Tag Archives: story

పేరులో ఏముంది?

పద్మనాభంగారింటి పక్కవాటాకి ‘టు లెట్’బొర్దు పెట్టిన నాలుగు రోజులకి యిల్లు చూడటానికి కుటుంబరావు వచ్చాడు.పద్మనాభం యిల్లు చూపిస్తూ,”మా అబ్బాయిలిద్దరూ పెద్ద చదువులకి వచ్చాక వాళ్ళకోసం ఈ రెండు గదులు కట్టించాను.వుద్యోగాలకై ఒకడు అమెరికా మరొకడు అస్సాం వెళ్ళారు.ఆర్నెల్ల క్రితం ఒక గదిని వంటిల్లుగా మార్చి చిన్న వాటా చేశాను.చిన్న కుటుంబానికి పనికివస్తుందని.”క్లుప్తంగా చెప్పారు.
“యిల్లు బాగుంది,అన్నట్లు నా పేరు కుటుంబరావే గాని నాకు కుటుంబం లేదు.ఒంటరివాడిని.ఎ జి ఆఫీసులో అకౌంటెంటుగా పని చేస్తున్నాను.నాలుగు నెలల క్రిందట ట్రాన్స్ఫరు మీద యీ వూరు వచ్చాను.యిన్నాళ్ళు ఒక స్నేహితునితో కలిసి వున్నాను.నేను స్వయంగా వంట చేసుకుంటాను.నా కంటూ ఒక వాటా వుంటే బాగుంటుందని వచ్చినప్పటినుంచి వెతుకుతున్నాను.”

“పెళ్ళి కాలేదా? బ్రహ్మచారులకి అద్దెకిస్తే యిబ్బందికరంగా వుంటుందని ఆలోచిస్తున్నాను.యింతవరకు ఎవరికీ యిల్లు అద్దెకి యివ్వలేదు.” నసిగారు పద్మనాభంగారు.
“నాకింకా పెళ్ళికాలేదు.బ్రహ్మచారినని మీరు శంకించే పనిలేదు.నాకెటువంటి దురలవాట్లు లేవు.స్నేహితులు, తిరుగుళ్ళు నాకలవాటులేదు.వుదయం వంట చేసికుని అన్నం తిని పదింటికి ఆఫీసుకెళితే అయిదున్నరకి యిల్లు చేరుకుంటాను.రాత్రి కొసం వండుకోవడం తొందరగా భోజనం చేసి ఏదైనా పుస్తకం చదువుకుని నిద్రపోవడం. నావల్ల మీకెటువంటి యిబ్బంది కలుగదు.మీకంగీకారమై అద్దె ఎంతో చెపితే వచ్చే వారం సామాన్లతో వస్తాను.”
“ఒక సారి నా భార్యతో కూడా సంప్రతించి చెపుతాను.మా యింట్లో కాసేపు కూర్చోండి,”అంటూ ఆహ్వానించారు.
‘సరే’నంటూ వాళ్ళ వాటాలోకి వెళ్ళాడు కుటుంబరావు.పద్మనాభం గారిని అన్నపూర్ణమ్మని చూస్తే ఎంతో గౌరవభావం కలిగింది.అద్దె నాలుగు వేలు రెండు నెలల అద్దె అద్వాన్సు చెప్పేరు.రెండో మాట లేకుండా పన్నెండు వేలు చేతిలో పెట్టాడు.చూడటానికి మర్యాదస్తుడిలా వున్నాడు,యిల్లు ఖాళీగా వుండేకన్నా ఎవరో ఒకరుంటారని సంతృప్తి పడ్డారు.

మరుచటివారం సామాన్లతో వచ్చాడు కుటుంబరావు.చిన్న సంసారానికి తగిన అన్ని హంగులు వున్నాయి.శనివారం వచ్చి ఆదివారం సాయంత్రానికి అన్నీ అమరికగా సర్దుకుని,సోమవారం పదయేసరికి ఠంచనుగా ఆఫీసుకు స్కూటరు మీద బయలు దేరాడు.అన్నపూర్ణమ్మగారి పని మనిషిని వుదయాన్నే యిల్లు శుభ్రం చేసి గిన్నెలు తోమటానికి కుదుర్చుకున్నాడు.నెల రోజులు అతని దినచర్య చూసిన పద్మనాభందంపతులకి ముచ్చటవేసింది.రోజూ రాత్రి ఎనిమిదిన్నర అయేసరికి భోజనం చేసి వీధి వరనండాలో కుర్చీ వేసుకుని ఒక అరగంట కూర్చునేవాడు.అదే సమయానికి పద్మనాభంగారు కూడా బయట కూర్చునేవారు.వరండా కామన్ అవటంతో ఆ అరగంటా కుశల ప్రశ్నలు పిచ్చాపాటీ నడుస్తుండేది.
పద్మనాభంగారు కూడా ఎ జి ఆఫీసులో సూపరెంటెండెంటుగాచేసి రిటైరు అయ్యారు. ఆ కారణాన కుటుంబరావుని అభిమానంగా చూసేవారు.

ఏ సమయంలో కుటుంబరావు వుంటున్న వాటాలోకెళ్ళినా యిల్లు అద్దంలా వుండేది.యిల్లాలు వున్న యింట్లో కూడా అంత తీరుగా వుండదేమో అనిపించేది.వంటింట్లో గిన్నెలూ డబ్బాలు సర్దుకున్న తీరు చూసి అన్నపూర్ణమ్మగారు “బాబూ నీ యిల్లు చూడముచ్చటగా వుంది. బ్రహ్మచారులకు కూడా యిల్లు యివ్వ వచ్చని నిస్సందేహంగా చెప్పొచ్చు.నిన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు.”
“అలా అనకండి పిన్నిగారూ!నా తలిదండ్రులు ధన్యులేమో గాని నేను ధన్యుడినిగాను.నా చిన్నప్పుడే అమ్మా నాన్నాపోతే తాతగారూ నాయనమ్మా నన్ను పెంచారు.మా నాయనమ్మకి ప్రతి పనిలో సహాయపడేవాడిని.వాళ్ళిద్దరూ కాలం చేసి అయిదేళ్ళవుతోంది.

“అయ్యో అలాగా మరి మీ స్వగ్రామం?”
“వేములవాడలో మా తాతగారి యిల్లు కొంత ఆస్తి వున్నాయి ఎప్పుడైనా చూసి వస్తుంటాను.”
ఆర్నెలలు గడిచాయి,కుటుంబరావుని కొడుకులా చూసుకునేవారు.అతను కూడా యింటి యజమానులలా కాకుండా పెద్దలనే గౌరవాభిమానాలతో మసలుకునేవాడు.

ఒక రోజు రాత్రి అన్నపూర్ణమ్మ బెడ్రూములో వాళ్ళింటిని కలిపే తలుపుని గట్టిగా తడుతూ “బాబూ కుటుంబరావ్ ఒక్కసారి లేస్తావా?”కాస్త గట్టిగానే పిలుస్తున్నాది.వెంటనే లేచి వెళ్ళాడు.
“మీ బాబయ్యగారు బాత్రూముకని లేచి మంచినీళ్ళు అడిగితే యిచ్చాను.గ్లాసు పట్టుకోలేదు.అడ్డంగా మంచం మీద పడిపోయారు.మన స్పృహలేదు పిలిస్తే పలకటం లేదు.”
ముఖం మీద నీళ్ళు జల్లి తువ్వాలుతో తుడిచాడు.”మీరేం కంగారు పడకండి,ఆటో తెస్తాను హాస్పిటల్ కి తీసుకెళ్దాం.”క్షణం ఆలస్యం చేయకుండా స్కూటరు తీసి ఆటో తెచ్చాడు.
ఆటో డ్రైవరు సాయంతో పద్మనాభంగారిని ఆటోలో కూర్చో పెట్టి అన్నపూర్ణమ్మగారిని పట్టుకు కూర్చోమని, స్కూటరుతో ఫాలో అయాడు.అన్ని పరీక్షలు చేసి బి పి లో అయిందని మందువేసి డ్రిప్సు పెట్టారు. నాలుగు రోజులు హాస్పిటల్లో వుంచి పరీక్షిస్తామన్నారు దాక్టర్లు.
“కంగారు పడకండి పిన్నిగారూ అంతా సర్దుకుంటుంది.బాబయ్యగారికేమీ కాలేదు.మీ అబ్బాయికి ఫోను చెయ్యమన్నారా?”
“ఫోను చేసి హాడావిడి పెట్టొద్దు బాబూ,కోడలు వుద్యోగం పిల్లల చదువులు.అవకాశం చూసుకుని వచ్చి చూడమని చెపుతాను.యిక్కడికి పది కిలో మీటర్ల దూరంలో వున్న పల్లెటూర్లో మా ఆడబిడ్డ,వాళ్ళమ్మాయి వున్నారు.వాళ్ళకి ఫోను లేదు.మనిషి వెళ్ళి తీసుకొస్తే వెంటనే వస్తారు.”

