వచ్చాడు. అతని అసహాయత గమనించి హాస్పిటల్లో చేర్చారు. అతని చింత కొడుకు చంద్రశేఖర్ అయిదో క్లాసు మధ్యలో మానిపించి తనకు సహాయం చేయగల వ్యక్తి రఘునాధరావు వొక్కడే అని నిర్నయించుకుని వచ్చాడు. రోజూ తనతో పాటు చందూని హాస్పిటల్ కి తీసుకు వెళ్లి తండ్రి వద్ద కాసేపు వుండనిచ్చి స్నేహితునికి ధైర్యం చెప్పి వచ్చేవాడు. అతని సేవ కోసం ఒక నౌకర్ని పెట్టాడు.

ఎన్ని మందులు వాడినా అతని ప్రాణాలు పధ్నాలుగు రోజులు కాపాడగలిగేరు.పోతూ పోతూ “రఘూ! నా చందూని నీ చేతుల్లో పెడుతున్నాను. వాడినేదో గొప్పవాడిని చెయ్యమనను గానిఒక మనిషిగా తీర్చు అంతే చాలు.” చివరి దశలో వున్న స్నేహితుని చేతిలో చెయ్యి వేసి,”నువ్వేమీ దిగులు పడకు చందూని నాయింట్లో నా పిల్లలలో ఒక పిల్లాడిగా పెంచుతాను. తను ఎంత చదువుకుంటానంటే అంత చదివించి నువ్వు ఏలోకంలో వున్నా నీ బిడ్డని చూసి గర్వించేలా చేస్తాను”. అంటూంటే చివరి చూపులోకూడా స్నేహితుని కళ్లల్లో మెరుపు చూడగలిగాడు.

ఆనాటి నుంచి ఆయింట్లో ముగ్గురు పిల్లలు. చందూని స్కూల్లో జాయిన్ చేసారు.కరుణ మాత్రం లావణ్య కోసం వచ్చిన టీచర్ల వద్ద అక్క ప్రక్కన కూర్చుని చదువుకునేది. 
లావణ్యకి సంగీతం నేర్చుకునే అభిలాష వ్యక్తం చేస్తే రోజూ ఒక గంట సంగీతం మాష్టరు వచ్చి నేర్పేవారు. పదవ తరగతి తరువాత బి ఎ ,ఎ మ్మె ప్రైవేటుగా పరీక్షలకి కూర్చుని పాసయింది. కరుణ బి ఎ తరువాత యిక చదవనని అక్కకి తోడుగా వుంటాను యిల్లు చూసుకోవడంలో సహాయ పడతానంది. చందూ ఎమ్ కామ్ చేసి సి ఎ చేశాడు. తండ్రి ఆర్ధిక వ్యవహారాల్లో సహాయంగా వుండేవాడు. తన అభిరుచులకు ప్రాధాన్యతనిస్తూ పెంచాడు తండ్రి.

గ్రాడ్యుయేషను చేస్తున్న సమయంలో పైంటింగు మీద వుత్సాహం చూపిస్తే దానికి తగిన పరికరాలన్నీ తెచ్చారు. అవన్నీ తనకి అందుబాటులో వుండేటట్లు ఏర్పాటు చేశారు. కరుణ ప్రక్కన వుండి సహాయం చేస్తే చందూ తగిన సలహాలిస్తూండేవాడు. బయటి ప్రపంచంలో తిరగని తనకు గార్డెన్ లో తిరుగుతూ రంగు రంగుల పూవులు పచ్చని చెట్లు తీర్చి దిద్దినట్లున్న తోటలో రోజూ తిరగటం కళ్ళముందు కనిపించిన అందాల్ని మనసులో నిలుపుకుని కాగితంపై రంగుల కలల్ని కుంచెతో మలిచేది.లావణ్య దినచర్య చూసి అందరికీ ఆశ్చర్యమే యింత నాజూకుగా వుండి తన వికలాంగతనికూడా లెక్కచెయ్యక యిన్ని రంగాలలో ప్రావీణ్యం సంపాదించడంలో ఆమె పట్టుదల తెలియజెప్పేది.

రఘునాధరావు ఒకసారి బెంగుళూరు వెళ్లినప్పుడు ప్రత్యేక రకమైన తీగమల్లె తెచ్చారు.అప్పుడు తండ్రితో అంది”నాన్నా!మన గార్డెన్ లో దీనిని సరైన స్థలంలో పాతి చక్కని పందిరి వేయించుదాం. మల్లెపూలు పూచినప్పుడు ప్రక్కన బెంచీపై కూర్చుంటే ఆపరిమళం ఆస్వాదిస్తూ యెంత సేపైనా గడపవచ్చు కదా!” “తప్పకుండానమ్మా మాలికి స్థలం నిర్నయించి నువ్వే చెప్పు పందిరి వేయించు రాతిబెంచీలు తెప్పిస్తాను”. మర్నాడే స్థలం నిర్నయించి మొక్కని పాతించి జాగ్రత్తగా రోజూ నీళ్లుపోయమని మాలీకి చెప్పింది. రెండు నెలలు గడిచే సరికి తీగలు పొడవుగా రావటం మొదలయింది. పందిరి వేయించుదామనుకునే లోపున మాలి నెలరోజులు శలవలో వెళ్తూ వేరే మనిషిని అప్పజెప్పాడు.  తండ్రి గుండె నొప్పి వచ్చే ముందు రోజే కొత్త మాలీని పిలిచి పందిరి ఏర్పాటు చెయ్యాలని దానికి కావలిసిన సామగ్రి తేవాలని చెప్పింది. అలాగేనని తలూపాడు.మర్నాడు తండ్రికి సీరియస్ గా వుందని కబురు రావటం మిగతా హడావిడిలో పందిరి వేశాడా లేదా చూసే మన స్థిమితం లావణ్యకి లేకపోయింది.

తండ్రి పోయి మూడు నెలలు గడిచాయి. ఆరోజు యిల్లంతా తిరుగుతూ అన్నీ సరిగా వున్నాయా లేదా అని పరిశీలిస్తున్న లావణ్య తన జీవితం మునుపటిలా నడవటం లేదు ఏదో వెలితిగా వుందని భావించింది. ఏమిటా అని ఆలోచిస్తుంటే పూర్వంలా కరుణ తన ప్రక్కనే వుండి కబుర్లు చెబుతూ సహాయ పడటం లేదని గ్రహించింది. అయితే చిన్నప్పటినుంచి పెంచిన తండ్రి పోవటం తనుకూడా బెంగ పడిందేమో అనుకుంది. ముఖ్యమైనది చందూతో తన వివాహబంధం ఏర్పడిందేగాని పూర్వపు స్నేహం సన్నిహిత్త్వం లోపించినట్లనిపించింది .ఈ మూడు నెలల్లో తనతో మాట్లాడిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇంటి బాధ్యతలు బిజినెస్ బాధ్యతలలో తలమునకలవుతున్నాడేమో.అసలు తనేబాహ్య ప్రపంచం మరిచి తండ్రి జ్ఙాపకాలలో మునిగి తేలుతుండటం కూడా కారణం కావచ్చు అనుకుంది.

సాయంత్రం తన కుర్చీ నడుపుకుంటూ తోటలోకెళ్లిన లావణ్య మల్లెతీగ పెట్టిన స్థలానికి వెళ్లి నిశ్చేష్టురాలయింది. మల్లె తీగ ఎండిపోయింది పందిరి కోసం వేసిన కర్రలలోంచి పచ్చని చిగుళ్లు కనిపిస్తున్నాయి.మాలీని కేకవేసి అడిగింది,”నేను లేను కదమ్మాయిగారూ!కొత్త మాలీకి అంతగా తెలియదు. మీరు చెప్పారు ఎలాగో ఒలా చెయ్యాలని మన పెరటి వైపున్న పెద్ద చెట్టుకొమ్మలు సాపుగా వున్నవి కోసి పందిరి కట్టాడుటమ్మా. అయ్యగారి ఆపరేషను ఆబాబు పోవటం యింట్లో యెవరూ పట్టించుకోలేదు లేత మల్లెమొక్క యెండిపోయింది.పందిరికున్న పచ్చి కొమ్మలు చిగురుపెట్టాయి.యివి తీసి మళ్లీ సరిగా కడతానమ్మా”. “వద్దులే తాతా యింక నాకూ వుత్సాహం పోయింది”. అంటూ లోపలికెళ్లింది.ఇదేదో అపశృతికి సంకేతంలా అనిపించింది.

రాత్రి నిద్రపట్టక పక్కపై దొర్లుతున్న లావణ్యకి గుసగుసగా మాటలు ఎవరో సన్నగా రోదిస్తున్న స్వరం విపించగానే ఎవరై వుంటారని ఆలోచించింది. కుర్చీలో కూర్చుని నెమ్మదిగా నడుపుకుంటూ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్లింది. బెడ్ లాంపు కాంతిలో కనుపించిన దృశ్యం తన కళ్లని తనే నమ్మలేకుండా చేసింది. చందూ కరుణ భుజాలు పట్టుకుని వూరడిస్తున్నాడు,కరుణ అతని గుండెల్లో ఒదిగి రోదిస్తోంది. తమ ముగ్గురి మధ్య చిన్ననాటినుంచి స్నేహం ముక్కోణంగా వుండేది.ఈపాటి సన్నిహిత్వానికి సందేహించనవసరంలేదు కాని అంతరాత్రి వేళ యిద్దరూ యేవిషయంలో అంత ఆందోళన చెందుతున్నారా అనిపించింది. సంగతేమిటో తెలుసుకుందామని దగ్గరకెళ్లింది. లావణ్యని చూడగానే యిద్దరూ వులిక్కి పడ్డారు,”ఏమయింది లావణ్యా ఈ సమయంలో వచ్చావు?” “అదే నేనూ అడుగుదామని వచ్చాను.యింత రాత్రి వేళ మీ యిద్దరికీ ఏ సమస్య వచ్చిందో తెలుసుకుందామని”.
కరుణ లావణ్యని చుట్టుకుని ఎడుస్తోంది.చందూ దోషిలా తల వంచుకుని “నన్ను క్షమించు లావణ్యా! నావల్ల పొరపాటు జరిగింది కరుణని దూషించకు. నేను అంకుల్ ఆశల్ని వమ్ము చేశాను. తీరని నేరం జరిగింది,దీనిని ఎలా దిద్దుకోవాలో తెలియక సతమతమౌతున్నాం”. వివేకంగల లావణ్యకి కొంతవరకు అర్ధమయింది కాని దీని వెనుక అర్ధం పరమార్ధం అవగతం కాలేదు.”శాంతంగా కూర్చోండి యిద్దరూ ఏం జరిగిందో చెప్పండి. మన ముగ్గురితో పరిష్కారమయ్యే సమస్య అయితే మనమే దీనికి మార్గం చూద్దాం.ఎంత నిగ్రహించుకుందామనుకున్నా కంఠం వణికింది.

చందూనే ముందుగా తేరుకుని చెప్పడం మొదలు పెట్టాడు”లావణ్యా యీ యింటికి వచ్చిననాడు నేనింత వాడినవుతానని గాని  చదువుకుని ప్రయోజకుడిని కాగలననుకోలేదు. అంకుల్ నా ఫ్యూచరుని బంగారు బాటగా మలిచేరు. ఏమిచ్చినా ఆయన ఋణం తీర్చుకోలేను. ఈ భావనతోనే మన పెళ్లి ప్రపోజల్ ని క్షణం కూడా ఆలోచించకుండా నా అంగీకారం తెలిపాను. కాని లావణ్యా! అంకుల్ పోయాక నేను ఎన్ని సార్లు నీగదికి వచ్చి నీతో సన్నిహితంగా వుందామనుకున్నా నాలో ఏదో న్యూనతా భావం వెనక్కు లాగేది. నేను నీకు తగిన వాడినికాను,అల్పుడిని అన్న భావం నన్ను వణికించేది. నువ్వు నాకన్నా ఎంతో ఎత్తులో వున్నట్లనిపించేది. నీవు అంకుల్ జ్ఙాపకాలలోంచి బయటపడలేక సతమతమౌతూంటే నాకు కొత్తగా చుట్టుకున్న బాధ్యతలతోపాటు నీతోముడిపడ్డ బంధం ఎంతవరకు నిభాయించ గలనా అని ఆరాట పడేవాడిని.

అన్ని పరిస్థితులలోను నిండుకుండలా వుండే కరుణని చూస్తే ఆశ్చర్యమనిపించేది. మనిద్దరికన్న చిన్నదయిన కరుణలో పరిస్థితినెదుర్కోగల నిబ్బరం కనిపించేది. అందుకనే నేను యింట్లో వుండే సమయం తగ్గించి బిజినెస్సు మీద మనసు లగ్నం చేశాను. ఒకరోజు రాత్రి పదకొండు దాటాక యిల్లు చేరాను,నేను రావటం గమనించి కరుణ అన్నం పెట్టింది. నా ముభావం చూసి “ఏమయింది? అంకుల్ పోయినప్పటినుండి గమనిస్తున్నాను. నీలో ఏదో మార్పు యింత నిర్లిప్తంగా వుంటున్నావు నీ బాధ ఏమిటి చందూ”? ఆపాటి సానుభూతి మాటలకు నాలో పేరుకు పోయిన భావాలు అలలుగా పెల్లుబికాయి, మాటల ద్వారా కాదు కన్నీళ్ల రూపంలో. తనకన్న పెద్దవాడిని బేలగా కన్నీరు పెట్టడం చూడలేక దగ్గరగావచ్చి నా తలని గుండెలకి హత్తుకుంది.ఈ హాలులో మాట్లాడవద్దు లాన్ లో కూర్చుని మాట్లాడుకుందాం పద”అంది. మనసులోని బాధ బయటపడితే సర్దుకోగలనన్న వుద్దేశంతో అని వుండవచ్చు.

అక్కడ కూర్చున్న తరువాత చెప్పాను నాకు నీపై గౌరవం అభిమానం కొండంతవున్నా భర్తని అన్న వూహ రాగానే నీరుగారిపోతున్నాను.నాలో ఆ ప్రేమ భావం కలగటంలేదు.ఆమాటే కరుణతో చెప్పాను. కరుణ చాలా పెద్ద తరహాగా సలహా యిచ్చింది.రోజూ కొంత సమయం నీ వద్ద గడపడం లేదా బయటి ప్రదేశానికి ఎక్కడికైనా వారం పది రోజులు గడిపి రమ్మంది. సాన్నిహిత్యం పెరిగితే అనుబంధం అదే బలపడుతుందని, చావు బ్రతుకులమధ్య నున్న అంకుల్ కి యిచ్చిన మాట తప్పకు చందూ అంటూ వూరడించింది. ఎందుకనో ఆ సాంత్వన వచనాలతో లోపలి దుఖం లావాలా ఎగిసిపడింది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను జ్ఙానం తెలిసీ తెలియని వయసులో తండ్రిఅష్ట కష్టాలు పడుతూ ముక్కు ముఖం తెలియని వీళ్లకి అప్పగించి చనిపోయాడు.ఆసమయంలో అనిపించినదొక్కటే వీళ్ల ఆసరా వదులుకుంటే నాకు బ్రతకటం కష్టమని.అయితే లోటు తెలియనివ్వకుండా అంకుల్ మీ యిద్దరితో పాటు నా భవిష్యత్తు తీర్చిదిద్దారు. అతనికిచ్చిన మాట తప్పలేను.పూవులా నాజుకుగా వుండే లావణ్యకి  ద్రోహం చెయ్యలేను. కాని నామనసుని మోసపుచ్చుకో లేకపోతున్నాను. నేనేం చెయ్యాలి? ఎవరితోను పంచుకోలేని బాధ యిది”. అంటూ కదిలికదిలి ఏడ్చాను. కరుణ నా దుఖం చూడలేక ఓదార్చుతూ దగ్గరకు తీసుకుంది. వయసు సమయం పరిస్థితి మమ్మల్ని అవివేకుల్ని చేశాయి.శరీరాలు వశం తప్పాయి,అంతే జరగకూడనిది జరిగిపోయింది.యిరువురం దొంగల్లా మర్నాటినుంచి నీనుంచే కాకుండా మానుంచి ఒకరికొకరం దూరంగా మసలడం మొదలు పెట్టాం నేనయితే బయట టూర్లుమీద ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టాను”.