“అడ్రసు యివ్వండి నేను వుదయాన్నే వెళ్ళి తీసుకువస్తాను.”
“మా ఆడబిడ్డకి వుత్తరం వ్రాస్తాను,నువ్వెవరో ఆమెకి తెలియదుకదా. వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు.”
వుదయం టాక్సీ తీసుకెళ్ళి వుత్తరం చూపించి పద్మనాభంగారి చెల్లెలిని మేనకోడలిని హాస్పిటల్ కి తీసుకొచ్చాడు కుటుంబరావు.వాళ్ళిద్దరినీ చూడగానే అన్నపూర్ణమ్మకి కొండంత ధైర్యం వచ్చింది. పద్మనాభంగారి ఒంట్లో కూడా కాస్త నెమ్మదించింది.కుటుంబరావు సహాయానికి పదే పదే ధన్యవాదాలు చెప్పారు భార్యా భర్తలిరువురూ.
“మీరేమీ వర్రీ అవకండి బ్బాబయ్యగారూ, ఏ సహాయం కావాలన్నా మీ అబ్బాయికి చెప్పినంత చనువుగా చెప్పండి. ఈ రోజు ఆఫీసుకి శలవు పెడతాను.”ఈ మాటలు విన్న అన్నపూర్ణమ్మకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
పద్మనాంభంగారి చెల్లెలు సుభద్రమ్మ ఆశ్చర్యపోయింది. యింట్లో అద్దెకున్న అబ్బాయి యింటి మనిషిలా సాయం చేస్తూంటే,”ఏ అమ్మ కన్న బిడ్డో గాని ఈ కాలంలో యిటువంటి వాళ్ళుండటం అరుదు” అంది వదినతో.

“వదినా నువ్వు అన్నయ్య దగ్గరుండు నేను,రాజీ యింటికెళ్ళి వంటచేసి మీ యిద్దరికీ భోజనం తెస్తాము.”
“పిన్నిగారూ మీరూ యింటికెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవండి. మీరు భోజనం చేసి వచ్చేవరకు నేను బాబాయిగారి వద్ద వుంటాను.’
“నీకింకా శ్రమ నాయనా.రాత్రినుండి ఒక్క క్షణం విశ్రాంతి లేదు.”
“మీరు పెద్దవారు మీరు రెస్టు తీసుకోండి నాకేమీ శ్రమలేదు.”
యింటికెళ్ళిన వదినా ఆడబిడ్డలిద్దరూ పద్మనాభంగారి అనారోగ్యం కన్నా కుటుంబరావు మంచితనాన్నే గుర్తు చేసుకున్నారు.
నాలుగోనాడు డిశ్చార్జి అయి యింటికొచ్చారు పద్మనాభంగారు.మందులు వాడుతూ రెస్టు తీసుకోమన్నారు డాక్టరు. ఆ రోజే పెద్దకొడుకు ఫ్లైటులో వచ్చి ఒకరోజుండి వెళ్ళాడు శలవు లేదంటూ.

సుభద్రమ్మ తనూ వెళ్తానంది.”అయ్యో అప్పుడేనా నాలుగు రోజులుండు తొందరేముంది?” నిలదీసింది ఆడబిడ్డని.
“యింటి దగ్గరున్న ఖాళీ స్థలంలో మనిషిని పెట్టి కూరలు పండించుతున్నాను.మాకు కావలిసినవి అట్టే పెట్టుకుని మిగిలినవి మార్కెత్లో అమ్మించి వచ్చిన డబ్బులు నేనుసగం పనివాడు సగం తీసుకుంటాం.నేను లేకుంటే పనులు సజావుగా సాగవు కావాలంటే మళ్ళీ వస్తాను”
“సరే నువ్వంత చెప్పాక కాదనడమెలా? పోనీ రాజేశ్వరిని ఒక నెలరోజులు నాకు సహాయంగా వుంచు.”సరేనని సుభద్రమ్మ ఒక్కతే వూరికి వెళ్ళింది.
పద్మనాభంగారు హాస్పిటలు నించి యింటికొచ్చిన దగ్గరనుండి రోజూ ఆఫీసుకెళ్ళేముందు ఎలా వున్నారో పరామర్శించి,ఏమైనా కావాలా అడిగి వెళ్ళేవాడు కుటుంబరావు.సాయంత్రం వస్తూ పండో కాయో స్వీటొ తెచ్చి చేతిలో పెట్టేవాడు.
‘ఏ నాటి ఋణమో యిలా తీర్చుకుంటున్నావు నాయనా! నీ వద్ద అద్దె వసూలు చెయ్యటానికి జంకుగా వుందయ్యా కుటుంబరావ్.”
“అంత మాటనకండి బాబయ్యగారూ మీతో వుంటే నేను ఒంటరి వాడినన్న విషయం జ్ఞప్తికి రాదు.”

ఆ రోజు అన్నపూర్ణమ్మ భర్తనడిగింది,”మీ చెల్లిని సంప్రతించి కుటుంబరావుకి రాజేశ్వరినిస్తామని అడిగితే బాగుంటుందనుకుంటున్నాను,మీరేమంటారు?మీ బావ పోయాక రాజీకి సంబంధం చూసే బాధ్యత మీమీదే వుందికదా!మూడేళ్ళు తండ్రి జబ్బుతో వున్నాడని పెళ్ళికి సుముఖత చూపలేదు. తండ్రి పోయాక తల్లి ఒంటరిదైపోతుందని ఆగమంది. చూస్తూ చూస్తూ ముఫై రెండేళ్ళు దాటుతున్నాయి. కుటుంబరావు  ముఫై అయిదేళ్ళన్నాడు. యింత మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది?”
ఇటువంటి విషయాల్లో ఆడవాళ్ళ బుర్ర పాదరసంలా పని చేస్తుందనుకున్నాడు.ఆలోచనలో అంకురార్పణ జరగగానే క్రియా రూపానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు పద్మనాభం దంపతులు.

సుభద్రమ్మని అడగగానే తన అంగీకారం తెలిపింది.అద్దెకున్న అబ్బాయితో పెళ్ళి ప్రస్తావన తేవడం యిష్టమేనా అని రాజేశ్వరిని అడిగింది అన్నపూర్ణమ్మ.
“అన్నీ బాగున్నాయిగాని పేరే బాగులేదు.కుటుంబరావు అనగానే గంపెడు పిల్లలు పేదరికంతో క్రుంగిపోతున్న బడుగు వ్యక్తి కళ్ళముందు కనిపిస్తాడు.”వినగానే ఘొల్లున నవ్వింది,”నయం నాతో అన్నావు సరిపోయింది యింకెవరితో అన్నా నవ్విపోతారు.” “యిప్పుడు నువ్వు కూడా నవ్వావు కదా అత్తా!”

ఒక్క సారి ఆ అబ్బాయి యిల్లు చూస్తే ఆ మాటనవు.అతని వుద్దేశమేమిటో కూడా తెలుసుకోవాలి.నీ పెళ్ళయిపోతే మీ అమ్మకి నిశ్చింత.సరిగ్గా చెప్పు అడగమన్నావా? లేదా?”
మీ యిష్టం అత్తా మీ అందరికీ ఏది మంచిదనిపిస్తే అదే చేయండి.”

ఆదివారం నాడు తమ యింటికి భోజనానికి ఆహ్వానించారు కుటుంబరావుని.
“పిన్నిగారిని శ్రమ పెడతారెందుకు? నాకలవాటే కదా వండుకోవడం.”
“మాతోపాటే పట్టెడన్నం పెట్టడానికి శ్రమేమిటయ్యా,మరేమీ అడ్డు చెప్పకు.”పరంధామయ్యగారు నిక్కచ్చిగా చెప్పారు,కాదనలేకపోయాడు.
భోజనానికి వస్తూ పళ్ళు స్వీట్లు తీసుకొచ్చాడు కుటుంబరావు.”యివన్నీ దేనికయ్యా?యిచ్చేది ఈత పండు తీసుకునేది తాటి పండు అన్నట్లుంది.”
“భలే సామెత చెప్పేరుగాని మీ అభిమానాన్ని ఈత పండుతో పోల్చడం భావ్యం కాదు.”
భోజనాల సమయంలో రాజేశ్వరి వడ్డనలో సహాయం చేస్తుంటే గమనించాడు,చామన ఛాయ అయినా చారెడేసి కళ్ళు నల్లగా ఒత్తయిన పొడవాటి జడ నవ్వు ముఖం కళైన పిల్లే అనుకున్నాడు.యిన్ని సార్లు చూసినా ఒక్క మాటైనా మాట్లాడటం వినలేదు అనుకున్నాడు.వెంటనే ఆ కోరికా తీరింది.
“పెరుగు వడ్డించమ్మా.”
“అలాగే మామయ్యా.”వీణమీటినట్లుంది స్వరం మనసులోనే అనుకున్నాడు.ఈ రోజు మనసెటు పోతోంది అనుకుంటూండగానే కంచంలో సగానికి పెరుగు వేసింది రాజేశ్వరి.
“అరెరే! యింత వేసేశారేమిటి నేను చూసుకోలేదు.” ఫక్కున నవ్వి లోపలికెళ్ళిపోయింది.
భోజనాలయాక హాల్లో కూర్చుని లోకాభిరామాయణం మొదలుపెట్టారు.మాటల మధ్య చెల్లెలి కుటుంబ స్థితిగతులు బావ పోవటం తరువాత చెల్లి మేనకోడలు కలిసి ఆస్థిపాస్థులు చక్కబెట్టుకుంటూ పల్లెటూర్లో నెట్టుకు రావటం చెప్పుకొచ్చారు.

“మీ మేనకోడలి చదువు ఆ పల్లెటూర్లో ఎలా సాగింది?”
“పదో క్లాసు వరకు అక్కడి స్కూల్లో పూర్తి చేసింది.ఇంటరు రెండేళ్ళు మా యింట్లో వుండి చదువుకుంది. పైవేటుగా బి ఎ, ఎం ఎ చేసింది చాలా తెలివైన పిల్ల.కుటుంబం కోసం పెళ్ళి వాయిదా వేసుకుంది.తను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే తల్లి ఒంటరిదైపోతుందని చింత.యిలా ఎన్నాళ్ళు చెప్పు? ఈ సంవత్సరం రాజీ పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాం.అమ్మాయిని చూశావు, నీకు ఆమెని చేసుకునే వుద్దేశం వుంటే చెప్పు.తొందరేం లేదు అలోచించుకుని చెప్పు.యిలా డైరెక్టుగా అడిగానని మరోలా అనుకోకు నీకు తండ్రిలాంటి వాడిని.కావాలంటే రాజేశ్వరితో మాట్లాడు.”
యింతలో ఆడవాళ్ళ భోజనాలయి హాల్లోకి వచ్చారు.
“రాజీ వక్క పొడిగాని, ఏలకులుగాని తెచ్చిపెట్టమ్మా.” లోపలికెళ్ళి ఏలకులు తెచ్చింది.ఏలక పండు తీసుకుంటూ రాజీ కళ్ళలోకి చూశాడూ కుటుంబరావు.ఈ ప్రస్తావన ఆమెకి ముందుగానే తెలిసినట్ట్లు అర్ధమయింది.
సాయంత్రం పెరట్లో పువ్వులు కోస్తుండటం గమనించి,రాజీని నిలదీసి అడిగాడు.
“మీ మామయ్యగారు నీ గురించి ప్రపొజ్ చేశారు.నీ వుద్దేశమేమిటో స్వయంగా తెలుసుకుందామని,”అగాడు.
సిగ్గు పడి పారిపోయే చిలిపి వయసు కాదు నిర్మొహమాటంగా చెప్పింది.”మీ గురించి విన్నాక అభ్యంతరం చెప్పడానికేమీ లేదు.మీ పేరొక్కటే నచ్చలేదు.పాత కాలం వాళ్ళలాగ ‘యిదిగో’ ‘మిమ్మల్నే’ అనలేను.మీ పేరుని ఏ విధంగాను పొట్టి చేసి పిలవలేను అదొక్కటే సమస్య.”
పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చినా అతి కష్టం మీద ఆపుకున్నాడు.”ఈ సమస్యకి పరిష్కారం వుంది.వున్న పేరుని ప్రస్తుతం మార్చుకోలేను. మా తాతగారు నన్ను ‘చంటీ’ అని పిలిచేవారు,మా నాయనమ్మ ‘బబ్లూ’ అని పిలిచేది. ఈ రెండింటిలో ఏ పేరుతోనైనా పిలవచ్చు,లేదా కొత్తగా ముద్దు పేరేదైనా పెట్టుకోవచ్చు.ఈ సమస్య సెటిల్ అయనట్లనిపిస్తే పెద్దవాళ్ళకి మన అంగీకారం చెప్పేద్దాం.ఓ కే నా?”అనుకున్నంత బుద్ధావతారం కాడు సరసుడే! అనుకుంది.”సరే ముందు మన అంగీకారం తెలియజేద్దాం,తాపీగా ఏ పేరుతో పిలవాలో ఆలోచిస్తాను.”

సంగతంతా విన్న అన్నపూర్ణమ్మ పద్మనాభంగార్లు ‘ ఓర్నీ! వీళ్ళిద్దరూ అసాధ్యుల్లా వున్నారే’అని నవ్వుకున్నారు.

Advertisements

జోగినాధం మాస్టారు

జోగినాధం మాస్టారికి ‘బెస్ట్ టీచర్ అవార్డ్ దొరకబోతున్నదన్న వార్త నేను కాలేజీలో చేరిన సంవత్సరం తెలిసింది. ఆ! జోగినాధం మాస్టారికి బెస్ట్ టీచర్ అవార్డా? నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు మా క్లాసు టీచర్.

ఆ రోజులు సినీమా రీలులా నా కళ్ళ ముందు మెదిలాయి .వెంటనే అతని రూపం గుర్తుకొచ్చింది.ముతక ఖద్దరు పంచ చొక్కా పై కండువా,కాస్త ఎత్తు పళ్ళు నూని రాసి నున్నగా దువ్విన క్రాఫుకళ్ళజోడు సగం సమయం ముక్కు చివరదాకా జారిపోతూంటుంది. క్లాసులో ప్రవేశించగానే బొంగురు గొంతుతో “యిప్పుడు ఏ పీరియడ్?” అని ప్రశ్నించి క్షణంలో అందరినీ పరికించి చూసేవారు ఎవరు తడబడుతున్నారో కళ్ళజోదులోంచి చూసేవారు.

బోర్డు మీద రాస్తున్నప్పుడు కూడా వెనుకనుంచి మేము ఏం చేస్తున్నామో గమనించేవారు. శిక్షించేటప్పుడు పక్షపాతం లేకుండా అందరికీ ఒకేలా వేసేవారు. అది మాలో కొం దరికి జీర్ణమయ్యేదికాదు.తెలివైన విద్యార్ధులను టీచర్లు కొంత అభిమానంగా చూస్తార, ని పక్షపాతం చూపిస్తారని విన్నాం,గాని మా జోగినాధం మాస్టారి వద్ద అవన్నీ అబధ్ధాలని రుజువైపోయింది.

స్కూలు ఆవరణలో వున్నంతసేపు ఏ క్లాసు కుర్రాడైనా కాగితం ముక్కగాని చెత్త గాని కింద పదేయడం చూస్తే వెంటనే వాడి చెవి పత్తుకుని చెత్త ఏరించి చెత్త కుండీలో వేయించేవారు.’స్కూలమంతా మాస్టారిదేలా ప్రవర్తిస్తారేమిటీ  అనుకునేవాళ్ళం.

ఒక రోజు  టీ చర్స్ కామన్ రూము లోంచి గట్టిగా మాటలు వినిపిస్తూంటే అదీ జోగినాధం మాస్తారి గొంతు వినిపించగానే తొంగి చూశాను ఏమిటా అని.చదివిన పేపరు చక్కగా మడిచి పెట్టలేదని మరో టీచర్ని మందలిస్తుంటే ఆశ్చర్యపోయాను .  పిల్లలమే కాదు టీచర్లు కూడా అతని జులుంకి బలి అయిపోతారని అర్ధమయింది.

జోగినాధం మాస్టారు ఒంటరి మనిషి ,మొదటి  భార్య పోయిన రెండేళ్ళకి మళ్ళీ పెళ్ళి చేసుకున్నారుట.ఆమె ఆర్నెల్లు కూడా బ్రతకలేదుట .అప్పటి నుండి తమ్ముని యింటి పక్కనే చిన్న యిల్లు అద్దెకి తీసుకుని తమ్ముని యింటిలో భోజనం చేస్తూ ఒక్కరే వుండటం అలవాటు చేసుకున్నారు.యితని చండశాసనత్వమ్ పడలేక యిద్దరు భార్యలు యీ లోకం విడిచి పోయారేమోనంటూ  పిల్లలం విమర్శ చేసుకునే వాళ్ళ చాటుగా.