ఇంతటి కథని ధైర్యం కూడదీసుకుని చెప్పాడు చందు. కరుణ వెక్కిళ్ల మధ్య “అక్కా నీకు అండగా వుందామననుకున్నానుగాని నీ అనందాన్ని మింగేయాలనుకోలేదు మన ముగ్గురి మధ్య యిటువంటి పరిస్థితి వస్తుందని వూహించలేదు. దేవునిలాటి అంకుల్ మనసు క్షోభించేలా అయింది. నాకు ఏ శిక్ష అయినా వేయి”. అంటూ లావణ్య కాళ్లు చుట్టేసింది.”చందూ! కరుణా!యిద్దరూ యీ క్షమాపణలూ పశ్చాత్తాపాలూ ఆపండి! నేను జీవితాన్ని యీవిధంగా జీవించాలి ఆవిధంగా జీవించాలి అని ఎప్పుడూ కలలు కనలేదు. అయితే నాతండ్రి ఆర్ధిక స్థోమత బాగుండి నేను కోరినవన్నీ అందుకోగలిగాను. యింత పెద్ద యింటిలో నేనొక్కర్తినీ వొంటరితనం ఫీలవకుండా మీ యిద్దరినీ చేరదీశారు. భగవంతుని దయవలన మన ముగ్గురి స్నేహంలో ఎప్పుడూ విఘ్నం రాలేదు. నేను పెళ్లిమీద ధ్యాస లేకుండానే యిన్నాళ్లు గడిపాను. నాకున్న దుర్బలత నా అవిటితనం గుర్తు పెట్టుకునే బ్రతికాను. అయితే నాన్న ఆరోగ్యం ప్రమాదస్థితిలో వుండి నన్ను యీ విషయం అడిగేసరికి ఆలోచించుకునే వ్యవధి లేదు.

ప్రతీది నేను కోరటమేగాని అతను అడిగిన మొదటి కోరిక యిదే చందూ! నీ నిర్నయం ఏమైవుంటుందా అని చూశాను ఎందుకంటే మొదటినుండి మాయింటి వ్యవహారాలు, నాగురించి తెలిసిన నీ స్పందన ఎలా వుంటుందా అని చూశాను.నీ సమాధానం విన్నానే గాని ఒక్క సారి నీ ముఖంలోకి చూసి వుంటే అరోజు తప్పక నీ మనసు గ్రహించి వుండేదాన్ని. 
కాని నాన్న పోయాక అయినా ఒక్కసారి నీ మనసు విప్పి నాతో మాట్లాడి వుంటే నేనే యీ వివాహబంధం నుంచి విముక్తుడిని చేసి వుండేదాన్ని. యీ తప్పిదం మీవల్ల జరిగే అవకాశం వుండేది కాదు.కాని పొరపాటు జరిగిన యిన్నాళ్ల తరువాత యింత రాత్రివేళ బాధ పడటం,ఓదార్పులు ఏమవసరమైంది?” చందూ నసుగుతూ “అదే కరుణ కడుపులో మా తప్పుని యెత్తి చూపే అంకురం యేర్పడింది.ఈ రోజు తను చెప్తే నేను ఓదార్చే ప్రయత్నంలో నువ్వు రావటం జరిగాయి”. కరుణ సడెన్ గా లావణ్య కాళ్లకు చుట్టుకుని”యింత జరిగాకకూడా మాతో ఎలా మాట్లాడుతున్నావక్కా?నాకయితే చచ్చిపోవాలనివుంది”. “పిచ్చిదానా యిటువంటి సంఘటనలే మన ప్రమేయం లేకుండా జరిగేవి. సరే యీ రాత్రివేళ ఒక్కసారిగా పరిష్కారం దొరకదు.రేపు సాయంత్రం వరకు ఆలోచించి మనం ఏం చెయ్యాలన్నది నిర్నయించుకుందాం”.కుర్చీని వెనక్కి తిప్పి నడుపుకుంటూ వెళ్లిపోయింది.ఇద్దరూ బొమ్మల్లా చేష్టలుడిగి నిలుచున్నారు.

మర్నాటి సాయంత్రంముగ్గురూ రఘునాధరావుగారి గదిలో సమావేశమయ్యారు,అక్కడయితే నౌకర్లువచ్చే ప్రసక్తి వుండదు.లావణ్య చెప్పడం ప్రారంభించింది,”చందూ! కృతజ్ఙతా భావంతో తొందరపడి నాన్నకి మాట యిచ్చావు. హడావుడిగా జరిగిన యీ పెళ్లి మనిద్దరిలోను ఎటువంటి మధురోహలూ కలుగలేదు.ఎంతసేపూ నాన్న కోరిక మన్నించితే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది యివే అందరి మనసులలో మెదిలిన వూహలు. అనుకున్నదొకటయితే జరిగినది మరొకటి.పెను తుఫాను వచ్చి అన్నీ కుదిపేసినట్లు నాన్న మరణం అందర్నీ తలో దిక్కు చేసింది.మళ్లీ తొందరపాటుతో మరొక తప్పు చేయకు. నానుంచి విడాకులు తీసుకుని కరుణని పెళ్లి చేసుకో పుట్టబోయే బిడ్డకు తండ్రిగా నిలువు. వీటికి కావలిసిన కాగితాలు మన లాయర్ని పిలిచి వారంలో తయారు చేయించుతాను.ఈ యింట్లో మీ యిద్దరూ ఎప్పటిలా వుండండి.

మా తాతగారికి వూటీలో ఎస్టేటు ఒక బంగళా వున్నాయి యిన్నాళ్లు అలనా పాలనా లేకపోయింది.కొన్నాళ్లు మనుషులని పెట్టి యిక్కడిలాగానే నాకు సదుపాయంగా ఆ యింటిని మార్చి అక్కడే వుంటాను. ప్రశాంతత ప్రకృతి రమణీయతలను నారంగుల కుంచెతో పదిల పరుస్తాను. నేను మీ కళ్లెదుటే వుంటే రోజూ మీకు నరకప్రాయంగా వుంటుంది.ఎలాగు బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నావు కాబట్టి ఎస్టేట్ వ్యవహారాలు కూడాచూడు.నాన్న బెంగుళూరు వెళ్లినప్పుడు వూటీ వెళ్లి ఆ పనులు కూడా చూసేవారు. యిప్పుడు యీ పనులన్నీ నువ్వే చూడు. నీ వ్యవహార దక్షత మీద నాకెప్పుడూ నమ్మకమే. కరుణా రేపు డాక్టరుని పిలిపిస్తాను ఆమె సలహాలు పాటించి ఆరోగ్యం కాపాడుకొని పండంటి బిడ్డని కనాలి”.

లావణ్య మాటలు విన్న కరుణకి ఆమెలో అక్క అమ్మ స్నేహితురాలు అందరూ కనుపించారు.”అక్కా! నీ విశాల హృదయం ముందు మేము చాలా చిన్న మనుషులుగా అనిపిస్తోంది తుఫాను బారినుండి కాపాడి నన్ను తీసుకు వస్తే నీ బ్రతుకులోనే తుఫాను కలుగజేశాను”. “కరుణా!యీ మాటలకింక చోటు లేదు. ముందుగా నిన్ను తేబట్టి నీ భర్త నిన్ను వెతుక్కుంటూవచ్చాడు. పదండి యిక భోజనాలు చేద్దాం”. “లావణ్యా!నువ్వు వూటీలో ఒక్కర్తివీ ఎలా వుండగలవ్”? అడిగాడు చందు.”నాకు ఒంటరితనం లేదు,నా అభిరుచులే నా సహచరులు నాన్న జ్ఙాపకాలే నాకు మార్గదర్శకాలు మీ యిద్దరి స్నేహం నాకు బలం.ఇక మీ పిల్లలు నేను జీవించడానికి ప్రేరణలు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నాతో గడపడానికి మీ యిద్దరూ పిల్లలతో వస్తే నేను ఒంటరినెలా అవుతాను?ఆకలిగా వుంది పదండి”.ఆమె గుండె నిబ్బరానికి ప్రదర్శించిన హుందాతనంకి మనసులోనే జోహార్లర్పించారు.

కాల చక్రం గిర్రున తిరుగుతోంది,చందూ కరుణలకు ముందు అమ్మాయి రెండు సంత్సరాల తరువాత అబ్బాయి పుట్టారు. అనుకున్న ప్రకారం ప్రతి సంత్సరం కుటుంబంతో సహా వూటీ వెళ్లేవారు. వాళ్లున్న పది పదిహేను రోజులూ సందడిగా వుండేది.పిల్లలు లావణ్యను పెద్దమ్మా అని పిలిచేవారు. అమ్మాయి జ్యోతి వచ్చినప్పుడల్లా లావణ్య వేసిన కొత్త పైంటిగులు చూడటం వాటిని జాగ్రత్త పెట్టడం వాటి మీద చర్చకూడా చేస్తుండేది. అబ్బాయి రఘు మితభాషి అడిగినదానికి మాత్రమే జవాబిచ్చేవాడు.

లావణ్య యాభైయవ సంత్సరం పుట్టిన రోజు జరపడానికి ప్రత్యేక ఏర్పాట్లతో వచ్చారు చందూ కుటుంబం. 
ఆ సారి జ్యోతి హడావిడి ఎక్కువగా వుండెను.వూటీలో ఆర్ట్ గేలరీ హాలు బుక్ చేసింది. అందులో లావణ్య పైంటింగ్సు ప్రదర్శన ఏర్పాటు చేసింది. లావణ్య ఆశ్చర్య పోయింది “ఎందుకమ్మా ఈ పబ్లిసిటీ యివన్నీ నా సంతోషం కోసం వేసుకున్నాను.” అంటే “పెద్దమ్మా నీ సంతోషంలో పాలుపంచుకునేందుకు ఎంతమంది వస్తారో చూడు. చిత్రాలని చూసి వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు విన్నాక ఈ మాట అడుగు.” చిత్ర ప్రదర్శనకి చాలా మంది వచ్చారు. ప్రతి చిత్రంలోను తన మనోభావంలో అనుకోని భావాలు కూడా వాళ్లు వెలిబుచ్చటం ఆశ్చర్యమనిపించింది. ఇన్ని చిత్రాలని వేసిన లావణ్యని చూసి వారు అబ్బుర పడ్డారు.

లావణ్య చక్రాలకుర్చీ నడుపుకుంటూ వొక ముసలాయన వద్ద ఆగింది. అతనికి యెనభై సంత్సరాలు వుండొచ్చు,అరగంట నుండి వొక్క చిత్రాన్నే చూస్తున్నాడు. ప్రక్కనున్న వాటిమీద ధ్యాసే లేదు. అతను చూస్తున్న చిత్రంలో రంగు రంగుల పూల తోటలో ఒక చెట్టుకి వేసిన వూయల వూగుతున్న పదహారేళ్ల అమ్మాయి చిత్రం. గాలికి ఎగురుతున్న ముంగురులు పావడా కుచ్చెళ్లు కదులుతున్నట్లు ఆమె ముఖంలో కాంతి చక్కగా కుదిరాయి. తను అనుభవించలేని ఆనందాలు తన చిత్రాలలోని పాత్రలద్వారా ఆస్వాదించేది. అయితే అదే చిత్రాన్ని అంత తదేకంగా చూస్తున్న ముసలాయనని పలకరిస్తూ,”క్షమించండి మీరు చాలా సేపటి నుంచి ఒక్క చిత్రాన్నే చూస్తున్నారు ఏమిటి అందులో ప్రత్యేకత”?అడిగింది లావణ్య.

అతను మాట్లాడకుండా జేబులోంచి పర్సు తీసి అందులోచి ఒక ఫొటో తీసి చూపించాడు.ఆశ్చర్యపోయింది,ఆ ఫొటోలో అమ్మాయినే చిత్రీకరించినట్లుంది. తరువాత పరిచయాలయ్యాయి. లావణ్యే ఆచిత్రకారిణి అని తెలుసుకుని ఆమె కుడిచేతిని తన చేతుల్లో తీసుకుని నిమురుతూ ఎంత జీవకళ వుట్టి పడుతోంది చిత్రంలో నా కూతురు. ఆశ్చర్యపోవడం లావణ్య వంతయింది.”నేనెప్పుడూ ఎవరినీ చూసి చిత్రాలు గీయలేదు. ప్రకృతి అందాలు చిత్రీకరిస్తూ నా వూహని బట్టి గీసే చిత్రాలే తప్ప వ్యక్తుల చిత్రాలు స్కెచ్ లు ఎప్పుడూ గీయలేదు”.

“అలా చూసే అవకాశంకూడా లేదు. మా అమ్మాయి చిన్నప్పుడే మా కుటుంబం ఆస్ట్రేలియా వెళ్లిపోయాం. అక్కడే చదువు పూర్తి చేసి విదేశీయుడిని పెండ్లాడి అక్కడే సెటిల్ అయిపోయింది. మా ఆవిడ అ షాకు తట్టుకోలేక మంచం పట్టింది. ఒక్క కూతురి కోసం ఆ దేశంలోనే వుందామన్నా యిష్టపడలేదు.యిక్కడికి వచ్చిన మూడు సంత్సరాలకి చనిపోయింది. అప్పటినుండి వొంటరి బ్రతుకే,అయినా యిటువంటి ఎగ్జిబిషన్లు గాన కచేరీలు ఎక్కడున్నా హాజరవుతుంటాను”.