వేసవి వచ్చిందంటే చాలు స్కూల్లో కొత్త కుండలు తెప్పించేవారు. వాటికోసం పిల్లల వద్దనుండే డబ్బులు వసూలు చేసేవారు. వాటిని ప్యూను చేత దగ్గరుండి నింపించి మూతలు పెట్టించేవారు.ఇంటర్వెల్ల్ సమయంలో పిల్లలు నీటిని వౄధా చేయకుండా కుండలు పగలకొట్టకుండా అందరూ నీళ్ళు తాగేలా చూసేవారు.

ఒక రోజు ఒక స్టూడెంట్ చేతిలోంచి గ్లాసు జారిపడి కుండ పగిలి పోయింది. వెంటనే ఆ కుర్రాడి పేరు క్లాసు కనిక్కుని కుండ ఖరీదు చెల్లించమని ఆర్డరు జారీ చేశారు.ఆ పిల్లాడు ఏడుస్తూ తను పేద విద్యార్ధినని, డబ్బులు యిచ్చుకోలేనని గోల పెట్టాడు. వెంటనే ఆ అబ్బాయి క్లాసుకి వెళ్ళి వున్న సంగతి పిల్లలందరికీ చెప్పి అందరూ తలో కాస్త వేసుకుని కుండ కొని యధాస్థానంలో పెట్టమని సలహా యిచ్చారు.పిల్లలందరికీ కోపం వచ్చి,”మేమెందుకు చెల్లించాలి? ఎవరు పగలగొట్టారో వాళ్ళనే చెల్లించమనండి.”అంటూ వ్యతిరేకించారు.”సరే రేపటినుంచి డ్రమ్ములో నీళ్ళు తాగండి.ఈ మాత్రం సహకారం లేకుంటే జీవితంలో చాలా కష్ఠ పడావలసివస్తుంది ఆలోచించుకోండి.”అవి మాటలు కావు శిలా శాసనాలు.

యిలా క్లాసు  టీ చరుగా ఆ సంవత్సరంలో రోజూ తెలిసే విషయాలు యివన్నీ .అయితే స్కూలు చదువు పూర్తయేదాకా ఏదొ ఒక సందర్భలో పిల్లలందరికీ అతనితో భేటీ అవుతూనే వుంటుంది.అన్ని సంవత్సరాలలో అనారోగ్యంతోగాని వూరికి వెళ్ళో శలవు పెట్టడం చూడలేదు.అతన్ని ఎంత విమర్శించుకునీవాళ్ళమో కనిపించకుంటే అంత వెలితిగా భావించేవాళ్ళం.

సంవత్సరం పూర్తయి ఏన్యువల్ పరీక్షల ముందు చాలమంది టీచర్లు స్పెషల్ క్లాసులు పెట్టి కోర్సు పూర్తి చేసేవారు.కాని జోగినాధం మాస్టారు ఫిబ్రవరిమొదటి వారానికి కోర్సు పూరి చేసేసి రివిజన్ మొదలు పెట్టేవారు.మిగతా టీచర్లకి చాలా ఆశ్చర్యం అతను కోర్సు అంత త్వరగా ఎలా పూర్తి చెయ్యగలరా అని.అతని క్లాసులో పిల్లలు కూడా మంచి పర్సెంటుతో   పాసయ్యేవారు. ఒకరో యిద్దరో పరీక్షలో తప్పేవారు.ఒక స్టూడేంటుగా అతనిని పైపైన చూసినప్పుడు కొంత శాతమే అర్ధమవుతారు.

అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో యింటికి వెళ్ళాను.  ఒక్కసారి జోగినాధం మాస్టారిని కలవాలనిపించింది. స్కూలుకి శలవలు ప్రారంభం కాలేదు. స్కూల్లోఅడుగు పెడుతూంటే ఒక అనిర్వచ్నీయమైన ఆనందం కలిగింది.ఇదే స్కూల్లో నా బాల్యం, పెద్ద చదువులకి పునాది ఏర్పడింది దానికై దోహదం కల్పించిన మాస్టాలందరికీ జోహార్లర్పిస్తూ టీచర్స్ రూము ముందు నిలబడ్డాను అనుమతికోసం.

నీడకదలగానే,”ఎవర్రా?”గొంతు జోగినాధం మాస్టారిదే. “నేనే మాస్టారూ సతీష్ ని మీ స్టూడెంటుని,”
“ఓరి! నువ్వా? రా! రా! ఎలా వున్నావ్? ఎక్కడ చదువుతున్నావ్?”యింత ఆప్యాయంగా మాట్లాడటం మాస్టారి స్వభావమే కాదు ఎంతో విచిత్రమనిపించింది. కంగ్రాట్యులేషన్స్ మాస్టారూ! మీకు బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చిందని నా స్నేహితుడు రాశాడు. అది తెలిసి మిమ్మల్ని కలవకుండా వుండలేకపోయాను,” అన్నాను వినయంగా.
“నాకు అవార్డ్ రాకపోతే నన్ను కలియవురా? పోనీలే అలాగైనా నన్ను చూడాలనుకునే వాడు ఒకడున్నాడన్న సంతోషంకలిగింది.అన్నట్లు హెడ్మాస్తర్ గారు నా కోసమని చిన్న సన్మానం లాంటిది చేద్దామని టీచర్లని పిల్లలని కూడపెడుతున్నారు.స్కూల్లో ఏ ఫంక్షనయినా ఏర్పాట్లన్నీ నేనే చూసే వాడిని,కాని యిది నాకు సంబంధించినది కావటంతో నేను కాస్త ఎడంగా వుండాల్సి వస్తోంది.  నువ్వు ఓల్డ్ స్టూడెంటువి నీ సహాయం తీసుకుంటారేమో ఒక్క సారి హెడ్మాస్టర్ గారిని కలుసుకో.” అంటూ పురమాయించారు.
మంచి సమయంలోనే వచ్చాననిపించిది. మే ఐ కమిన్ సార్!” హెడ్మాస్టర్ గారు తల తిప్పి చూసి ఎవర్న్నట్లు నొసలెగరేశారు.
“నా పేరు సతీష్ సార్! లాస్టియర్ బేచ్ స్టూడెంట్ ని.యిప్పుడు ఇంటరు తెనాలిలొ చదువుతున్నాను.జోగినాధం మాస్టారికి అవార్డ్ వచ్చిందని తెలిసి ఆయన్ని అభినందించుదామని వచ్చాను.మిమ్మల్ని కలవమన్నారు.మీరు మాస్టారికి సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారని మీకు సహాయపడమని చెప్పారు.”

“ఓ! రా కూర్చో.” ఫరవాలేదు సార్!యీ ఫంక్షన్ పనుల్లో నేనూ సహాయం చేస్తాను, యీ విధంగా మాస్టారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను.”
మన గోపాలం మాస్టారి వద్ద వివరాలన్నీ వున్నాయి,తెలుసుకుని నీకు చేతనైన సహాయం చెయ్యి. అవసరమైన దబ్బు అతని వద్దే వుంది సంకోచించకుండా తీసుకో.ఈ సందర్భం మన స్కూలుకే గర్వ కారణం.”
“అవును సార్!మరి నేను వస్తాను.”
రెండు రోజుల తరువాత శనివారం సాయంత్రం ఆరు గంటలకి సన్మానం. సింపుల్ గా హాలునలంకరించాం. పుష్ప గుచ్ఛాలు పూలమాల ఒక శాలువ తెచ్చాం.పిల్లలు కొంతమంది,టీచర్లు సమావేశమయ్యాం.
ఆ రోజు కూడా ముతక ఖద్దరు దుస్తులు ధరించే వచ్చారు జోగినాధం మాస్టారు. తన ప్రక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టారు హెడ్మాస్టరుగారు .జోగినాధం మాస్టారి మెడలో పూల దండ వేసి శాలువ కప్పి చేతికి పుష్ప గుచ్ఛ మిచ్చారు.
“శ్రీ జోగినాధం మాస్టారు అత్త్యుత్తమ వుపాధ్యాయునిగా పురస్కారం అందుకోవడం మన స్కూలుకే గర్వకారణం.నిగర్వి,నిరాడంబరుడూ, నిజాయితీపరుదు యిన్ని ‘ని ‘ లని తనస్వంతం చేసుకున్న యితను నిస్వార్ధపరుడు కూడా.టీచరంటే యిలాగే వుండాలనిపించేలా అర్ధం చెప్పారు మనందరికీ.
ఈ సందర్భంగా యితన్ని సన్మానించడం మనని మనం సన్మానించుకున్నట్లే. యితని ప్రవర్తన బాహ్యంగా కనిపించినదానిక్ పూర్తిగా భిన్నం.మాట ఎంత కరుకో మనసు అంత వెన్న.