“సారీ!అంకుల్ మీ మనసుకి కష్టం కలిగించాను”. “లేదమ్మా ఎవరయినా మాట్లాడితేనే కదా గతం గుర్తుకి వచ్చేది. నిన్ను కలుసుకున్నాక నా మనసుకి ఏదో ప్రశాంతత దొరికినట్లుగా వుంది. మన పరిచయం యింతటితో ఆగకుండా ప్రతి వారం మీ యింటికి వచ్చి నీతో కాసేపు మాట్లాడి నాలో కాస్త కాస్తగా వుత్సాహం నింపుకుంటాను”. “తప్పకుండా అంకుల్ నా విజిటింగ్ కార్డు తీసుకోండి”. ఈలోపున జ్యోతి వచ్చి”పెద్దమ్మా” అంటూ ఏదో చెప్పబోయి ప్రక్కనున్న ముసలాయనని చూసి “తాతయ్యా” ఇద్దరూ పలకరించుకుంటూంటే లావణ్య”మీకు యింతకు ముందే పరిచయం వుందా?నాకు తెలియదే!””గత సంత్సరం బొటానికల్ గార్డెన్ లో కలుసుకున్నాం,నీగురించేకాబోలు చాలా చెప్పింది. ప్రతి సంత్సరం వస్తామని ,నా అడ్రెస్స్ తీసుకుని యీ సారి నన్ను కలుసుకుందికి వస్తానంది.ఏం జ్యోతీ?” “ఈ వారం అంతా పెద్దమ్మ బర్త్ డే సందర్భంగా బిజీ తాతయ్యా. ఒకలా చేద్దాం రేపు మీరు మా యింటికి అదే పెద్దమ్మ యింటికి వుదయం పది గంటలకి వచ్చేయండి. అందరం సరదాగా గడిపి భోజనాలు చేద్దాం. సరేనా తాతయ్యా”?అంది జ్యోతి. ఎగ్జిబిషను అయాక అందరూ యిల్లు చేరుకున్నారు. “పెద్దమ్మా నీకెలా అనిపించింది? చిత్రాలు నీ కోసమే గీసుకున్నా అందరితో ఆనందం పంచుకోవడంలో థ్రిల్ల్ వుంది కదా! ” “అవును జ్యోతీ నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా వుంది,ముఖ్యంగా ఆ ముసలాయన కళ్లల్లో ప్రతిఫలించిన సంతోషం చెప్పలేను.” సరే అలిసిపోయావు రెస్టు తీసుకో రేపు యింకొక ప్రొగ్రాం వుంది”. “నా చేత గాన కచేరీ చేయించవు కదా”?”తినబోతూ రుచులేందుకు పెద్దమ్మా నిన్ను యిబ్బంది పెట్టనుగాని సర్ప్రైజ్”!నవ్వుకుంటూ తన గదికి చేరుకుంది లావణ్య.

మర్నాడు తొమ్మిదినుంచే అందరినీ సమావేశ పరిచింది.లావణ్యకి మంచి చీరకట్టి కుర్చీ నడిపించుకుంటూ వచ్చింది.”పెద్దమ్మా యీ వయసులో కూడా యింత అందంగా వున్నావు యంగ్ గా వున్నప్పుడు యింకా ఎంత అందంగా వుండేదానివో””చాల్లే పిచ్చి మాటలు”అంది లావణ్య మురిపెంగా. హాలులో చందూ కరుణ రఘు కూర్చుని వున్నారు. 
హాలంతా పూల బొకేలతో అలంకరించి వుంది. “ఈ హడావిడంతా ఏమిటి?నేనేదో నా వూహాలోకాల్లో బ్రతుకుతుంటే అప్పుడే నాకు యాభై సంత్సరాల వయసని గుర్తు చేస్తున్నారా మీరంతా”. “యాభై సంత్సరాల వయసులోకూడా యింత వుత్సాహంగా గడపగల శక్తి నీకే వుంది మెనీ మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!” అంటున్న కరుణ చేతులు పట్టుకుని “థేంక్స్”అంది లావణ్య. నౌకరు వచ్చి”అమ్మగారూ ఎవరో పెద్దాయన మీ కోసం వచ్చారు” వెంటనే “మన ఫ్రెండు తాతయ్య అయి వుంటారు లోపలికి తీసుకురా”అంది జ్యోతి. ఒక చక్కని పుష్ప గుచ్ఛం తీసుకుని లావణ్య వద్దకు వచ్చి “జన్మదిన శుభాకాంక్షలమ్మా’తలవంచి నమస్కరించి “అంకుల్ యిన్నాళ్ల తరువాత నా తండ్రి వచ్చి నన్నాశీర్వదింనట్లుగా వుంది”అనగానే లావణ్య తల నిమురుతూ”భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి!”అందరి కళ్లు చమర్చాయి. జ్యోతి అంది భగవంతుడు చల్లగా చూస్తున్నాడు కాబట్టే వూటీ యింత చల్లగా వుంది”.”అల్లరి పిల్లా”అన్నారు.అందరి వద్దకు తాతయ్యను తీసుకెళ్లి నా ఫ్రెండు తాతయ్య పేరు ఆనందరావు,మా అమ్మా నాన్నా మా తమ్ముడు మా పెద్దమ్మతో నిన్ననే పరిచయమైంది కదా కూర్చోండి తాతయ్యా “అంటూ మర్యాద చేసింది. అందరికీ డ్రింక్సు యిచ్చింది.

వెండి పళ్లెంలో గోల్డెన్ పేపరుతో గిఫ్ట్ పేక్ చేసిన పేకెట్ చిన్న కత్తెర పెట్టి తెచ్చింది.లావణ్య చూసి “ఏమిటమ్మా యిది”?”నీ స్వహస్తాలతో తెరువు పెద్దమ్మా యిది నీ కోసమే ప్లీజ్!”అంది “సరే” అంటూ నవ్వుతూ ఓపెన్ చేసింది. పుస్తకం అందమైన కవరు పేరు చదవగానే ఆశ్చర్య పోయింది లావణ్య’ చిగురించిన పందిరి ‘ఈ వాక్యం తనదే రచయిత్రి పేరు కోసం తిరగేసింది. ప్రియమైన పెద్దమ్మకి సమర్పించుకుంటున్న చిరు కానుక రచయిత్రి కుమారి జ్యోతి.”ఏమిటీ యిది నువ్వు రాశావా”?కాళ్లకు నమస్కరించి “పెద్దమ్మా నీ సహవాసంలో ఈ పాటి ప్రావీణ్యం అబ్బక పోతే బాగుండదు”. “నీకు ఈ సబ్జెక్టు ఎక్కడదొరికింది?” అంది కుతూహలం ఆపుకోలేక. తాతగారి గదిలో బుక్ షెల్ఫ్ లోని తీరం చేరని నావ నవలులో దొరికింది. కరెంటు షాకు తగిలినట్లయింది లావణ్యకి. అప్పుడు గుర్తుకొచ్చింది,వివాహ బంధం తెగిపోయి అక్కడి పనులన్నీ పూర్తిచేసుకుని వూటీ వచ్చేసే ముందు రోజు రాత్రి నిద్ర పట్టక చదుతున్న నవల సగంలో ఆపి కాగితం కలం తీసుకుని రాయటం మొదలు పెట్టింది. తనభావాలు అనుకోకుండానే అక్షర రూపం ధరించాయి.

చిగురించిన పందిరి
మల్లె తీగను తెచ్చి మక్కువగ పెంచి
ఆలంబన ఏర్పరచ నెంచి
అందమైన పందిరి వేసి
అల్లుకునే తరుణంలో మల్లె తీగ మాడి పోయె
పందిరి మాత్రం పచ్చని చిగురులు వేసె
మనిషి బ్రతుకు ప్రతి క్షణం సమరం
విధి లీల ముందు తప్పక తల వంచుతాం
ఈ చిన్ని భావల కాగితాన్ని నవలలో పెట్టిన లావణ్య మళ్లీ వులిక్కి పడింది. తన పెళ్లి ఫొటోలన్నీ కాల్చేయగా ఒక్క ఫొటోని కాల్చే సాహసం లేక పోయింది. పెళ్లి ముస్తాబులో దండలతోనున్న చందూని తనని తండ్రి యిద్దరి భుజాల మీద చేతులు వేసి దగ్గరగా పట్టుకున్నారు. తన ప్రక్కన కరుణ నిలుచుంది. ఆ ఫొటో చూస్తే తండ్రి తనకి అండగా వున్న భావన కలిగి అతని ఆఖరి ఫొటో కాల్చ లేక కవిత రాసిన కాగితంతోపాటు జతచేసి నవలలో వుంచింది. నవల ఎలాగూ పూర్తిగా చదవలేదు తనతో తీసుకు వెళ్దామన్న వుద్దేశంతో బుక్ షెల్ఫ్ మీద వుంచింది వుదయం బయలుదేరే హడావిడిలో దాని విషయమే మర్చిపోయింది. ఆ యింటిలో పుస్తక పఠనం మీద ఆసక్తి తన ఒక్కర్తిదే అందు నుంచి వాటిని సర్ది పెట్టి వుంటారు.అయినా జ్యోతి చేతిలో ఎలా పడింది? సందేహాన్ని బయట పెట్టింది లావణ్య.

జ్యోతి అంది”గత సంత్సరం పుస్తకాలన్నీ దులిపి సర్దిస్తున్నాను. నవల చేతిలోంచి జారి కింద పడటంతో ఈ చిన్ని కవిత ఒక ఫొటో బయటపడ్డాయి. చూసి ముందు ఆశ్చర్యపోయాను పెద్దమ్మ అనబడే వ్యక్తి పెళ్లికూతురు నాన్న పెళ్లికొడుకు మీ యిద్దరి మధ్య తాతగారు నిలుచున్నారు అమ్మేమో సింపుల్ గా ప్రక్కన నిలుచుంది.ఆ రెండూ భద్రం చేసి అమ్మ నాన్నలని కూర్చోపెట్టి విషయం అడిగాను. అమ్మ నాన్న దాచకుండా అంతా చెప్పారు అలా యీ విషయం బయట పడింది. నీ త్యాగ నిరతి విన్నాక నాలోకూడా రచయిత్రి ఒళ్లు విరుచుకుంది. ఈ కధ రాసి నీ కవిత శీర్షికనే పేరు పెట్టాను. నేను అపరాధం చేసి వుంటే క్షమించు పెద్దమ్మా!” అంది

జ్యోతి తల దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది.”యిక మన కుటుంబంలో అపరాధాలు లేవమ్మా, నేను రాసుకోలేనిది నీవు రాశావు”. “ఒక్క సందేహం పెద్దమ్మా తీర్చకపోతే నా మనసు సర్ది చెప్పుకోలేకపోతోంది. స్త్రీకి జీవితంలో వివాహం అనేది ముఖ్య ఘట్టం అది జరిగిన కొద్ది రోజులకే పెళ్లి ఎంత సూక్ష్మంగా చేసుకున్నావో అంత సూక్ష్మంగా త్యజించావు.ఎలా చెయ్యగలిగావు పెద్దమ్మా”?”కారణం నాకు తెలుసు”అన్నాడు రఘు. అందరూ ఆశ్చర్యపోయారు ఎప్పుడూ నోరు మెదపని వాడు యింత పెద్ద సబ్జెక్టు తనకి తెలుసునని ఎలా చెప్తున్నాడని. లావణ్య కూడా చాలా కుతూహలంగా “చెప్పు నాన్నా నీకేం తెలుసు”?అంది. “పెద్దమ్మా నువ్వు వేసిన చిత్రాలన్నీ చూశాను,తాతగారు పోక ముందు వేసినచిత్రాలు కూడా గమనించాను. అన్నిటిలో ప్రకృతి తోటలూ పూవులు జలపాతాలు కొండలు జింకలు పక్షులు అమ్మాయిలు తప్ప ఒక్క మేల్ కేరక్టరు కూడా నీ చిత్రాల్లో లేదు. జీవితంలోకి వచ్చినా అంత తొందరగానూ ఫేడౌటు అయిపోయాడు అదీ సంగతి.” అంతటి సిరియస్ మేటర్ని అంత సింపుల్ గా చెప్పడంతో అందరూ నవ్వు కున్నారు.

“నిజమే రఘూ నా వూహల్లో ఎప్పుడూ ప్రకృతి దృశ్యాలే తిరుగుతుండేవి. నడవలేని కాళ్లిచ్చిన భగవంతుడు పరుగులుపెట్టే మనసిచ్చాడు. ఆమనసుతో నేను చేయలేని పనులన్నీ నా చిత్రీకరణలో చోటు చేసుకునేవి. నా చిత్రాల్లో నేను తోటల్లో పరుగెత్తాను కాలువలో ఈతలు కొట్టాను నాట్యాలు చేశాను.నా చిత్రాలన్నీ నా మనసు చర్యలు. నా కాళ్లు నన్ను కదలనివ్వకపోయినా నా కుంచెతో అన్నీ సాధించాను. నా మనోఫలకంమీద పురుషుని నీడ కూడా కదల లేదు. చిన్నతనంనుంచి ఒంటరివాళ్లమంతా ఒక చోట చేరాం. జంటల మనోభావాలు గమనించే అవకాశం లేకపోయింది.

మానాన్న నాకు తల్లి తండ్రి గురువు దైవం లాగా బ్రతికాను. అతని మరణం నన్ను అంధకారం, శూన్యంలోకి నెట్టినట్లయింది.ఆ వెలితి ముందు మిగతా విషయాలు చాలా అల్పమైనవిగా అనిపించాయి. చందూ కరుణలు కూడా మాయింటిలో నాతో పెరిగారు వారి క్షేమ కోరడంకూడా నా ధర్మంగా భావించాను.ఇందులో త్యాగం అన్న పెద్ద పేరు అనవసరం. అందరం కలిశాం సంతోషంగా గడుపుదాం. మనమంతా ఒక కుటుంబ సభ్యులం. పిల్లలూ మీ మనసుల్లో అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక ఎప్పటిలా వుండండి.

చందూ! నువ్వు వచ్చినప్పటినుండి మూడీగా వుంటే బిజినెస్ ఒత్తిడి అనుకున్నాను. నీసంగతి పిల్లలకి తెలిసిపోయిందని చింత పడుతున్నావ?వాళ్లకి జ్ఙానం తెలిశాక తెలియడం మంచిదే. మంచి చెడు గ్రహించే శక్తి వాళ్లకి వుంటుంది.అంకుల్ బోరయ్యారా?మా గొడవలతో”?”అల్లాగనకమ్మా మీ అనుభవాలనుండి నేర్చుకోవలసినది చాలా వుంది. మీ ఒంటరి సంఘంలో మరొక సభ్యుడిని చేరాను.అన్నట్లు ఈ బంగళా ఎస్టేటుదార్ చెన్న కేశవరావుగారిది అని గుర్తు.” “ఔను అంకుల్ మా తాతగారే.”

“అంటే నువ్వు రాజ్యలక్ష్మి కూతురివా?”కుతూహలంగా అడిగారు.”అవును అమ్మమ్మకి తాతగారికి అమ్మ ఒక్కతే సంతానం”.ఆనందరావు లేచి వచ్చి లావణ్య తలనిమురుతూ”మీ ఆమ్మా నేనూ కలిసి చదువుకున్నాం .ఒకటి రెండుసార్లు ఈ బంగళాకి వచ్చాను. ఏమిటో అందరి జీవితాలలోను విషాదం చోటు చేసుకుంది.ఇలాటి కలయిక చాలా అరుదనుకుంటాను. నీతో అనుబంధం పెంచుకుందుకు సందేహించనవసరం లేదు ఎనభై ఏళ్ల తరువాత అనుబంధాలేమిటని ఆశ్చర్యపోతున్నారా అందరూ?”  “లేదు అంకుల్ ఒక్క రోజైనా అనుబంధం అనుబంధమే. పోనీండి అంకుల్ అందరూ పిల్లల్ని దత్తత చేసుకుంటారు నేను మిమ్మల్ని తండ్రిగా దత్తత చేసుకుంటాను.”అంది లావణ్య ఆనందరావు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.” పెద్దమ్మా పందిరికి మరో రాట చేర్చుకుంటున్నావా?”అడిగాడు రఘు “ఈ రాట చిగురించదు బాబూ కంగారుపడకు”అన్న ఆనందరావు మాటలతో వాతావరణం తేలికయింది.అందరూ విందు భోజనానికి భోజనాల హాలుకి కదిలారు.

ద్వితీయం

సావిత్రి రామనాధంని పెళ్లిచేసుకునేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించింది. ముఫైఅయిదేళ్ల వయసువరకు పెళ్లి లేకుండా గడిచిపోయింది కాని మిగతా జీవితం ఏఆసరా లేకుండా బ్రతకాలంటే చాలా కష్టమని వూగిసలాడింది. రామనాధం రెండోపెళ్లి కోసం యిచ్చిన ప్రకటన చూసి ఎంతో ఆలొచించుకుని ప్రకటనకి జవాబిచ్చింది.

మూడోనాటికల్లా అతనివద్దనుంచి జవాబు వచ్చింది ఆదివారంకలుసుకుని మాట్లాడుకుందికి ఏర్పాటయింది. అనుకున్నటైముకి హొటల్ రెసెప్షన్ వద్ద యిద్దరూ కలుసుకుని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.రామనాధం బుక్ చేసిన టేబిల్ వద్ద యిద్దరూ కూర్చున్నారు.సంభాషణ రామనాధమంమొదలు పెట్టాడు.”నేను బేంక్ ఆఫ్ ఇండియాలో మేనేజరుగా వర్క్ చేస్తున్నాను. నాభార్యపోయి నాలుగు సంవత్సరాలయింది ఆరు సంవత్సరాల అమ్మాయివుంది నాకు నలభై ఏళ్లు.నాభార్య పోయిన తరువాత పెళ్లి చేసుకోకుండా పాపని పెంచుకుంటూ శేష జీవితం గడుపుదామనుకున్నాను. కాని వుద్యోగం చేస్తూ పిల్ల మంచిచెడ్డలు చూసుకోవడం నావల్లకాలేదు ఏపనికీ న్యాయం చెయ్యలేకపోతున్నాను. అందుకోసమని పెళ్లిచేసుకోవాలనుకుని ప్రకటన యిచ్చాను.నాకు వెనుకా ముందూ ఎవరూలేరు క్లుప్తంగా యిది నాపరిచయం యిక మీగురించి చెప్పండి.”

రామనాధం చేప్పినంత సింపుల్ గా సావిత్రి తన పరిచయంచెప్పలేకపోయింది. ధైర్యం కూడదీసుకుని చెప్పడం ప్రారంభించిది”నా పేరు సావిత్రి నావయసు ముఫైఅయిదేళ్లు తల్లితండ్రి చిన్నప్పుడేపోయారు మేనమామ పేంచాడు సైకాలజీలో ఎమ్మె చేసాను .యిన్నాళ్లైసరయిన జాబ్ దొరకలేదు .ఏవో చిన్న వుద్యోగాలు టెంపరరీ వుద్యోగాలు చేశాను. మామయ్య పోయి మూడేళ్లయింది, పెంచి పెద్ద చేసిన అత్తని వదిలి పెట్టకుండా ఈ మూడేళ్లు గడిపాను ఆమెకూడా నాలుగునెలలక్రితం చనిపోయింది నాకూ నాఅన్నవాళ్లెవరూ లేరు. యిన్ని రోజులూ వివాహం గురించి ఆలోచనకూడారాలేదు.మీ ప్రకటన చూశాక నాకూ జీవితంలో ఒకతోడు అవసరంఅన్న వూహ కలిగింది. అంతే తప్ప వైవాహిక జివితం యిలావుండాలి అలావుండాలి అన్న అభిప్రాయలేవీలేవు.యింతకన్నా నాగురించి చెప్పడానికేమిలేదు.”

” మనం ఒక్కసారి కలుసుకుని ఎటువంటి నిర్నయం తీసుకోకూడదు, నాకు భార్యగాకన్న నాబిడ్డకు తల్లిగా వస్తే నేను సంతోషిస్తాను. మా పాప పేరు స్వాతి,తల్లి పోవడం సరైన మార్గదర్శకత్వం లేక కాస్త మంకుగా ప్రవర్తిస్తుంది. నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం ఆమె మనసు మీద ఎటువంటి ప్రభావం కలుగుతుందో తెలియదు”. చాలా ప్రశాంతంగా చెప్పాడు రామనాధం.

“సరే ఒకలా చేద్దాం ఈ అవకాశాన్ని దృష్టిలోఉంచుకుని నన్ను మీ పాప మంచి చెడ్డలు చూసుకుందికి నన్ను అప్పాయింట్ చేసినట్లు  చెప్పి మీ యింటికి తీసుకు వెళ్లండి. మూడునెలలనుండి ఆరునెలలవరకు కేవలం మీపాపకు తల్లిగానడుచుకుంటాను. ఈ ప్రయత్నంలో నేను సక్సెస్ అయితే ఆతరువాత మనం పెళ్లి చేసుకోవచ్చు లేదా మనం స్నేహితులుగా విడిపోవచ్చు”.

సావిత్రి అభిప్రాయం విన్నాక రామనాధం నిశ్చేష్టుడయ్యాడు, భూమి మీద యింకా మంచితనం మిగిలివుందని భావించాడు అయితే సందేహంగా “అన్నాళ్లు నావద్ద మీరు వుంటే నలుగురూ నాలుగు విధాలుగా అనుకుంటారేమో!” సందేహం వెలిబుచ్చాడు. “ఈముఫై అయిదేళ్ల జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు సమస్యలతో సతమతమయ్యాను. లోకం నన్ను చూసి ఏమనుకుంటుందోనని ఆలోచించే శక్తి నాలో మిగలలేదు. మీరు పాపగురించి చెప్పారు,తల్లిలేని పిల్ల ఎంత అసహాయంగా ఫీలవుతుందో నాకు బాగా అనుభవం. నేను సైకాలజీ సబ్జెక్టు తీసుకుని ఎమ్మెచేసాను. చైల్డ్ సైకాలజీలో పి హెచ్ డి చేస్తున్నాను. యింకా కొన్ని పేపర్లు మిగిలాయి.నేను స్వాతిని చక్కగా మలచగలిగితే నా పి హెచ్ డి సహజంగా పూర్తి చేసినట్లుగా భావిస్తాను. నా ప్రయత్నంలో పరిణామం ఎలా వున్నా బాధపడను. అయితే యింత చదువుకుని మీ అమ్మాయికి గవర్నెస్ గా రావడానికి నాకు చిన్నతనం లేదు. తప్పు లేని పని ఏదయినా గౌరవించతగ్గదే! మీ స్నేహితులు బంధువుల విషయం మీరెలా సాల్వు చేసుకుంటారో మీ యిష్టం. నా ఈ ప్రపోజల్ మీకు అంగీకారం అయితే రేపు ఫోను చెయ్యండి ఎల్లుండి ఉదయాన్నే డ్యూటీలో చేరుతాను”. స్థిరమయిన స్వరంతో తెలిపింది  సావిత్రి.

రామనాధంకి ఆమె సూటిగా మాట్లాడే పధ్దతి స్వయం నిర్ణయం చేసుకునే ధైర్యం చాలా ముచ్చటవేసింది.”శుభకార్యానికి ఆలశ్యమెందుకు? ఈ రోజే మిమ్మల్ని మాయింటికి తీసుకు వెళ్లి స్వాతికి పరిచయం చేస్తాను. ఎప్పుడు మాయింటికి రావాలన్నది మీరు నిర్ణయించుకోండి నా తరఫునుంచి మీకు ఎటువంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురవదని హామీ యిస్తున్నాను”తలవంచుకుని ఆచెప్పే తీరులో అతని నిజాయితీ వెల్లడయింది. వెన్నెల కురిసినంత చల్లగా నవ్వింది సావిత్రి.”నేను భయపడటం అన్నది మర్చిపొయాను.శేషజీవితాన్ని గూర్చి బంగారు కలలుకనే వయసు కాదు. మీ సంగతేమో గాని ఒక తల్లి లేనిపిల్లకి తల్లిగా నిలువగలిగితే నాజీవితానికి సార్థకత కలిగినట్లు భావిస్తాను”.

ఈమాటలు విన్న రామనాధం కళ్లు చెమర్చాయి.”మీరు యింకొన్ని సంత్సరాల ముందు పరిచయమయితే బాగుండును, మా స్వాతి ప్రవర్తన మెరుగుపడెదేమో . చిన్నపిల్ల ఏమయినా మీ మనసు నొప్పించేలా మాట్లాడితే నేను క్షమాపణ కోరుకుంటాను”.

“తినబోతూ రుచులెందుకు? ఎక్కువ ఆలశ్యం కాకుండా వెళ్దాం పదండి”.రామనాధం కారులో యింటికి తీసుకు వెళ్లేడు ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణంసావిత్రికి యింటిపరిస్థితిఅర్ధమయింది. నౌకరు స్వాతిని పాలు తాగమని బతిమాలుతున్నాడు. యిల్లంతా బొమ్మలు బట్టలు చిమ్మి వున్నాయి,”అమ్మా! స్వాతీ ఎవరొచ్చారో చూడు”అన్నాడు రామనాధం ఎవరన్నట్లు తలెత్తి సావిత్రి వైపు చూసింది. సావిత్రి పలకరింపుగా నవ్వింది.” ఆంటీ నీతో ఆడుకుందికి నీకు తోడుగా వుండటానికి మనింటికి వచ్చి వుంటారు నేను ఆఫీసుకి వెళ్లినప్పుడు ఒక్కర్తివీ వుంటావుకదా నీకు ఏంకావాలన్నా చేసిపెడతారు” చాలా ఆలోచించి మాటలు కూడబెట్టి కూతుర్ని దగ్గరగా పట్టుకుని చెప్పాడు రామనాధం.

సావిత్రి మాటకలుపుతూ “నీ పేరు స్వాతికదూ నా పేరు సావిత్రి. నేను రెండు రోజుల తర్వాత వస్తాను నీకిష్టమైతే.నాకు రాని ఆటలు నువ్వు నేర్పించు నీకు రాని ఆటలు నేను నేర్పుతాను. నువ్వు స్కూలునుంచి వచ్చాక మనం మంచి ఫ్రెండ్సులాగ వుందాం. యింతకూ నీ రూము బొమ్మలు నాకు చూపిస్తావా”?” రండి ఆంటీ నా బొమ్మలన్నీ యిల్లంతాపడివున్నాయి నా రూములో కొద్దిగానే వున్నాయి”. అంటూతీసుకెళ్లింది.రామనాధాన్ని అక్కడే వుండమని సౌంఙ్ఞ చేసి స్వాతి చేయి పట్టుకుని లోపలికి వెళ్లింది.రూములో స్వాతి తల్లి ఫోటొ రేకు మీద పెట్టి వుంది. తెలియనట్లు యిదెవరి ఫోటో? అడిగింది స్వాతిని “మీకు తెలియదు  కదూ! మా అమ్మ ఫోటొ. మాఅ అమ్మకి జ్వరం వస్తే తగ్గ లేదని దేముడు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి రాజయ్యతాతే అన్నీ చేస్తాడు. నాన్నకి అస్సలు టైముండదు ఎప్పుడూ బేంకు బేంకు అంటారు నాతో మాట్లాడటాకే తీరికుండదు.”. తల్లి గురించి తండ్రిగురించి చెప్పింది.

“అలాగా నేను వస్తాను కదా మనం ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు ఆడుకోవచ్చు” అంటూ వాళ్లమ్మ ఫోటోని చేతిలో తీసుకుని తన కొంగుతో ఫోటో మీదవున్న దుమ్ముతుడిచి పెడుతూ స్వాతిని గమనించింది. ఆమె కళ్లల్లో ఒక విధమైన మెరుపు కన్పించింది.”ఓ కే స్వాతీ నేను వచ్చాక నీబొమ్మలు బట్టలు అన్నీ చక్కగా సర్ది నిన్ను స్కూలుకి పంపుతాను నీతోనే వుంటాను. మరి నేనంటే యిష్టమేనా? వచ్చేదా?””రండి ఆంటీ నాకు మీరెంతో నచ్చారు” ఆమెని పట్టుకుని తండ్రి దగ్గరికి తీసుకెళ్లి “నాన్నా యీ ఆంటీని తొందరగా మనింటికి రమ్మనండి మీరు బేంకునుంచి లేటుగా వచ్చినా నాకు ఆంటీ దగ్గర బాగుంటుంది” రామనాధం చాల రిలీఫ్ గా ఫీలయ్యాడు. “రండి మీ యింటి వద్ద దింపుతాను”.”వద్దు సార్! నేను బస్సులో వెళతాను ఎల్లుండి వస్తాను,నా బట్టలు సర్దుకుని తెచ్చుకోవాలికదా వస్తాను స్వాతీ” మొదటి రోజే తండ్రి తనకు యింపార్టెన్సు యివ్వడం స్వాతికి నచ్చకపోవచ్చని వూహించి బస్సులో వెళ్తానని చెప్పింది .”సరే ఆంటీ”స్వాతి ఎలా స్పందిస్తుందోనని భయపడ్డాడు కాని యింత తేలికగా ఒప్పుకుంటుందనుకోలేదు.. సరే! ఆమె పరిస్తితుల్ని యెలా టేకిల్ చేస్తుందో వేచి చూడటం తప్ప చేయగలిగింది లేదు. స్వాతికి మనసులో తనమీదగాని పెళ్లిచేసుకోబోయే సావిత్రి మీదగాని దురభిప్రాయం కలుగకుండా చూడటం ముఖ్యమని భావించాడు.
సావిత్రి స్నేహితురాలితో వుంటోంది. ఆమెకి సెటిల్ చేసుకునే వ్యవహారాలు ఏమీ లేవు గాని రామనాధం అభిప్రాయం ఎలావుంటుందో స్వాతి ఎలా స్పందిస్తుందో గమనించడానికి ఆఒక్క రోజు వ్యవధి అడిగింది. రూము చేరి స్నేహితురాలు గిరిజతో జరిగినదంతా చెప్పింది. “ఏమయినా ఈ విషయంలో నువ్వు సాహసిస్తున్నావనిపిస్తోంది సావిత్రీ! ఆడదిక్కులేని ఆ యింట్లో ఆరునెలలునువ్వు గడపడం సమర్ధనీయంగా వుంటుందా?” ” వెర్రిదానా మనం వుద్యోగాలకి వెళ్తున్నప్పుడు యింతకన్నా అర్ధ్వాన్నమయిన సంఘటలు ఎదుర్కొంటూ వుంటాం. అయినా వుద్యోగాలు మానం, యిదికూడా ఒక వుద్యోగమే అనుకుని జాయిన్ అయితే ఆతరువాత ఏమవుతుందో చూడటమే. అనుకూలంగా లేకపోతే అప్పుడే తప్పుకుంటాను” నీ యిష్టం సావిత్రీ నీ జీవితానికి నువ్వే బాటవేసుకోవాలి బెస్ట్ ఆఫ్ లక్”!”థేంక్స్ చాలా అలిసిపోయాను భోజనం చేసి నిద్రపోతాను”.” ఓ కే”.
స్వాతి ఆ రోజున్నరలో తండ్రిని సావిత్రి గురించి ఎన్నో మార్లు అడిగింది. ఆమె యింటికి వస్తే తనకి ఎలా వుంటుందో వూహించుకుంటూ గడిపింది. రామనాధం నౌకరు రాజయ్యతోను పనిమనిషితోను స్వాతిని చూసుకుందికి మనిషిని ఏర్పాటు చేసినట్లు ఆమె యింట్లో పాపతోనే వుంటుందని ముందుగానే చెప్పాడు. ఆమె వచ్చాక అపోహలు వుండకూడదని. చెప్పినట్లుగా సావిత్రి సింపుల్ గా ఒక సూట్ కేసుతో వచ్చింది.రామనాధం బేంకుకి వెళ్లేలోగా రావడంతో కొన్ని సామాన్లు ఎక్కడవున్నాయో చెప్పి ఆమె వుండటానికి ఏర్పాట్లు చూసి బేంకుకి వెళ్లాడు. ఏమయినా అవుసరమయితే ఫోను చెయ్యమని నంబరిచ్చి వెళ్లాడు. సావిత్రి విషయం ప్రాణస్నేహితుడైన మోహనరావుకి చెప్పాడు. అతను మిగతావన్నీ సమర్ధించినా డబ్బు దస్కం జాగ్రత్తగా పెట్టుకోమని విషయం తేలేదాకా ఎటువంటి యిబ్బందుల్లో పడకుండా చూసుకోమని హెచ్చరించాడు. అప్పుడప్పుడు యింటికి వచ్చి తనుకూడా గమనిస్తానని చెప్పాడు.