స్కూలు కార్యక్రమాలన్నింటిలోను సహాయపడుతూ ఏవి కొనాలన్నా ఎవరికీ అవకాశం యివ్వకపోతే ,మొదట్లో డబ్బులు మిగుల్చుకునేందుకా అని అపోహ చెందాను. కాని అది ఎంత తప్పో తరువాత తెలిసి వచ్చింది.కొనేటప్పుడు చౌకగా అమ్మేటప్పుడు లాభసాటిగా చేసి ఎంతో కొంత మొత్తం మిగిల్చి పేద విద్యార్ధులకు ధన సహాయం చేసేవారు
పాత పుస్తకాలకు బైండు చేయించి మరుచటి సంవత్సరంలో కొనుక్కోలేని విద్యార్ధులకు యిచ్చేవారు. మన స్కూల్లో అందమైన పూలతోట మాస్టారి అభిరుచే.మనం వృధా చేసే నీటిని వుపయోగించి పూలు పూసేలా చేయించారి.ఈ స్కూల్లో జోగినాధం మాస్టారు చాలా సంవత్సరాలనుంచి పని చేస్తున్నారు.నేను వచ్చిన ఆరు సంవత్సరాలలో ఆరు నెలలు అతనిని అపార్ధం చేసుకున్నాను.నెమ్మదిగా అతని ఆశయాలు ఆలోచనలు గ్రహించాక అతనికి అండగా నిలిచాను.
ఎవరేమనుకుంటారోనన్న జంకు లేదు. ప్రతివారు తన వెనుక విమర్శలు చేస్తున్నారని తెలిసినా లెక్క చేయక అతని ఆశయ సిధ్ధికై ముందడుగు వేస్తున్నారు.తనకంటూ ఎవరూ లేరని బాధపడుతూ కూర్చోక తన జీతంలో కొంత భాగం ఆదా చేస్తూ వచ్చారు.పేద విద్యార్ధులకై వినియోగించాలని అతని ఆశ.ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఆదా చేయగల నేర్పు జోగినాధం మాస్టారికే వుంది.
పై విషయాలన్నీ తెలిశాక జోగినాధం మాస్టారంటే ఏమిటో అందరికీ తెలిసిందనుకుంటాను.ఎవరికీ తెలియని విషయం మరొకతుంది. ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళి తన మరణానంతరం తన అవయవాలు యితరులకు వుపయోగించమని దాన పత్రం రాసి వచ్చారు.(కరతాళ ధ్వనులతో హాలు మారు మ్రోగింది) యీ పురస్కారం దొరకటం జోగినాధం మాస్టారికే కాదు మనందరికీ కూడా గర్వ కారణం .” అంటూ తన ప్రసంగం ముగించారు.

జోగినాధం మాస్టారు యోగిలా అంతా విన్నా చివరలో కనులు చెమర్చి పై కండువాతో తుడుచుకున్నారు. మిగతా టీచర్లు కూడా అంతకు ముందున్నా అభిప్రాయం మార్చుకుని జోగినాధం మాస్టారి సుగుణాలే నాలుగేసి మాటలు చెప్పారు. పిల్లల తరఫున నేను మాస్టారిపై వ్రాసుకొచ్చిన కవిత చదివాను.

జోగినాధం మాస్టారంటే పిల్లలకి హడల్
ముతక ఖద్దరు దుస్తులు
ముక్కు మీదకు జారే కళ్ళజోడులోంచి నిశిత ధృక్కులు
మాటేమో కరకు – పిల్లలకు అది వింటే ఒణుకు
తప్పు చేసినందుకు లేదు బాధ
మాస్టారు చూసి కేకలేస్తారేమోనన్న వ్యధ
యివన్నీ మాస్టారి బాహ్య రూపం
తన మంచితనం కనిపించనీయక గోప్యం
మంచి గంధపు సువాసనని అరికట్టలేనట్లు
మాస్టారి ఆశయాలకు లేవు ఆనకట్టలు
పిల్లలు,వారి విద్యాభ్యాసం వారి లోకం
స్కూలు పరిశుభ్రత వారి ప్రపంచం
మీ వద్ద నుండి దూరమైన తరువాతనే గ్రహించాం
మీ మాటల విలువ ప్రతి క్షణం
మీ వృత్తిలో వున్న అంకిత భావం
పొందింది అత్త్యుత్తమ వుపాధ్యాయ పురస్కారం
విన్న మేమంతా ధన్యులం
జోహారు జోగినాధం మాస్టారూ జోహారు
ఓపికగా విని అంతా అభినందించారు.హెడ్మాస్టరుగారు లేచి యిప్పుడు జోగినాధం మాస్టారు మాట్లాడతారు.
జోగినాధం మాస్టారు లేచి అందరికీ నమస్కరించారు. “నేను చేతలవాడినే గాని మాటలవాడినికాను.నేను ఏదో చేశానని భావించటం లేదు.యింకా ఏమేం గలనా అని ఆలోచిస్తున్నాను.నా ప్రియ శిష్యుడు సతీష్ నాపై తమకున్న అభిప్రాయం ,అభిమానం కవిత రూపంలో తెలియ జేశాడు, చాలా బాగుంది. హెడ్మాస్టరుగారు నా సహోద్యోగులు నాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞుడిని.నా దగ్గర వున్నంత వరకు నాశిష్యులు నాపై ఏ అభిప్రాయంతో వున్నా,నాకు తెలుసు యీ స్కూలు వదిలి బయట ప్రపంచంలో అడుగిడితే నా మాటల ప్రభావం పరోక్షంగా పని చేస్తుంది.
నాకు కావలసినది అదే! నా ముందు ముఖస్తుతి నాకొద్దు.యిక హెడ్మాస్టరుగారు చెప్పినట్లు నన్ను అపార్ధం చేసుకుందికే ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తారు.’నీటిని తేరిస్తే గాని పరిశుభ్రత తెలియదు,అలాగే నా ఆలోచల్ని ఆశయాలని తేర్చిచూస్తే గాని అందులో విలువ తెలియదు ‘.

నా విద్యాభ్యాసానికి ఒక దాత అజ్ఞాతంగా ధన సహాయం చేశారు.నేనూ పేద విద్యార్ధినే.అందుకనే పేదవిద్యార్ధులు ధన సహాయం లేక వంచింప బడకూదదు. అది నా ధృఢ సంకల్పం. నా సహోద్యోగులకు నా విన్నపం నెలలో ఒక రూపాయి అయినా దాచండి.ఎవరికి జీవితాన్ని ప్రసాదించడానికి వుపయోగపడుతుందో. యిక పోతే పారితోషికాలూ పొగడ్తలూ తాత్కాలికం మన ఆదర్శమే మనకి శాశ్వతం కావాలి! యింతకన్నా చెప్పడానికేమీ లేదు.యింత అభిమానంతో నాకు చేసిన యీ సన్మానానికి కృతజ్ఞుడిని.

యిన్ని సంవత్సరాల వుపాధ్యాయ వృత్తిలో వుత్తమ వుపాధ్యాయునిగా ఎన్నికవటం మాటలు కాదు జోగినాధం మాస్టారు చండశాసనుడే కాదు ఆల్ రౌండర్  కూడా.”హేట్సాఫ్ మాస్టారూ”  అని మనసులోనే జోహారులర్పించాను.జీవితంలో కొంత భాగం వృత్తికై వినియోగించే వాళ్ళుంటే, జీవితమే వృత్తిగా భావించేవాళ్ళు జోగినాధం  మాస్టారిలాంటివాళ్ళు.

ప్రశాంతాశ్రమం | Peaceful Home

మొదటి భాగం

డియర్  సత్యానంద్,hemingway_beard

నేను శివ ఎన్నో సంత్సరాల తరువాత నీకు లెటర్
రాస్తున్నాను.నీ అడ్రసు ఎలా దొరికిందా అని ఆశ్చర్య పోతున్నావు కదూ! క్రిందటి వారం మీ మేనల్లుడు కిరణ్ కనుపించాడు.ఇంటికి తీసుకువచ్చి నీ గురించి వివరాలడిగాను.నీవు యుఎస్ లో నీ కొడుకు వద్ద వుంటున్నావని చెప్పి నీ అడ్రసు యిచ్చాడు.నాకున్న ప్రోబ్లమ్స్ ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియక తికమక పడుతున్న సమయంలో నీ అడ్రసు దొరకడం వరంలా అనిపించింది.