సాయంత్రం యిల్లు చేరేసరికి స్వాతి చాలా సంతోషంగా ఎదురొచ్చింది. రోజంతా ఎలాగడిపిందో తండ్రికి వర్ణించి చెప్పింది. రామనాధం తేలికగా వూపిరి తీసుకున్నాడు. స్వాతితో మసలుకోవడం కష్టమనిపించలేదు. కాని తనతో ఎప్పటికి అతుక్కుని వున్నట్లయితే పెండ్లి తరువాత రామనాధంతో భార్యగా మసలుకోవడంలో యిబ్బంది అవుతుందని అది దృష్టిలో పెట్టుకుని స్వాతి చదువు ఆటలు మిగతా కార్యక్రమాలన్నిటికి టైమ్ టేబిల్ సిధ్దం చేసింది. రామనాధంతో చెప్పింది నలుగురికి వంట చెయ్యటానికి వంటమనిషి ఎందుకు తనే చేస్తానని.రామనాధం సున్నితంగా వారించి మిగిలిన సమయం మీచదువుథీసిస్ కోసం వినియోగొంచండి ఈ మేటరు ఎలావున్నా మీ చదువుకి భంగం కలుగకూడదు అని.

అతని సంస్కారానికి మనసులోనే జోహార్లర్పించింది. ఆమె వచ్చిన తరువాత రోజులు సాఫీగా వేగంగా గడుస్తున్నాయి. ఒకరోజు స్వాతికి విపరీతంగా జ్వరం వచ్చింది డాక్టరుకి ఫోను చేసి పిలిపించింది,రాజయ్య చేత మందు తెప్పించి వేసింది. మంచం మీద కూర్చుని నుదుటి మీద తడి పట్టీ వేస్తూ సావిత్రి అడిగింది “మీ నాన్నగారికి ఫోను చేసి పిలవనా? స్వాతీ జ్వరంగా వుందికదా”.”వద్దు ఆంటీ మీరున్నారుకదా నాన్న సాయంత్రం వచ్చేస్తారు నాకేం భయం లేదు” తనమీద పాపకున్న నమ్మకానికి కళ్లు చెమర్చాయి. అయినా పాపకి తెలియకుండా రామనాధంకి ఫోను చేసింది గాభరా పడవలసిన పనిలేదని ధైర్యం చెప్పింది. సాయంత్రం యింటికి వచ్చాక కూతురిమంచం వదలకుండా కబుర్లు చెప్తూ పండ్లు కోసి తినిపించాడు.

రాత్రి స్వాతికి జ్వరం పెరిగిపోయింది దాంతో పలవరించుతోంది,”నాన్నా నాకు సవతి తల్లి వద్దు నాన్నా నన్ను కొడుతుంది.నా చేత అన్ని పనులు చేయిస్తుంది.నాకు వేరే అమ్మ వద్దు నాన్నా.” పలవరింతలు విన్న సావిత్రికి గుండెల్లోంచి ఒణుకు వచ్చింది.మనసు కూడదీసుకుని స్వాతికి ఒళ్ళు తుడిచి తడి పట్టీ నుదుటి మీద వేసి మందు వేసి రాత్రంతా అలాగే అన్య మనస్కంగా కూర్చుంది.

వుదయం డాక్టరు వచ్చి చూసి జ్వరం తగ్గిందని కంగారు పడాల్సిన పని లేదని వేరే మందిచ్చారు.డాక్టరు తో బయటకు వచ్చి రాత్రి స్వాతి పలవరింతల సంగతి చెప్పింది సావిత్రి.స్కూల్లో యిటువంటి సంభాషణ ఏదో వచ్చి వుంటుంది చిన్న పిల్ల కదా భయంతో జ్వరం పలవరింతలు వచ్చుంటాయి.నెమ్మదిగా ఏం జరిగిందో కనుక్కోండి.

ఆ రోజంతా దిగులుగా వుంది సావిత్రి.”ఏమయింది ఆంటీ? నా జ్వరం తగ్గి పోయిందికదా మనం మళ్ళీ ఆడుకుందాం.స్కూలుకి ఆబ్సెంట్ అయాను ఫరవా లేదా?” ఏమీ లేదమ్మా నీకు జ్వరం వచ్చిందికదా అందుకే బెంగగా వుంది. అంతకన్నా మరేం లేదు. నువ్వు తొందరగ బాగయిపో మన మళ్ళీ ఆడుకుందాం.”

ఆడుతూ ఆడుతూ మాటల మధ్యలో సవతి తల్లి విషయం నెమ్మదిగా అడిగింది సావిత్రి.క్లాసు అమ్మాయి కధ ఒకటి చదివి అందులో సవిత్తల్లి విషయం చెపుతూ “నీకు కూడా మీ అమ లేదు కదా నీకు మరో అమ్మ వస్తే కధలో లాగే నిన్ను కూడా బాధ పెడుతుంది”అంది.

అప్పతిటినుంచి తల నొప్పిగా అనిపించి జ్వరం వచ్చింది. అనగానే స్వాతిని దగ్గరకు తీసుకుని “అందరూ ఒక్క లాగ వుండరమ్మా కధలలో అన్నీ ఎక్కువ చేసి చెపుతారు .పిల్లల మాటలకు అంతలా బాధ పడకూడదు.అయినా నీ లాంటి మంచి అమ్మాయికి ఎటువంటి కష్టం రాదు .నీ యిష్టం లేకుండా మనింటికి వేరే వాళ్ళెవరూ రారు సరేనా? నువ్వు నవ్వుతూ వుండాలి .”అనగానే సావిత్రి గుండెల్లో గువ్వలాగ ఒదిగి పోయింది.

ఈ విషయం రామనాధానికి చెప్పడానికి జంకింది సావిత్రి.ఏమీ జరగనట్లు యింట్లో మెలగ సాగింది.మూడు రోజుల జ్వరం పాపని సావిత్రికి మరింత దగ్గర చేసింది. ఏమి కొనుక్కోవాలన్నా ఆంటీ స్కూలు వర్కు చెయ్యాలన్నా ఆంటీ ఏనాడేనా ఆమె పెండ్లి వద్దనుకుని వెళ్లిపోతే స్వాతి పరిస్తితి ఏమవుతుందని సందేహంలో పడ్డాడు రామనాధం. స్వాతీ నీ పనులు నువ్వు చేసుకోవడం అలవాటు చేసుకోమ్మా ఎప్పుడైనా ఆంటీ వేరే చోట వుద్యోగానికి వెళితే నీకు యిబ్బందవుతుంది. ఈ మాటలు విన్నాక స్వాతి ఆరోజంతా డల్ల్ గా అయి సరిగా భోజనం చెయ్యలేదు తనెక్కడికి వెళ్లటం లేదని నచ్చ చెప్పి పరిస్తితి సర్దుబాటు చేసింది సావిత్రి .

ఒక రోజు రాత్రి నిద్రలో ఎవరో వాంతి చేసుకుంటున్న శబ్దం విని సావిత్రి హడావిడిగా లేచింది రామనాధం గదిలోంచి వినిపిస్తోంది.రాజయ్యని లేపి అతనికి సహాయం చేయించింది.డాక్టరుని పిలిపించింది. బయట డిన్నరు తీసుకోవడం వలన పడక అలా అయిందని డాక్టరు మందిచ్చి ఒక రోజు రెస్టు తీసుకోమన్నాడు. మర్నాడు లైట్ గా వంట చేసిపెట్టి మందులు గుర్తుగా వేసింది. ఇది చూశాక స్వాతి గాభరా పడి “ఆంటీ మీరెప్పటికి మాతోనే వుండండి నాన్నకేమయినా అయితే నేనెలా చూసుకోగలను? రాజయ్యతాత ముసిలై పోయాడు రాత్రి లేవడు” అంటూంటే వుండాలనే వచ్చానమ్మా కాని ఆ బంధంఏర్పడటానికి నీ సహాయం కావాలి మనసులోనే అనుకుంది.

ఒక రోజు పెట్టెలో బట్టలు సర్దుతూంటే స్వాతి కుతూహలంగా పక్కనకూర్చుని “ఆంటీ యిప్పుడు పెట్టెందుకు సర్దుతున్నారు?” “ఏం లేదమ్మా అన్నీ నలిగి అటూ యిటూ పడి వుంటే సర్దుతున్నాను”. ఆమె చీరలు చూసి “ఆంటీ మీకు మంచి చీరలు మెరిసేవి లేవా?”నాకెలా ‘వస్తాయమ్మా? నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న యిద్దరూ దేముడి దగ్గరకెళ్లిపోయారు. మా మామయ్య నన్ను పెంచారు. మంచి బట్టలు కొనడానికి అతని దగ్గర అంత డబ్బు లేదు. అందుకనే నేను బాగా చదువుకుని మంచి వుద్యోగంచేసి అప్పుడు మంచి చీరలు కొనుక్కుంటాను”.

“అయ్యో! పోనీ అమ్మ చీరలు బీరువాలో వున్నాయి కట్టుకోండి ఆంటీ” “తప్పమ్మా అలా ఎవరు పడితే వాళ్లు అమ్మ చీరలు కట్టుకోకూడదు. నువ్వు పెద్దయ్యాక అమ్మ మంచి మంచి చీరలు కట్టుకుందువుగాని సరేనా?పద నీకు తల దువ్వుతాను ఆడుకుందువుగాని” . రామనాధం వచ్చాక యీ సంఘటన తండ్రికి చెప్పింది. “అమ్మ చీరలు ఆంటీ కట్టుకో కూడదా నాన్నా?”అమాయకంగా అడిగిన ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అదే సందర్భంలో మోహనరావు ప్రవేశించి “ఏమిటి తండ్రీ కూతుర్లు చిక్కు సమస్యలో యిరుక్కున్నారు?” ప్రశ్నించాడు. అదే ప్రశ్నని తిరిగి మోహనరావుని ప్రశ్నించింది.

కాసేపు తటపటాయించి “ఆంటీకి యిష్టమయితే కట్టుకోవచ్చనుకో , కాని మనింట్లో రాజయ్యతాత పనిమనిషి సీతాలు పాలుపోసే రంగయ్య అందరూ ఆంటీని మీ అమ్మ అనుకుంటారు.అప్పుడెలాగ?” “అలా అనుకోకూడదా అంకల్?””అనుకోవచ్చనుకో నువ్వు అనుకోకపోతే ఆంటీకి బాధగా అనిపిస్తుంది. అప్పుడు వేరే చోటికి వెళిపోతుంది. ఇందులో యింత చిక్కుంది” కాఫీ చేసి పట్టుకొస్తున్న సావిత్రి గాభరా పడింది.

ఈ మాటలకి స్వాతి ఎలా స్పందిస్తుందోనని.రాత్రి ఏమీ మాట్లాడకుండా గుడ్ నైట్ చెప్పకుండా పడుక్కుంది.సావిత్రికి ఏం చెయ్యాలో తోచలేదు. ఉదయం రామనాధం వద్దకెళ్లి “నాన్నా ఆంటీ మనింటినుంచి వెళ్లకూడదు. అలా చెయ్యాలంటే మనమేం చెయ్యాలి?” నిర్ఘాంతపోయాడు కూతురి మాటలకి. “ఆంటీనడుగమ్మా మనతోనే వుండటానికి ఆమెకి యిష్టమో కాదో” సందిగ్ధంగా అన్నాడు.”ఆంటీకి నేనంటే చాలా యిష్టం నన్నొదిలి అస్సలు వెళ్లదు.మీరు చెప్పండి నాన్నా”. సరే నేను బేంకునుంచి వచ్చాక చెప్తాను నువ్వు స్కూలికి వెళ్లు”అన్నాడు. ఆ చిన్ని బుర్రకి ఈ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియలేదు.

రాజయ్యతాత వద్దకెళ్లి తన సమస్యని అతని ముందుంచింది.”ఓస్ యింతేనా మీ నాన్న గారు సావిత్రమ్మని పెళ్లి చేసుకుంటే ఆమె ఎక్కడికీ పోకుండా మీతోనే వుండిపోతారు”.తనకున్న తెలివితేటలు బయట పెట్టేడు. ఇదేదో బాగుందని సాయంత్రం తండ్రి రాగానే పెద్ద తరహాగా చెప్పింది,”నాన్నా ఆంటీ మనతోనే వుండిపోవాలంటే నేను చెప్పినట్లు చెయ్యండి”. “ఏం చెయ్యాలమ్మా?”గాడ్ ప్రామిస్”” ఎస్స్ గాడ్ ప్రామిస్””ఆంటీని మీరు పెళ్లి చేసుకుంటే ఆంటీ ఎక్కడికీ వెళ్లదు”. అవాక్కయిపోయాడు స్వాతి కన్న కూతురా కన్న తల్లా అనుకున్నాడు. “ఎవరు చెప్పారమ్మా?” “మిమ్మల్నడిగితే సాయంత్రం చెప్తానన్నారు. అంతవరకు ఆగలేక రాజయ్యతాతనడిగాను. నాకు యిష్టమే అందుకని మీకు చెప్పాను”. కాసేపు నోట మాట రాలేదు.”నాన్నా మాట్లాడరేం?”

“అమ్మా! ఆంటీని అడుగు అంతేకాని మనమే అలా చెయ్యాలి యిలా చెయ్యాలి అనుకోకూడదు. ఆంటీకి మనింట్లో వుండిపోవడం యిష్టమో కాదో”లోపలి గదిలోనున్న సావిత్రివద్దకు పరుగెత్తుకెళ్లి “ఆంటీ ఒక సారి రండి”అంటూ చెయ్యి పట్టుకుని తండ్రి వద్దకు తీసుకు వచ్చింది.” ఏమయింది స్వాతీ?”అంటున్నా వినిపించుకోకుండా”ఆంటీ యిప్పుడు చెప్పండి మీకు మాయింట్లో వుండిపోవడంయిష్టమేనా?”వెనుకజరిగిన విషయాలేమీ తెలియక వెంటనే “నాకయితే ఎప్పటికీ నీతోనే వుండటం యిష్టం స్వాతీ”అంటూ దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టింది. “చూశారా నాన్నా ఆంటీకి యిష్టమే మీరేమంటారు?”రామనాధంకి భగవంతుడే బిడ్డ రూపంలొ సంధానకర్త అయినట్లనిపించింది.

సావిత్రి తేరుకుని “యింతకూ ఎందుకింతలా అడుగుతున్నావు?నేను వెళ్లిపోతానని అనలేదే?” “నాకే భయం ఆంటీ మీరెప్పుడైనా వెళ్లిపోతే నేనెలా వుండాలి? అందుకని నాన్నతో చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే యిక్కడే వుండిపోతారని” “స్వాతీ ఎవరు చెప్పారమ్మా నీకివన్నీ” “రాజయ్యతాత” సరే యివి ఒక రోజులో చేసే పనులు కావమ్మా నేనెక్కడికీ వెళ్లనుగాని మోహనరావు అంకల్ నికూడా అడుగుదాం సరేనా?” సరేనని లోపలికెళ్లి మోహనరావు నంబరు డయల్ చేసి” అంకల్ మా యింటికి వస్తారా?””నిన్ననే కదమ్మా వచ్చాను పనేమిటో చెప్పు” “అంకల్ నాన్నకి ఆంటీకి పెళ్లి చెయ్యాలి మీరు వేగం రండి” మోహనరావు నోట మాట రాలేదు.”యిప్పుడే వస్తున్నా స్వాతీ” అంటూ ఫోను పెట్టీసేడు.

అయిదు నిమూషాల్లో రామనాధం ముందు నిలబడ్డాడు.”ఏమిటిది స్వాతి ఫోను చేసి పిలిచిందినీకూ సావిత్రికి పెళ్లి చెయ్యాలని.నాకేమీ అర్ధం కాలేదు.””ముందు కూర్చో”.ముందురోజు జరిగిన తతంగం కొంత మోహనరావుకి తెలుసు తరువాత జరిగినది పూర్తిగా వివరించాడు.”సరే రోగీ పాలే కోరాడు వైద్యుడు పాలే తాగమన్నట్లయింది” “నాకేం పాలుపోవటం లేదు.మిగతా కార్యక్రమంనువ్వు చూడు స్వాతిని ఎలా టేకిల్ చెయ్యాలో తికమకగా వుంది.” “అమ్మా స్వాతీ! యిలారా నువ్వు చెప్పినట్లు పెళ్లి చేసేద్దాం. కాని నువ్వు టి వి లో సినిమాలో చూసినట్లు కాదు. వీళ్లిద్దరూ మేరేజ్ ఆఫీసుకెళ్లి సంతకాలు పెట్టాలి అప్పుడు మీ అమ్మకూడా యీ పెళ్లి ఒప్పుకున్నట్లు ఆ తరువాత బేంకువాళ్లకి చెప్పాలి వుత్తినే చెపితే బాగుండదు కదా.చిన్న పార్టీ యిచ్చి వీళ్లిద్దరికీ మనం పెళ్లి చేసినట్లు చెబ్దాం సరేనా? ఏమంటావ్?”చప్పట్లు కొడుతూ “చాలా బాగుంది అంకల్ అలాగే చేద్దాం. నేను చిన్నదాన్నికదా మీరు యివన్నీ చెయ్యండి అంకల్”.  రామనాధంతోపాటు సావిత్రికూడా శాంతపడింది. ఈ విషయం యింత సింపుల్ గా సాల్వ్ అయినందుకు. శనివారం వుదయం రిజిష్టారాఫీసులో పెళ్లి సాయంత్రం పార్టీ. పార్టీకి వచ్చిన బేంకు స్టాఫులో వయసుమళ్లిన శేషాచలంగారు ఆశీర్వదిస్తూ మీరు ద్వితీయ వివాహం చేసుకుని చాలా మంచిపని చేశారు .మీ పాపని చూసుకుందికి మంచి అమ్మాయి లభించింది. కంగ్రాట్యులేషన్స్! అంటూంటే పక్కనే వున్న మోహనరావు అయ్యా యిది ద్వితీయం కాదు అద్వితీయం అనగానే అక్కడ వున్నవాళ్లంతా ఘొల్లున నవ్వారు.

అమెరికా అల్లుడొస్తున్నాడు హాస్య నాటిక

పాత్రలు:- రఘునాధరావు—తండ్రి
పార్వతి—-తల్లి
లక్ష్మి—-పెద్దకూతురు
వెంకట్—అల్లుడు
వసంత—చిన్నకూతురు
తెర లేచేసరికి పధ్దెనిమిది సంత్సరాల వసంత ఫోన్లో మాట్లాడుటూంటుంది
వసంత: హలో!ఆ ఆ వున్నారు పిలవనా మట్లాడతావా సరే అలాగా ఆహా తప్పకుండా అమ్మకి న్నాన్నకి చెప్తున్నా అలాగే ఫోను పెడుతున్నా మరి (సైడు కర్టెను వైపు చూస్తూ) అమ్మా నాన్నా త్వరగా రండి . ముందుగా తల్లి ఆ వెనుకగా తండ్రి ప్రవేసిస్తారు.
తల్లి: ఏమయిందే? కొంపలంటుకున్నట్లు కేకలు పెడుతున్నావు? నాకసలే బ్లడ్ ప్రెషరు కంగారు పెట్టక త్వరగా చెప్పు
వ్సంత: అక్క బావగారు యీ రోజు ఇండియా వచ్చేరుట మనకి ముందుగా మెసేజి యివ్వటం కుదరలేదుట రేపు యిక్కడికి వస్తున్నారుట. బావగారి స్నేహితుడు కూడా వాళ్లతో వచ్చేడుట అతన్ని హొటల్లో దింపి అక్కయ్య బావగారు యింటికి వస్తామన్నారు.
తండ్రి: ఏ బండిలో వస్తున్నదీ చెప్పలేదమ్మా?
వసంత: ఏమో మనని కంగారు పడవద్దని అక్కయ్య వుందిగా యిల్లు కనుక్కుందికి అన్నారు బావగారు.
తల్లి: అమ్మో ఒక్కరోజులో అరేంజిమెంట్లు ఎలా చెయ్యగలం? మనింటిని మోడరన్ గా మార్చవద్దూ.
వసంత: అమ్మా మరీ మోడరన్ గా మార్చేస్తే అక్కయ్య మనిల్లు పోల్చుకోలేదేమో.
తల్లి: ఏయ్ వసంతా బావగారి ముందు యిలా అమ్మా అసిరమ్మా అంటూ పిలవకు అతను అమెరికాలో పుట్టి పెరిగాడు. అక్కావాళ్లున్నాన్నాళ్లు మమ్మీ లేదా మామ్ అని పిలువు.
వసంత: అమ్మో అమ్మకి అమెరికా జ్వరం మొదలైనట్లుంది.(తల్లి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తుంది)
తల్లి:చాల్లే గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లుంది. యిదిగో మిమ్మల్నే అల్లుడున్న వారం రీజులూ యీ దిక్కుమాలినపంచలు లుంగీలూ మాని యించక్కా సూటు బూటు వేసుకోండి. లేకుంటే అత్తమామలు మరీ యింత పాతకాలం వాళ్లా అనుకుంటాడు. అన్నట్లు యింకో మాట నన్ను పార్వతీ పార్వతీ అని పిలవకండి (దగ్గరగా వచ్చి గారంగా) యించక్కా పారూ అంటూ పిలవండి.
తండ్రి: బాబోయ్ యిదెక్కడి గోలే పారు పారూ అంటూంటే భగ్నప్రేమికుడు దేవదాసులా చేతిలో బాటిలు ఖళ్లు ఖళ్లుమంటూ దగ్గుతూ జగమే మాయా బ్రతుకే మాయా యివే కళ్లముందు మెదులుతాయి.
తల్లి: చాల్లెంది మరీ బడాయి ఏది ఏమయినా యీవారం రోజులూ నేను చెప్పినట్లు వినాల్సిందే లేకుంటేఅల్లుడు మనగురించి ఏమనుకుంటాడు మనల్ని అనాగరికులమనుకుంటాడు .
తండ్రి: నీ ధోరణి నీదె గాని ఎవరిమాట వినవు కదా తొలిసారిగా అమ్మాయి అల్లుడు యింటికి వస్తున్నారంటే బొబ్బట్లు చేసిపెడతాను పెరుగు గారెలు చేసిపెడ్తాను అనే అత్తగార్లని చూసానుగాని పారూ అని పిలవండి సూట్లేసుకోండి నా మతి పోతోంది భగవంతుడా!(లోపలికి వెళ్తాడు)
తల్లి: (ఫోను డయల్ చేసి) హలో నవీన్ యింటీరియర్ డెకొరేటర్స్? నేను ప్రొఫెసర్ రఘునాధరావుగారి భార్యని మాట్లాడుతున్నాను. మాయింటిని మోస్ట్ మోడ్రన్ గా మార్చాలి ఎన్నాళ్లా అబ్బే రేపటిలోపున ఏమిటి అంత షార్ట్ టైమ్ లో వీలుకాదా సరే (నిస్పృహగా ఫోను పెట్టేస్తుంది)
వసంత: అమ్మా(అని నాలిక కొరుక్కుని) ఆమ్ (కాదన్నట్లు చెయ్యి దులిపి)అమ్మీ
తల్లి: ఏమిటే మమ్మీ లేకుంటే మామ్ అనమంటే ఆమ్ అమ్మీ యిదేం పిలుపే?
వసంత: ఏంచెయ్యమంటావు చిన్నప్పటినుండి అమ్మా అమ్మా అనేదాన్ని పట్టుకుని మమ్మీ మామ్ అనమంటె యిలాగే వుంటుంది. అమ్మా నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. అక్కయ్య పరాయిదా మనింట్లో పుట్టి పెరిగింది. బావగారు అక్కయ్యని నచ్చి మెచ్చి పెళ్లి చేసుకున్నారు. నీ హడావిడితో మా మతులు పోగొడుతున్నావు. అక్కయ్య అమెరికా వెళ్లాక యీరెండేళ్లలో తనకిష్టమైనవి తినగలిగిందో లెదో చేగోడీలు కోవాబిళ్లలూ చేద్దామా పద పద (అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళుతుంది తల్లి నుదురు కొట్టుకుంటు వెళ్తుంది)
తెర పడుతుంది తెర లెచేసరికి వసంత పరికిణీవాణీవేసుకుని పదహారణాల తెలుగు అమ్మాయిలా ముస్తాబయి సోఫాలమీది కవర్లు సర్దుతూ వుంటుంది యీలోగా తల్లి కాస్త మోడర్న్ హెయిర్ స్టైల్తో నాజూకైన చీరతో చేతి గాజులు సవరించుకుంటూ ప్రవేశిస్తుంది.
తల్లి: వసూ యింకా అలాగే వున్నావేమిటె అక్కావాళ్లూ వచ్చే టైము అయింది వెళ్లి మామయ్య బొంబాయినుంచి తెచ్చిన స్కర్టుమిడి టాపు వేసుకో
వసంత: అమ్మా అక్కయ్యవాళ్లు వున్న వారం రొజులూ అదే డ్రెస్సు వేసుకోవాలా యింకొకటి మార్చవద్దా?
(తండ్రి సూటు బూటు తో ప్రవెశిస్తాడు)
తండ్రి: పార్వతీ లక్ష్మీ అల్లుడు హొటల్నుంచి బయలు దేరారుట ఏక్షణంలోనైన వచ్చేస్తారు నాచిట్టి తల్లిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వుంది.(జేబు లోంచి రుమాలు తీసి కళ్లు తుడుచుకుంటాడు)
తల్లి: నిన్నటినుంచి చెప్పి చెప్పి నా నోరు నొప్పేగాని మీ యిద్ద్రికీ ఏమాటా చెవుల్లో దూరటం లేదు ఆ చిట్టీ పొట్టీ ఏమిటి? అల్లుడిముందు కూడా యిలాగే మాట్లాడతారా? అల్లుడితో మనకున్న పరిచయం చాలా కొంచం అతని అభిరుచులేమిటో అలవాట్లేమిటో తెలియదు మన పాత పధ్దతులు నచ్చుతాయోలెదో తెలుసుకోవాలికదా
తండ్రి: నిజమే పర్వతీ నేనంతగా ఆలొచించలేదు
వసంత: అమ్మా పెళ్లిలో బావగారు లక్షణంగా పంచ కట్టుకున్నారుకదే!
తల్లి: ఆ…ఆ..పెళ్లిలో నలుగురూ ఏమనుకుంటారోననికట్టుకుని వుంటాడు. అమెరికాలో పుట్టి పెరిగి వుద్యోగంచేస్తున్న కుర్రాడికి కోనసీమ కొరివికారం నచ్చుతుందా?
వసంత: కోనసీమ పిల్ల నచ్చినప్పుడు కొరివికారం కూడా నచ్చవలిసిందే.(యింతలో లక్ష్మి భర్త ప్రవేశిస్తారు.అల్లుడు సాదా పైజామా కుర్తాలోను లక్ష్మి పట్టు చీర తలనిండా పువ్వులతోను వుంటారు)వాళ్లని చూడగానే పరుగున వెళ్లి అక్కయ్యాబాగున్నావా అంటూ వసంత లక్ష్మిని భుజం మీద చేయి వేసి తెస్తుంది
లక్ష్మి: ఆ !వసూ నువ్వెలావున్నావ్? అమ్మానాన్నా లేరా?
వసంత:యీ యిద్దరూ అమ్మా నాన్నే! మరీ పోల్చుకోలేనంతగా మారిపోయారా? బాగున్నారా బావగారూ?
తలవంచి విష్ చేసినట్లు నవ్వుతాడు తండ్రి దగ్గరగా వచ్చి
తండ్రి: లక్ష్మి తలమీద చేయి వేసు నిమురుతూ రా నాయనా కులాసానా? అమ్మా లక్ష్మీ బాగున్నావమ్మా?
లక్ష్మి: తండ్రిని ఎగాదిగా చూసి ఎక్కడికైనా వెళ్తున్నారా నాన్నా?సూటు బూటులొ వున్నారు?
తండ్రి: ఏం చెప్పమంటావమ్మా? నిన్న మీరు వస్తారని తెలిసినప్పటినుండి నన్ను వూదరగొట్టి మీ అమ్మ ఈ పగటి వేషం వేయించింది
లక్ష్మి: అమ్మా నేను వచ్చిన దగ్గరనుండి ఒక్క మాటకూడ మాట్లాడలేదు ఏమయిందమ్మా?(దగ్గరగా వచ్చి తల్లి భుజంమిద తలపెట్టుకుండి
వసంత: అక్కయ్యా అమ్మని అమ్మా అసిరమ్మా అంటూ పిలవ్వద్దంది.
లక్ష్మి: అరే ఎందుకని?
తల్లి: అమెరికాలో మామ్ మమ్మి అంటారుకదా
.వెంకట్: నమస్కారమ్ అత్తయ్యగారూ మీరూ మామయ్యగారూ మా పెళ్లిలో ఆది దంపతుల్లా కనిపించారు మాకు మిమ్మల్నలా చూస్తేనే బాగుంటుంది.అది సరె రాత్రి భోజనంలో ఏం చెస్తున్నారు?
తల్లి: సేండ్ విచ్ వెగిటబుల్ సలాద్ (మాట పూర్తి కాకముందే )
వెంకట్: స్వర్గానికి వెళ్లినా సవతి పొరు తప్పనట్లు శాన్ ప్రాన్సిస్కోవదిలినా శాండివిచ్ వదలదా? అత్తయ్యగారూ చక్కటి గోంగూర పచ్చడి మెంతి వంకాయ కూర ఆవకాయ గడ్డపెరుగు తిన్నాలని మేం వస్తే రోగిష్టి భోజనం పెడతానంటారెమిటి?
తండ్రి: మరే నాయనా మీకేం కావాలంటె అదె చేసి పెడుతుంది. పద పార్వతీ ఆ ఏర్పాట్లు చూడు
అవును నాయనా మీ స్నేహితుడు మీతొ వచ్చాడన్నావు మనిల్లుండగా అతన్ని హొటల్లొ వుంచడమెందుకు? అతన్ని యిక్కడికే తీసుకు వస్తే అందరం కలిసి సరదాగా వుందాం.
వెంకట్: మామయ్యగారూ మేమొక వుద్దేశంతొ యిక్కడికి వచ్చాం.అమెరికాలొ వున్నవాళ్ల మనసులు ఆలోచనలు అలవాట్లు యిండియాలో వున్నట్లే వుంటాయి. మేము ప్రతిక్షణం పగలు రాత్రి మన దేశ సౌంస్కృతి ఆచార వ్యవహాల పట్ల అభిరుచి పెంచుకుని పక్కా భారతీయులుగా ఏప్రాంతం వారు ఆ ప్రాంతపు ఆచారవ్యవహారాలను పాటిస్తుంటాం. అందుకే తెలుగమ్మాయి కావాలని మీ అమ్మాయిని చేసుకున్నాను.
వసంత: బావగారూ మా అమ్మ నిన్నటి నుండి మాకు యిన్ స్ట్రక్షన్స్ యిచ్చి యిచ్చీ అలిసి పోయింది మీ మాటలు అమ్మని చాలా నిరుత్సాహ పరిచినట్లున్నాయి. చూడండి ఎలా ముఖం వ్రేలాడేసుకుందో.
లక్ష్మి: అమ్మా అమెరికాలో వున్నవాళ్లు మనుషులుకారూ? యిక్కడ దొరికే అన్ని వస్తువులు అక్కడకూడా దొరుకుతాయి. తేడా యేమిటంటే యిక్కడ ఫ్రెష్ గా దొరుకుతాయి అక్కడ మామూలుగా కొన్ని దొరికితే కొన్ని ఫ్రోజెన్ దొరుకుతాయి. ఒక సారి పనసకాయ కూర చేసాను తెలుసమ్మా?
తల్లి: అదేమిటే లక్ష్మీ మరీ అంత పల్లెటూరి భోజనాలు చేస్తారా?
(అందరూ గొల్లున నవ్వుతారు)
వెంకట్: అత్తయ్యగారూ! కొడుకు దేశాధ్యక్షుడయినా తల్లి ఏరా నాయనా అని పిలవకుండా వుంటుందా? ఏయ్! మరదలు పిల్లా కాస్త మంచి నీళ్లు తెచ్చి అతిథి మర్యాదలు చెయ్యి
(వసంత లోపలికి వెళుతుంది)
వెంకట్: మామయ్యగారూ నా స్నేహితుడు డాక్టరు మంచివాడు లక్ష్మిలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని తరుచు నాతో అనేవాడు మన వసంత ఫొటో చూపిస్తే నచ్చుకున్నాడు. యిక్కడికి రావటానికి అవకాశం కలిగింది. అందరికీ అంగీకారం అయితే ఆ శుభకార్యం జరిపించేద్దాం ఏమంటారు? నయం అతన్ని హొటల్లో దింపడం మంచి పని చేశాను యిక్కడి వాతావరణం చూసి నెక్స్ట్ ఫ్లైటులో వెళ్లిపోయేవాడు. వుద్యోగరీత్యా ఎన్నో దేశలు తిరగవచ్చుగాని కన్న తల్లిని స్వదేశాన్ని మరిచిపోకూడదు. అత్తయ్యగారూ యిప్పటికయినా అమెరికా జ్వరం నుంచి బయట పడితే మా స్నేహితుడు మోహన్ని తీసుకు వస్తాను ఏమంటారు మామయ్యగారూ?
తండ్రి: ఏమంటాను నాయనా నామీద నాకే సిగ్గు వేస్తున్నాది. మీ అత్తగారు చెప్పగానే ముందూ వెనుకా ఆలోచించకుండా యీ గంగిరెద్దు వేషం వేసెసుకున్నాను. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం నాయనా అల్లుడివయినా కొడుకువయిన నువ్వే.
(వసంత ట్రేలో మంచి నీళ్లు తెస్తుంది)
వెంకట్: ఏం మరదలుపిల్లా అమెరికాలో వసంత కోకిలలా మోహనరాగం ఆలాపిస్తావా?
వసంత: (జడతిప్పుతూ) పొండి బావగారూ!
లక్ష్మి: పొండి అంటే ఎలా పోతామే నిన్నుకూడ తీసుకునే వెళ్తాము. అమ్మా నువ్వేమీ అనటంలేదేమిటీ?
తల్లి: ఏమీ అనడానికి మిగల్లేదు. మీ నాన్నగారు చెప్పినట్లు బొబ్బట్లు పులిహొర ఆవడలు చెయ్యటానికి వంటింట్లోకి వెళ్తున్నాను.(అందరూ మనసారా నవ్వుకుంటారు)
శుభం