పన్నెండేళ్ల క్రిందట ఒక పెళ్లిలో కలిశాం. అప్పుడు సెర్వీసులో వున్నాను.ముఫై సంత్సరాలు నార్త్ లో రైల్వేలో చేసిన నాకు అటువైపు సెటిలవడం యిష్టం లేక రిటైర్మెంటు ముందుగా ఈ చిన్న పాటి టౌనులో చిన్న యిల్లు ఏర్పరుచుకున్నాను.సంతానం లేని మా దంపతులం ప్రశాంతంగా శేష జీవితాన్ని గడుపుదామని ఆశపడ్డాం.కాని .ఇక్కడికి వచ్చిన నెల నుంచి నాకు మీనాక్షికి అర్ధమయింది శాంతంగా వుండటం అన్నది ఎంత అడియాసోనని. మాబ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు మా బంధువులు. రోజూ ఎవరొ ఒకరు రావటం అనాయాచితంగా సలహాలివ్వటం.ముసలి వయసులో యిద్దరే ఎలా వుంటారు? యిద్దరిలో ఏఒక్కరి అరోగ్యం దెబ్బ తిన్నా చూసేవాళ్లెవరు? బంధువులలోంచి ఒక జంటని చేరదీసి మా తదనంతరం ఆస్థి వారికి చెందేటట్లు రాస్తే చివరిదాకా మమ్మల్ని కంటికి రెప్పలాచూసుకుంటారని హామీలిస్తున్నారు.మా అవసాన దశలో ఎవరు చూస్తారో లేదో తెలియదు గాని ఈ వచ్చి వెళ్లేవాళ్లకి రోజూ వండి వార్చలేక మీనాక్షి పని అవుతోంది.

ఇన్ని సంవత్సరాలు మాది చాలా ప్లాన్డ్ బడ్జెట్ వుండేది ఇక్కడికి వచ్చాక పెన్షను డబ్బులు ఎలా ఖర్చైపోతున్నాయో తెలియటంలేదు సేవింగ్సు చేసినదాంట్లోంచి కూడా తీయవలసి వస్తోంది. వీళ్లందరినుంచి తప్పించుకుని దూరంగా నలుగురు స్నేహితుల మధ్య ఆశ్రమవాసుల్లా గడపాలనిపిస్తోంది.ఈ రాబందుల్లాంటి బంధువుల నుంచి కాపాడే నాధుడెవరో తెలియటం లేదు. ఇటువంటి బాదరబందీల నుండి దూరంలో హాయిగా వున్నావు.మా దగ్గర కొచ్చి మాతో గడిపి కలిగింది మతో కలిసి తిని బయటకు వెళ్లి మేము పిసినార్లమని యిద్దరికోసం కడుపు కట్టుకుని కూడపెడుతున్నామని యింటికి వచ్చిన వాళ్లకి సరిగా భోజనాలు కూడా పెట్టమని పోయేటప్పుడు మూట కట్టుకుపోతామా అంటూ పదిమందికి చెప్తూంటే ఆ మాటలు మా చెవినపడి చాలా బా ధ గా వుం ది.
కొత్తగా వచ్చే ఆదాయం లేదు పిల్లలు లేరు ఏలోటైనా సర్దుబాటు చెయ్యడానికి యివేవీ వాళ్ల వూహలోకి రావు ఈ వయసులో ఎవరిని చేరదీస్తే ఎవరు చేస్తారు కన్న పిల్లలమీదే ఆశపెట్టుకునే రోజులుకావు

.స్నేహితుడి గా ఏమైనా సలహా యిస్తావని యింత వివరంగా లెటర్ రాశాను.మీ అబ్బాయికి కోడలికి మా ఆశీస్సులు.మనుమలుంటే వారికి కూడా అశీస్సులు.నా టెలిఫోను నంబరు రాస్తున్నాను వీలయితే ఫోన్లో మాట్లాడితే నిన్ను చూసిన్సంత సంతోషిస్తాను.

ఇట్లు

శివకామయ్య

వుత్తరం పోస్టు చేసిన మూడోనాటినుంచి ఎదురు చూస్తున్నాను.కాని వుత్తరం చేరటానికే పదిరోజులు పట్టవచ్చు.అనుకున్నట్లుగానే పది రోజుల తరువాత ఫోను వచ్చింది,

“హలో శివా ఎలావున్నావ్? నీ లెటరు చదివాను.నీ బాధ అర్ధమయింది.నెలరోజుల్లో నేను ఇండియాకి వస్తున్నాను.మనం కలిసి ఈ ప్రాబ్లమ్ కోసంసొల్యూషన్ ఆలోచిద్దాం అంతవరకు ఓపికపట్టు. తాపీగా నిర్నయిద్దాం ఏంచెయ్యాలో”

.అమృతధారలు చెవిలో కురిసినట్లనిపించింది.చిన్నప్పటినుంచి ఏ సమస్య వచ్చినా సత్యానంద్ తో చర్చించడం,వెంటనే సలహా చెప్తే ఆ గొడవ తీరిపోవడం అలవాటు.మళ్లీ యిన్ని సంత్సరాల తరువాత నదిలో కొట్టుకుపోతున్న వాడికి ఆధారం దొరికినంత ఆనందం కలిగింది.నెల రోజులు మీనాక్షి నేను స్నేహితుని రాకకై ఎదురు చూస్తూ ఎన్నో అందమయిన కలలు కన్నాము.

“వాడు మనని టెన్షన్ తీసుకోవద్దన్నాడు ఎందుకు వూరికే ఆరాట పడటం?వెళ్లాక అన్నీ తెలుస్తాయి.అక్కడికి వెళ్లి వాళ్లకి నాలుగక్షింతలు వేసి ఆశీర్వదించి మన పెద్దరికం నిలబెట్టుకుందాం”అంటూ వూరడించాను.అక్కడికి వెళ్లాక తెలిసింది అమ్మాయి పేరు సీమా సారధితోనే పని చేస్తోందని.తోవపొడుగునా ఏమనుకున్నా అమ్మాయిని చూడగానే మనస్ఫూర్తిగా “పిల్ల బాగుందండీ చిదిమి దీపం పెట్టుకోవచ్చును” అంది.మమ్మల్ని పరిచయం చెయ్యగానే కాళ్లకి నమస్కరించి “నమస్తే మమ్మీజి నమస్తే పాపాజి”అంది.పెళ్లి బాగా జరిగింది.మర్యాదలు బాగా చేశారు. కోడలికి నల్లపూసల గొలుసు ఒక వుంగరం పట్టు చీర యిచ్చింది కాంతం.” నాకేమీ లేదా అమ్మా”అడిగాదు సారధి.”నీకో మొట్టికాయ వేస్తాను”అంటూ ప్రేమగా కొడుకుని కోడల్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీదముద్దు పెట్తింది.సారధికి పదివేలిచ్చాను ఎటైనా తిరిగి వస్తారని.మనింటికి రమ్మనలేకపోయారా?అంది కాంతం “వాళ్లెప్పుడు వస్తే అప్పుడే నీ ముచ్చటలన్నీ తీర్చుకో.అన్నలు దూరాన వున్నారు తమ్ముడికి పరీక్షలు ఎవరూ రాకుండానే పెళ్లి జరిగిపోయింది అనుకుంటూ యిద్దరం యింటి దారి పట్టాం.

గోపాలు అనుకున్నట్లుగానే ఎంబిఎ పూర్తి చేశాడు.ప్రయత్నాలేమి చేసుకున్నాడో గాని నెల రోజుల్లో దుబాయిలో జాయిన్ అవాలన్నాడు.”అయ్యో!నలుగురు పిల్లలూ పక్షులకు రెక్కలొచ్చినట్లు ఎగిరిపోతున్నారు.”ఎంతో అవేదనగా అంది కాంతం.రెక్కలొచ్చాక పక్షి పిల్ల ఎగరకపోతే తల్లి పక్షి గూట్లోంచి నెట్టేస్తుంది. కాబట్టి యిదేమీ ప్రకృతి విరుధ్ధంకాదు”అంటూ సర్ది చెప్పాను.గోపాలుకూడా దూరప్రాంతానికి వెళ్తున్నాడన్న చింత నాకూ వుంది నేనే అధైర్యపడితే కాంతం నిలదొక్కుకోలేదని గాంభీర్యం ప్రదర్శించాను.

యిక వారం రోజులకి వెళ్తాడనగా ఒక రోజు చీకటి పడుతుండగా గోపాలు యింకో అమ్మాయి మెడలో దండలతో గుమ్మంలో నిలుచున్నారు. తలుపు తెరిచిన నేను నోరు కూడా తెరుచుకుని వుండిపోయానని కొంతసేపటివరకు తెలియలేదు.వాళ్లని అక్కడే నిలబడమని లోపలికి వెళ్లి కాంతాన్నీ ప్రిపేరు చేశాను.”గోపాలు పెళ్లి చేసుకుని కోడలితో గుమ్మంలో నిలుచున్నారు. హారతిచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకురా కాంతం. ప్రస్తుతంఏమీ మాట్లాడకు లోపలికి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం సరేనా”.అంటూసిధ్ధం చేయించి తీసుకు వచ్చాను.