అమ్మాయే కావాలి

అమ్మాయే కావాలి
ఆడపిల్ల పుట్టింది ఈమాటలు మగతలోవున్న శారద చెవుల్లో పడ్డాయి. ఆతృతగా బిడ్డని చూడాలని కళ్ళుతెరచి “నర్స్ పాప పుట్టిందా”? “అవునమ్మా యిదిగో చూడు పాపని అంటూ ట్రేలో పడుకోపెట్టిన బిడ్డని చూపింది. అమాయకంగా ముద్దుగా వున్న బిడ్డని చూడగానే శారద తను పడ్డ కష్టమంతా మర్చిపోయి ఆప్యాయంగ బిడ్డని తడిమింది,వార్డులో బెడ్డు మీదకి తీసుకురాగానే”ఆనవాయితీ తప్పలేదమ్మా నా లాగే నీకూ ఆడపిల్లే పుట్టింది.”అమ్మ మాటలు కఠోరంగా చెవులో పడ్డాయి.ఆస్వరంలొ వున్న తృణీకారం మనసులోముల్లు గుచ్చినట్లయింది.
మధ్యతరగతి కుటుంబంలో నాలుగో ఆడపిల్లగ  జన్మించిన శారద ఆడపుట్టుకలొ అనుభవించవలసిన చిన్నచూపు తృణీకార భావం అంతా బాల్యం నుంచే చవి చూసింది. పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి ఒక దృఢాభిప్రాయానికి వచ్చింది ఎలాగైనా సరే ఆడపిల్ల యేవిషయంలోను తీసిపోదన్న విషయం నిరూపించాలని, మనసుకి తగిలిన ప్రతి గాయపు చేదుని ఒక్కొక్క సవాల్ గాతీసుకుంది.పొడుపు మాటల్ని పోగు చేసి పట్టుదలగా మలచుకొంది.దాని ఫలస్వరూపమే పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ప్రధమస్థానం లభించింది.

ఆరోజున కూడా తల్లి మూతి విరిచింది, మగమహారాజుకి చదువబ్బితే కుటుంబాన్ని పోషిస్తాడు ఆడపిల్ల చదివి యెవర్ని వుధ్దరించాలి? అంటూ దీర్ఘాతీసింది.వెనుకంజ అన్న పదం శారద నిఘంటువు లోంచి తొలగించివేసింది. ఇంటరులో స్కాలర్ షిప్పు దొరికింది, చదువుకోసం ప్రత్యేకించి ఖర్చులేదు చదువు మాన్పించితే  పెళ్ళి చెయ్యాలి శారద ముగ్గురి అక్కలలో యిద్దరి పెళ్ళిళ్ళయ్యాయి. మూడో అమ్మాయి పెళ్ళి ప్రయత్నాలుజోరుగా అవుతున్నాయి. ఈ పరిస్థితిలో శారద గురించి పట్టించుకునే వాళ్ళులేరు.ఇంటరు,బి ఎ పూర్తి చేసి బేంకు పరీక్షలు యిచ్చి సెలెక్టు అయింది.ఇంటిలో వాళ్ళు శారద గురించి ఆలోచించే లోపున ఆమె బేంకు వుద్యోగి అయింది.
శారద తమ్ముడు మోహన్ తల్లి తండ్రులకు ముద్దు బిడ్డడు. కోరాలేగాని కొండమీది కోతినైనా తెచ్చికొడుకు ముందుంచేవారు, అంతంత మాత్రం చదువు సాగింది. గ్రాడ్యుయేషన్ దాకా వచ్చి బండి ముందుకి సాగదని చదువు మానేసాడు గారాల కుమారుడు. అన్నీ సమయానికి అమర్చుతూంటే అది లేదు యిది లేదు అంటూ తల్లిమీద అక్క మీద కేకలువెయ్యడం తప్ప ప్రత్యేకమైన పనిలేదు.

ఒక రోజు పనిమీద వెళ్తున్నతండ్రి సైకిలు జీపుతో గుద్దుకుని కాలు విరిగి హాస్పిటల్ పాలయ్యాడు.ఆరోజున అన్నింటికీ అండగా నిల్చింది శారద.కాలు నయమై యింటికి వచ్చినా ఆరు నెలలు విశ్రాంతి అవసరం అని డాక్టరు చెప్పడంతో యింట్లోనే కర్ర సహాయంతో తిరుగు తున్న తండ్రికి శారదలొ వొక ప్రత్యేకత కనుపించింది.
తల్లి మాత్రం ఆడపిల్లకెందుకు వుద్యోగాలు పెళ్ళి చేసి వొక అయ్య చేతిలో పెట్టడమేగా అంటూ రోజూ దీర్ఘాలు తీసేదిగాని యీమధ్యకాలం అంతా ఆ అడపిల్లే సంసారాన్ని సజావుగా నడిచేటట్ట్లు చేసిందని వొప్పుకుందికి మనసొప్పలేదు. తమ్ముణ్ణి దారిన పెడదామని శత విధాల ప్రయత్నించి విఫలమైంది. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిద్దామనుకుంది చిన్న చిన్న వ్యాపారాలు చెయ్యడానికి మోహన్ యిష్టపడలేదు.చేసేదిలేక తన వుద్యోగం మీద శ్రధ్ద పెట్టి వొకతపస్సులా ఏడు సంత్సరాలు గడిపింది బేంకు పరీక్షలన్నీ పాసై ఆఫీసరుగా ప్రమోషను పొందగలిగింది. ఆరోజున తల్లి తండ్రులు ఆమె వున్నతిని పరిపూర్ణ హృదయంతో ఆమోదించలేక కించపరిచే ధైర్యం లేక నిర్లిప్తత ప్రదర్శించారు. శారద కొత్తగా బాధ పడనూలేదు ప్రోత్సాహం ఆశించనూలెదు.

తన జీవితంలో కూడా వసంతం వస్తుందని వూహించని శారద తన తోటి వుద్యోగి తనను పెండ్లి చేసుకునే వుద్దేశంవ్యక్త పరుస్తే ముందు ఆశ్చర్యపోయింది వచ్చిన అవకాశం జారవిడువడం అవివేకమనుకుంది.తను వున్న పరిస్తితిలో పెండ్లి చేసుకుని వొక్కసారిగా బయట పడితే తల్లి తండ్రులు నిస్సహయులవుతారని తనను కోరుకున్న శేఖరుకి రెండు షరతులు పెట్టింది ఒకటి తన తల్లి తండ్రుల పోషణకు అభ్యంతరం వుండకూడదు. రెండవది తనకి ఆడపిల్ల పుడితే హీనదృష్టితో చూడకూడదు. రెండు షరతులు బేషరతుగా వొప్పుకున్నాడు .తనకి అమ్మాయే కావాలంటూ మనస్ఫూర్తిగా శారద చేయినందుకున్నాడు.
అంతా నిర్ణయించుకున్నాక తల్లితండ్రులకు తెలియజెప్పింది. తమకున్న ఒక్క బాధ్యత తీరుతున్నందుకు సంతోషించారు. తరువాత తమగతేమిటని వ్యాకుల పడ్డారు. తన తరఫున యెవరూ లేకపోవటంతో శేఖరు వాళ్లతోనే వుంటూ శారద తల్లితండ్రులను తన వారిగానె భావించి గౌరవించడంతో వారి మనసు తేలిక పడింది. శారదకి పెండ్లి అయినట్లు పరాయి అయినట్లుగాఅనిపించలేదు.
అప్పుడప్పుడు తన గురించి యితరులతో మా శారద యిలాగ అలాగ అంటూ చెప్పినప్పుడు రవ్వంతాప్యాయత తల్లి స్వరంలొ విన్నప్పుడు మాత్రం శారద కొద్దిగా చలించేది. పెండ్లయిన యేడాదికి శారద గర్భవతి అయింది. బిడ్డ పుట్టేవరకు కాలం చాలా ఆహ్లాదకరంగానే గడిచింది శారదని కాలు కింద పెట్టనివ్వకుండా కావలసినవి చేసి పెట్టి తల్లి చాలా అపురూపంగా చూసేది
మర్నాడు ప్రసవిస్తుందనగా ముందు రోజు శేఖరుతో అంది శారద “అందరూ నన్నింత బాగా చూసుకుంటున్నారు. నాకుగాని పాప పుడితే పాపని యింత అపురూపంగానూ చూసుకుంటారా?”” నీ కెందుకాసందేహం నాకు ఆడపిల్లే కావాలి సరేనా నిశ్చింతగా నిద్రపో.”అంటూ ముంగురులు సవరించాడు శేఖర్.