హారతి ఎర్రనీళ్లు సిద్దం చేసి తెచ్చింది.యిద్దరికీ హరతిచ్చి దిష్టి తీసి పోసి లోపలికి రమ్మంది.వచ్చి సోఫాలో కూర్చున్నారు.లోపలికి వెళ్లి చక్కెర్ తెచ్చి యిద్దరికీ కాస్త కాస్త నోట్లో వేసింది.నేను చల్లటి మంచినీళ్లు పెట్టాను.ఎదురుగా కూర్చుని కొడుకు ముఖంవైపే చూస్తూ “యిప్పుడు చెప్పు యింత హడావిడిగా పెళ్లి ఎందుకు చేసుకోవలసి వచ్చింది? ఎవరీ అమ్మాయి? నువ్వు చేసిన పని తప్పు అననుగాని మాకు చెప్పకుండా రహస్యంగా చేసుకున్నావు అది నువ్వు చేసిన తప్పు.వూర్లో నలుగురూ ఏమనుకుంటారు ఒక్కసారి ఆలొచించావా?ఒక్క ముక్క మా చెవిన వేసివుంటే యీ పెళ్లి మేమే చేసి వుందుంకదా.ఒక్క క్షణం నేను గాని నాన్నగాని గుర్తు రాలేదా?”ఆవేదన కన్నీళ్ల రూపంలొ బయటికి వచ్చింది.

ఆమె మాటలకి అందరి కళ్లలో కన్నీరుబికింది.యిద్దరూ కాళ్లకి నమస్కరించారు. గోపాలు చెప్పాడు.అమ్మాయి పేరు వసుధ తనతో ఎంబిఎ చేసిందని పెళ్లి చేసుకుందామన్న నిర్నయం రెండేళ్ల క్రితమే చేసుకున్నారని,వేరే కులం కావటంనుంచి అమ్మాయి తలితండ్రులు యిష్టపడలేదని దుబై ప్రయాణం సడన్ గా రావటంతో నలుగురు స్నేహితులసమక్షంలో వేణుగోపాలస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుని అట్నుంచి రిజిష్టారాఫీసుకెళ్లి ఫార్మాలిటీ పూర్తి చేసుకుని వచ్చామని చెప్పాడు”. ఆమె తరఫువాళ్లు కాదన్నా మీరు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో తీసుకువచ్చాను.క్షమించండి వాళ్లవాళ్లు కాదన్న దగ్గరనుండి ఏడుస్తూనేవుంది.ఎన్నో కేసులు పరిష్కరించిన మీరు యీ చిన్న కేసు పరిష్కరించలేరా నాన్నా?”

“నా వృత్తి మీద నీకు గౌరవంలేదు గాని నీ సమస్య పరిష్కరించాలంటే నన్ను నా వృత్తిని అడ్డం వేసుకుంటావా?” నవ్వుతూనే ఛురకవేశాను .” మమ్మల్ని యింత వాళ్లని చేసిన మీరంటే ఎంతో గౌరవం భూదేవిలాటి అమ్మంటే కొండంత ప్రేమ.ఏం చెయ్యాలి యిది మా జీవితం”.”ఎంత మాటకారివయావురా!మాకు మీ యిద్దరిమీద కోపం లేదు చెప్పకుండా చేశారన్న బాధతప్ప.సరే యిదేమీ సమస్యకాదు.సమాజంలో యిటువంటి సంఘటనలు సర్వ సాధారణం .చింతపడకండి నేను చూసుకుంటాను”. రాత్రికి రాత్రి స్నేహితులకి బంధువులకి ఫోన్లు చేసి మా అబ్బాయి వివాహం జరిగిందని ఆదివారం సాయంత్రం రిసెప్షను యిస్తున్నాను తప్పక రమ్మని చెప్పాను.రిసెప్షనుకి వచ్చినవాళ్లంతా ఆశ్చర్యం ప్రకటించారు.క్లోజ్ ఫ్రెండ్సు మా ఔదార్యాన్ని పొగిడారు.కాంతం చాలా హుందాగా వ్యవహరించింది. ఏమయితేనేం చిన్నవాడి పెళ్లి ముచ్చటకూడా కొంత తీరింది.మూడు రోజుల తరువాత వాళ్లిద్దరూ దుబయి వెళ్లిపోయేరు.మాకున్న బాధ్యతలు పూర్తయాయి.మళ్లీ మా రొటీను మాకు మిగిలింది.

జీవితంలో ఏదో చెయ్యవలసిన పని మిగిలి వుంటే ఆ జీవితం నడక లక్ష్యంతో కొనసాగేది.పిల్లలంతా ప్రయోజకులయారన్న సంతోషం తప్ప వుత్సాహం తగ్గింది.నాకంటే కోర్టు కేసులు మనుషుల మధ్య గడిచేది.సాయంత్రం వరకు కాంతం యింటి పనులు దేముడి పూజ తప్ప వేరే వ్యాపకం పెట్టుకునేదికాదు.సాయంత్రాలు తప్పని సరిగా తనదగ్గరే కూర్చుని ఏవో కబుర్లు చెప్తూ నాకేదో తినాలని వుందని చేయించుకుని ఒకపూటయినా తనని బిజీగా వుంచేవాడిని.పిల్లలు వారానికోసారి పదిహేను రోజులకోసారి ఫోన్లో మాట్లాడేవారు.

పెద్దవాడి వద్దనుంచి శుభసమాచారం వచ్చింది కోడలు నెలతప్పిందని. యిక కాంతం కాలు భూమి మీద నిలవ లేదు ఆ రోజు మైసూరుపాక్ చేసి పాలవాడు పనిమనిషితో సహా స్వీటు చేతిలో పెట్టి పెద్ద కోడలు విశేషం అంటూ చెప్పింది.అమ్మాయి తలితండ్రులు అమెరికాలోనే వుండటంతో మా సహాయం అవుసరమవలేదు.అబ్బాయి పుట్టాడని ఫోను వచ్చింది.”మన వంశోధ్ధారకుడిని చూడటానికే లేదా ? యిదేం దురదృష్టమండీ?”అంటూ వాపోయింది.సమయం వచ్చినప్పుడు వెళ్దాం మన పిల్లల కుటుంబాలని చూసి వద్దాం అంతవరకు ఓపిక పట్టమని నచ్చచెప్పాను.

“పోనీ సారధిని ఒక సారి రమ్మనండి కాలేజీకి శలవలుంటాయికదా!ఆ అమ్మాయిని కలలో చూసినట్లే అనిపించింది”.”నీ కోడళ్లంతా కలలో కనిపించే వాళ్లే ఎవరు నాలుగు రోజులు వున్నారు కనుక?ఫోను చేస్తాను రమ్మని. అన్నాను. వాడి జవాబు విన్నాక ఎందుకడిగానా అనిపించింది. యిక్కడికి వస్తే వేడి తట్టుకోలేరుట తన భార్యతో మాట్లాడటానికి మాకు హిందీ రాదని మా యింటి వాతావరణంలో ఆ అమ్మాయి కంఫర్టబుల్  గా వుండదని చెప్పాడు. వాడు చెప్పిన కారణాలు యథాతధంగా కాంతానికి చెప్తే గుండె పగిలిపోతుందని “వాళ్లకిప్పుడు రావటానికి వీలుకాదుట తరువాత వస్తామన్నారు మనమే ఎటైనా తిరిగి వద్దామా?కాస్త మార్పుగా వుంటుంది”.అన్నాను. వద్దంది మనసులో లేని వుత్సాహం ఎటో వెళితే వస్తుందా? అనవసరంగా హైరానా పడటమెందుకు?

యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి. కాంతం పైకి చెప్పటంలేదుకాని లోలోపల క్రుంగిపోయేది. పెద్దవాడికి చెప్తే అమ్మని మంచి డాక్టరుకి చూపించి బలానికి టానిక్ యిప్పించమన్నాడు. డాక్టర్లకి మందులగురించి తప్ప మనసులగురించి తెలియదనిపించిది. సురేష్ తో మాట్లాడేను.”మా జీవితాలు ఎంత బిజీ అంటే పని చెయ్యడానికే జీవిస్తున్నట్లుంది కాని జీవితంగడవడానికి పని చేస్తున్నట్లు లేదు.మీకు కావలిసినంత తీరిక సమయం వుందికాబట్టి యిన్ని ఆలోచనలు పెట్టుకుంటారు. యిద్దరూ ప్రశాంతంగా వుండండి అన్నీ సర్దుకుంటాయి”అంటూ సలహా యిచ్చాడు.