ఈ సంభాషణ జరిగిన యిరవై నాల్గు గంటల్లో శారదకి ఆడపిల్ల పుట్టింది.తల్లి తన అలవాటులో వున్న డైలాగులు అంటూవుంటే శారద మనసు మెలి పెట్టినట్ట్లయింది. ఎప్పటికి వీళ్ళలో మార్పు కలిగేది నిస్పృహగా నిట్టూర్చింది. నర్సు పాపని తెచ్చిపక్కలో పరుండ పెట్టింది అపురూపంగా రెండు చేతులతో చుట్టిహ్రృదయానికి హత్తుకుంది శారద యీజన్మకీ వరం చాలు అన్నట్ట్లుగా. ఇంతలో జిగ్గుమన్న వెలుగుతో వులిక్కి పడింది.ఎదురుగా శేఖర్ పసిబిడ్డకీ తనకీ కలిపి ఫొటో తీసాడు.ఏమిటీ పని అంటే నాకు ముందే తెలుసు పాపంటె నీకు చాల యిష్టం మోదటిసారిగా మాతృప్రేమని చవి చూస్తున్న మన పాపని, నీకళ్ళలో తొణికిసలాడుతున్న మమకారాన్ని ఫొటోలో బంధించి యీ అపురూపమైన దృశ్యాన్ని మళ్ళీమళ్ళీ చూసుకోవాలని యీ పని చేసాను.ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పిల్లల్ల్ని కంటామంటే ప్రభుత్త్వం వొప్పుకోదు కదా!

వాతావరణంలో యెంతటి వుల్లాసం .పై మాటలు విన్నాక ప్రపంచాన్ని జయించినట్లనిపించింది శారదకి.నాలుగోనాడు యింటికి తీసుకు వెళ్ళారు తల్లినీ బిడ్డనీ. బాలసారె జరిపించి బేంకువుద్యోగుల్ని పిలుద్దామంటే తల్లి గొణిగింది మగ పిల్లాడైతే యివన్నీ చెయ్యొచ్చుగాని ఆడపిల్లకీ ఆడంబరాలెందుకే అంది.”అమ్మా!యీ క్షణంనుంచి ఆమాట మర్చిపో యీ బిడ్డ నా జీవన జ్యోతి. ఏ ఆడపిల్ల గురించి న్యూనత చూపించకు”. గట్టిగానే మందలించటంతో తల్లి మౌనం వహించింది “బంగారూ నీకేం పేరు పెట్టాలమ్మ” అంది మురిపెంగా ప్రక్కనే కూర్చున్న శేఖర్ యిప్పుడే అన్నావుగా నా జీవన జ్యోతి అని జ్యోతి పేరే పెట్టు.
బిడ్డని ప్రేమగా హృదయానికి హత్తుకుంటూ టి వి వైపు చూస్తే అందులో కేర్ ఫర్ ద గర్ల్ చైల్డ్ అంటూ వచ్చింది. అది చూసి మనసారా నవ్వుకున్నారు.

అపరిచిత అనుబంధం

శ్రీధర్ హౌస్ సర్జన్ కొర్సు పూర్తయి పోస్టిన్గ్ ఆర్డర్స్ వచ్చాయి. వూరి పేరు చూడగానే తన చిన్నప్పటి ఙాపకాలు పుస్తకంలోని పుటల్లా తెరుచుకున్నాయి. ఆవూరు రామాపురం, సముద్రతీరమున్న చిన్నపల్లె. తండ్రి వుద్యోగరీత్యా బదిలీ మీద ఆవూరు వెళ్లేసరికి తనకి ఆరేళ్లు. తాము వుండే యిల్లు సముద్రతీరానికి నడక దూరంలో వుండేది. పచ్చని చెట్లు చల్లని గాలి ఎంతో బాగుండేది. పట్టణం లక్షణాలు తక్కువ బస్సు సౌకర్యమయితే వుండేది, తన తోటి పిల్లలంతా తోటలో ఆడుకునేవారు.

దగ్గరలో ఒక ఆంగ్లవనిత యిల్లు వుంటూండేది. ఆమె యిల్లు చిన్నగా వున్నా చుట్టూ ఆవరణ చాలాపెద్దది అందులో పళ్లచెట్లు వుండేవి కోళ్లు బాతులు పెంచేది. ఆవే ఆమె  జీవనోపాధి . కావలిసిన వారికి పళ్లు కరివేపాకు గుడ్లు అమ్ముతుండేది. పిల్లలు గేటు దగ్గరకొచ్చినా కాంపౌండు పైనుంచి తొంగి చూసినా కర్ర పట్టుకుని వెంటపెట్టేది. ఆమె పేరేమిటో ఎవరికీ తెలియదు గాని డూడాబాయి డూడాబాయి అంటూ పిల్లలు వెక్కిరించి పారిపోయేవారు.

ఒకనాడు మా పిల్లల దండంతా ఆమె యింటి వయిపువెళ్లాం. గేటు తెరిచివుంది డూడాబాయి ఎక్కడా కనిపించలేదు. చెట్టు నిండా సపోటాపళ్లు నోరూరిస్తుంటే అందరం తలోపండు కోసుకునేలోపున డూడాబాయి రానే వచ్చింది. ఏయ్ పిల్లలూ ఏం చేస్తున్నారక్కడ పొండి పొండి అంటూ కేకలు పెడుతూ చేతిలో కర్రతో మావెంట పడింది. అందరం కాలికి బుధ్ది చెప్పాం. అమె కర్ర విసరటంతో చివర్లోనున్న నాకాలికి తగిలింది. ఏడుస్తూ యింటికి పోయాను జరిగినదంతా వెక్కిళ్లు పెడుతూ అమ్మకి చెప్పాను. కర్ర తగిలిన చోట కాలు ఎర్రగా కందిపోయి తట్టు కనిపిస్తోంది. అమ్మకి చాలా కోపం వచ్చింది. ఆవూరు వచ్చి నాలుగు నెలలే అయినా వాళ్ల వల్ల వీళ్లవల్ల డూడాబాయి గురించి విని వుందేమో ఆమె ప్రవర్తన చికాకనిపించింది.పిల్లలు పళ్లకోసం వెళితే కర్రతో కొట్టడం ఏమిటి? ఒక్క మనిషి ఏం చేసుకుంటుంది అవన్నీ? నయం కాలు విరగలేదు.

సంగతేమిటో కనుక్కుందామని శ్రీధర్ చెయ్యి పట్టుకుని డూడాబాయి యింటికి వెళ్లింది. గేటు మీద చెయ్యి వేశాక కాస్త జంకుగా అనిపించింది. ఆమె యిల్లు,ఆమె పళ్లతోట పిల్లలు దూరి పాడు చేస్తే కసురుకోవడం న్యాయమే! తల్లి మనసు ఆపుకోలేక కొడుకు వకాల్తా కోసం పరుగెత్తుకొచ్చింది తను ఎటూ తేల్చుకునేలొపున ఆలస్యమైపోయింది. గేటు తెరిచిన చప్పుడుకి డూడాబాయి బయటికి వచ్చింది. ఏం మాట్లాడాలో అర్ధంకాక “మేడమ్ మా అబ్బాయి కాలుకి మీరు విసిరిన  కర్ర  తగిలింది  చెప్పడానికి  వచ్చాను” నీళ్లు నములుతున్నట్లే అన్నాను.” కమ్ యిన్సైడ్ మై చైల్డ్ కమ్! కమ్! రామ్మా” స్వరంలో ఎంతో మృదుత్వం. పిల్లల్ని అదిలించే స్వరం లేదు. లోపలికెళ్ళాను ” నాపేరు సుమతి మేము యీ వూరు బదిలీ మీద వచ్చి నాలుగు నెలలైంది. సారీ పిల్లలిదీ తప్పే మిమ్మల్ని విసిగిస్తుంటారు ,” అంటూ తలెత్తిన సుమతి ఆమె చర్యకి నిశ్చేష్టురాలయింది. ఆంగ్లవనిత కింద కూర్చుని శ్రీధర్ కాలు చేతిలో తీసుకుని కందిపోయిన భాగాన్ని చేతితో నిమురుతూ” అయామ్ వెరీ వెరీ సారీ మై చైల్డ్ రియల్లీ వెరీ సారీ “అంటూ కంట నీరు పెట్టుకుంది.

“అయ్యో అలా అనకండి నేను కంప్లైంటు  చెయ్యడానికి రాలేదు. మావారు వూరెళ్లారు వీడు ఏడుస్తూ రాగానే వేరే ఆలోచన లేకుండా మీ దగ్గరకు పరుగెత్తుకొచ్చాను. నేనే మీకు క్షమాపణ చెప్పాలి.” ” లేదమ్మా కంప్లైంటని నేననుకోవటం లేదు. ఏదో విధంగా నా యింటిలోపలికి వచ్చిన వ్యక్తివి అందరూ నా గురించి ఏమేమో అనుకుంటూ వుంటారు. నా గురించి సింపుల్ గా చెప్పాలంటే, నేను నా భర్త యీ వూరు వచ్చేసరికి నాకు యిరవై ఏళ్లు. నేను నా భర్త పీటర్ ఆఫీస్ వర్క్ అయాక బీచిలో గంటలతరబడి గడిపేవాళ్లం.

మావారికి పిల్లలంటే చాలా యిష్టం.నేను గర్భవతినని తెలిసిన రోజు పీటర్ సంతోషానికి హద్దులు లేవు.ఆరోనెల నడుస్తుండగా మెడిసిన్స్ తేవటానికి సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా జీపు ఆక్సిడెంటయి చనిపోయాడు. నా లైఫ్ లో దురదృష్టకరమైన రోజు. ప్రతి రోజు నాతో అనేవాడు మన యింటి చుట్టూ యింత ప్లేసు వుంది పళ్లచెట్లు వేస్తే పదిమంది పిల్లలు వాటికోసం వస్తారు. వాళ్లే మన బిడ్డకి ఫ్రెండ్స్ అవుతారు అని. అతని కోరిక మీద యీ పళ్ల చెట్ట్లు నాటించాను. మరి మీ బిడ్డ? అది మరొక బేడ్ లక్ పీటర్ పోయిన వార్తతెలిసి తెలివి తప్పి పడిపోయిన నేను మూడు రోజుల తరువాత హాస్పిటల్లో కళ్లు తెరిచాను. డాక్టర్లు నెమ్మదిగా చెప్పారు తెలివి తప్పి పడటంలో అబార్షన్ అయిందని. జీవించడానికి ఆశ ఏమాత్రం మిగల్లేదు.

నాపేరెంట్స్ వచ్చి యింగ్లాండు వచ్చేయమన్నారు. నేనిష్టపడలేదు. నా పీటర్ నామీద పెట్టిన బాధ్యత నెరవేర్చడానికి యిక్కడేవుండడానికి నిర్నయించుకున్నాను. యింత జరిగినా పిల్లలని నేను కసురుతానని మీఅందరికీ నామీద దురభిప్రాయం కాని ఏమాత్రం రెసిస్ట్ చెయ్యకపోతే వాళ్లకి మళ్లీ రావటానికి క్రేజ్ వుండదు. వాళ్లనలా అదిలించగానే వెంటనే వస్తారు. ఈ రోజు అనుకోకుండా చేతిలో కర్ర జారి మీ బాబుకి తగిలింది. సారీ అమ్మా సారీ శ్రీధర్!” యింట్లోకి  వెళ్లి ప్లేటులో సపోటా పళ్లు కోసి పెట్టి తీసుకోండి అంది. అయ్యో ఎందుకు మేడమ్ శ్రమ.ఫరవాలేదమ్మా తీసుకోండి అంది.  మొహమాటంగా సపోటా ముక్క తింటూ” నాకో సందేహం మేడమ్ మిమ్మల్నందరూ డూడాబాయి అంటారు మరి మీపేరు?”

“నా పేరు మేరీడొనాల్డ్ పీటర్ నన్ను డోడా అంటూ పిలిచేవాడు. అది విన్న యిక్కడివాళ్లు డూడాబాయి అంటూ పిలవడం పిల్లలకి పెద్దలకి అలవాటయింది ఇన్ని సంత్సరాలు గడిచాక నా అసలు పేరేమిటో నేనే మర్చిపోయాను అంది.” నేను శ్రీధర్ తన యింటికి వెళ్లడంతో  సంతోషం ఆమె కళ్లలొ ప్రతిఫలించింది. ఇక వెళ్తాం అని లేవడంతొ అప్పుడప్పుడు రామ్మా నా కాంపౌండు గోడవరకు వచ్చే వాళ్లేగాని గేటు లోపలికి ప్రవేసించిన వ్యక్తివి నువ్వే. 
తప్పకుండా మేడమ్ శ్రీధర్ని కూడా తీసుకుని వస్తాను అంటూ బయలుదేరింది.

ఇచ్చిన మాట ప్రకారం ఆవూళ్లో వున్న నాలుగు సంత్సరాలు అప్పుడప్పుడు డూడాబాయి యింటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు కనుక్కుంటూ వుండేది సుమతి. ఒకసారి భర్తని తీసుకువెళ్లి పరిచయం చేసింది. “మావారు మేడమ్ పేరు సత్యమూర్తి. వెరీ గ్లాడ్ టు మీట్ యు.” అంటూ ఆదరంగా కూర్చోపెట్టింది. యోగక్షేమాలు అడుగుతూ” మీ మిసెస్ కలిసినప్పటినుండి నాకు చాలా క్లోజ్ అయింది. నా జీవితంలో మళ్లీ బంధుత్వాలు ఏర్పడ్డట్ట్లయింది. నాకు కూతురులా అనిపించింది బిడ్డలు లేని లోటు తీరింది సుమతి శ్రీధర్ల పరిచయంతో.”

“మీ అభిమానం మేడమ్ థేంక్స్!” మొహమాటంగా జవాబిచ్చాడు సత్యమూర్తి. “ఇంక నేనెన్నాళ్లు జీవిస్తానో తెలియదు,నా యిల్లు తోట అంతా ఒక హాస్పిటల్ గా మార్చటానికి డొనేట్ చేద్దామనుకుంటున్నాను. వాటికి తగిన ఏర్పాట్ట్లు చెయ్యగలరా? ఈ వూర్లో ఒక్క మీ ఫేమిలీతోనే యింత చనువు ఏర్పడింది,” అభ్యర్ధించింది మావారు సివిల్ యింజినీరు పదిహేను రోజులు తిరిగి కాగితాలు సిధ్దంచేశారు. ఆమె తదనంతరం ఆయింటిని హాస్పిటల్ గా మార్చడానికి అగ్రిమెంటయింది. ఆవూర్లో వున్న నాలుగేళ్లు నాలుగు నెలలుగా గడిచిపోయాయి. మేము మరో వూరు వెళ్తున్నామని చెప్పటానికి వెళ్తే ఆమె శ్రీధర్ నుదుటిని ముద్దాడి “పెద్దయాక పెద్ద డాక్టరువై నా హస్పిటల్లొ సేవచెయ్యి బాబూ! మే గాడ్ బ్లెస్స్ యూ!” అంటూ మనసారా ఆశీర్వదించింది. ఏనాటి అనుబంధమో వూరు వదిలి వెళ్లటానికి గుండె బరువై కళ్లనీళ్లు వుబికాయి.

పధ్దెనిమిది సంత్సరాలు గడిచాక మళ్లీ ఆవూరి పేరు వినగానే గత ఙాపకాలన్నీ మనసులొ మెదిలాయి. ఆ వూరు చేరి   హాస్పిటల్లొ అడుగుపెట్టిన శ్రీధర్ గోడమీద మేరీ డొనాల్డ్ ఫొటో పెద్దది చందనం మాల  వేసి వుంది. ఫోటో చూడగానే కమాన్ మై చైల్డ్! అంటూ నవ్వుతూ ఆహ్వానించిన అనుభూతి పొందాడు శ్రీధర్. ఈ అపరిచిత అనుబంధానికి శిరసు వంచి నమస్కరించాడు.