ఒకరోజు కూర్చుని కాంతానికి బోధపరిచాను”మనకి అన్న వస్త్రాకి లోటులేదు.పిల్లలంతా వృధ్ధిలోకి వచ్చారు.పెళ్లిళ్లు చేశాం మనుమడు పుట్టాడు యింకా ఏదో వెలితి ఫీలవుతున్నావు ఏమిటి నీ బెంగ?అనడిగాను.”మనిద్దరం యిలా దిక్కుమాలిన పక్షుల్లా వుంటూ కొడుకన్నవాడు దగ్గరలేకుండానే దాటిపోతానేమో అనిపిస్తోంది”అంటూ కళ్లు తుడుచుకుంది.ఒక్కసారి వెన్నులోంచి వణుకు వచ్చింది.నిజమే కాంతం భయంలో యదార్ధముంది.కాని చేయగలిగిందేమీ లేదు.అమెరికాలో వున్న యిద్దరన్నదమ్ములూ కూడబలుక్కుని సీజను చూసి తమవద్దకు మూడేసి నెలలకోసం రమ్మనిపిలిచారు. పాస్ పోర్టులు వీసాలు మనుమడు పుట్టినప్పుడే రెడీ చేసి వుంచాను ఎప్పుడయినా వెళ్లవచ్చునని.మనుమడు మూడేళ్లవాడయాక అవకాశం వచ్చింది.పదిరోజులలో ప్రయాణం,పిల్లడికోసం ఏవేవో కొంది.కొడుకులకిష్టమయినవి కొన్ని చేసిపట్టుకుంది.ఆఫీసుపని తాతారావుకు అప్పగించి బయలుదేరాం.
ముందుగా పెద్దవాడున్న ప్రదేశానికి వేళ్ళాం.ఎయిర్ పోర్టుకి వచ్చి యింటికి తీసుకువెళ్లాడు.ఆ రోజు ఆదివారం అందరూ యింటిలో వుండటంతో బాగానే అనిపించింది.చంటివాడికోసం చేతులుజాచింది కాంతం.వాడు సిగ్గుగా వాళ్ల అమ్మవెనుక దాక్కొన్నాడు.రెస్టు తీసుకుని లేచాక ఏవి ఎక్కడ వున్నాయో ఎలా వుపయోగించాలో చెప్తుంటే ఏమిటిదంతా అనుకున్నాను.మర్నాడు తెలిసింద్ తెల్లవారేసరికి వంట టిఫిను తయారుచేసుకుని పిల్లాడిని తయారుచేసి చెరోకార్లోని వెళ్లారు.పిల్లాడిని బేబీ కేర్ లో దింపి హాస్పిటల్ కి మాలతి వెళ్లింది వెళ్తూ వెళ్తూ “అత్తయ్యగారూ అన్నీ సిధ్ధంగా వున్నాయి మీకు తినాలనిపించినప్పుడు వేడి చేసుకుని తినండి అన్నం చల్లారిపోతుందని వండలేదు,టైము చూసుకుని బియ్యం పెట్టుకోండి.దేనికీ మొహమాటపడకండి.భోజనం చేసి రెస్టు తీసుకోండి”అంది.”సాయంత్రం ఎన్ని గంటలకి వస్తారమ్మా?”అడిగింది కాంతం.సాయంత్రం ఎక్కడ రాత్రి ఎనిమిది దాటుతుంది”అంటూ కారు స్టార్టు చేసింది.ఇక్కడా మేమిద్దరమే.ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. మర్నాడు “చంటివాడిని వుంచేస్తే బాగుంటుంది మాయిద్దరికీ కాలక్షేపం”అన్నాను.”నాన్నా మీరుండే మూడు నెలల కోసం వాడి రొటీను మారిస్తే తరువాత మాకిబ్బంది”అన్నాడు రమేష్. శలవరోజులు వస్తాయి ఆ సమయంలో బండెడు పనులు వాళ్ల బిజీలో వాళ్లుంటే “ఏమయినా చేసేదమ్మా” అని వెనుక వెళితే ” మీరు పెద్దవాళ్లు మీరు రెస్టు తీసుకోండి మాకివన్నీ అలవాటే” అనగానే చిన్నబుచ్చుకుని నాపక్కన కూర్చునేది కాంతం. “మన వూళ్లోనే బాగుందండి పాలవాడు పనిమనిషి పేపరువాడు చాకలి అప్పుడప్పుడు యిరుగుపొరుగు వాళ్లు మాట్లాడటానికి వుంటారు.కొన్నాళ్లయితే మాట్లాడటం మరిచిపోతామేమో”.మూడునెలల్లో చుట్తుప్రక్కల ప్రాంతాలు చూపించాడు బాగానే గడిచిపోయింది.

సురేష్ వచ్చి తనున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు.కాంతం ఆశపడింది శ్యామల మావూరమ్మాయి అక్కడ తనకి కాస్త ఫ్రీగా అనిపించవచ్చని.రెండు రోజులలో అదీ అడియాసే అనిపించింది.వీళ్ల దినచర్య వాళ్లకి భిన్నంగా లేదు.సాయంత్రంఏడు గంటలకి యిల్లు చేరితే అరగంత తినడానికి త్రాగటానికి కేటాయిస్తారు.సురేష్ లేప్ టాప్ మీద పని చేసుకుంటూంటే శ్యామలకి చదువు కొద్దిగా మిగిలిందని రాత్రి పదకొండు గంటలవరకు కూర్చునేవారు.మమ్మల్ని భోజనాలు టైముకి తినేయమని వాళ్లు లేటుగా తినేవారు.శని ఆదివారాలొస్తే కూరలు సాంబారు ఎక్కువగా చేసి ఫ్రిజ్ లో పెట్టుకుని రోజూ కొద్ది కొద్దిగా వెచ్చపెట్టుకుని తినడం,

“నేనున్నాను కదా శ్యామలా రోజూ కూర చేస్తాను యింత కష్టపడి వారం రోజులకోసం ఒక్క సారి చేసుకోవడం ఎందుకని అడిగింది”మాకు యివన్నీ అలవాటే ,మీరిలా అలవాటు చేస్తే మీరెళ్లాక చేసుకోలేకపోతాను”ఈ మాట విన్నాక వూరుకుంది కాంతం.పగలంతా ఆగిన్నె యిటు పెట్టి పుస్తకం తిరగేసి ఆగదిలోంచి ఈ గదిలోకొ తిరుగుతూ గడిపేది.

నెల రోజులయేసరికి కాంతం పూర్వంలా తిరగలేకపోతోంది. రాత్రి పడుకున్నప్పుడు వూపిరి తీసుకోవడం కష్టంగా వుంది.చలిఎక్కువగావుండెను. కండిషన్ రమేష్ తో మాట్లాడితే వాతావరణం మార్పునుండి కంగారుపడవలసినదేమీ లేదని సురేష్ ని ఏవో మాత్రలు కొని వేయమని చెప్పాడు.యిక కాంతానికి సహనం పోయింది.”యిక్కడికెందుకొచ్చామో అర్ధం కావటం లేదు. వీళ్ల బాధలు చూడలేకపోతున్నాను ఇంకా రెండు నెలలు గడపాలంటే నా వల్లకాదు. యింత కష్టపడి పని చేసి వేడిగా ఎప్పటికప్పుడు యింత వండుకు తినలేని బ్రతుకేమిటండీ యీ వయసులో కొత్త ప్రాంతాలు చూడాలన్న అసక్తి నాకయితే లేదు. యింత కష్టపడి పనిచేసి వేడిగా ఎప్పటికప్పుడు వండుకుని తినలేని బ్రతుకేమిటండీ?”అంటూ గోల చేసింది.కొడుకుతో శాంతంగా చెప్పింది “నాయనా మీరెంచుకున్న జీవితం మీ పధ్ధతిలో జీవించండి. మిమ్మల్ని చూడాలనుకున్నాం చూశాం.యికపై మీకు వీలున్నప్పుడు మావద్దకు రండి.యింకిక్కడ వుండలేను మా ప్రయాణానికి ఏర్పాటు చెయ్యి”ఖచ్చితంగా చెప్పింది.మరుచటి వారానికి టిక్కట్లు అరేంజయ్యాయి.రోజూ రాత్రి యిబ్బంది పడుతూనే వుంది.అమెరికా వెళ్లేముందు ఎంత సంబరపడిందో తిరిగి వస్తూ అంత నిర్లప్తంగా నిరాసక్తంగా వుంది.

ఫ్లయిటు కూర్చున్నాం యిరవైనాలుగు గంటల్లో మా వూరు చేరుతామన్న వూహే నాకు రిలీఫ్ అనిపించింది. కాంతం ఏమీ తినడానికి తాగడానికి యిష్టపడలేదు. పోనీ బిస్కట్లు తిను అన్నా “ఏమీ వద్దు చేరే వరకు కళ్లు మూసుకుని కూర్చుంటాను వూరికే అవస్థ పెట్టకండి”అంటూంటే ,యిక్కడికి వచ్చిన దగ్గరనుండి కలిగిన మానసిక అలజడి సర్దుకోనీ అని వూరుకున్నాను.యిరవై గంటల ప్రయాణం గడిచింది.

నిద్రపోతున్న నన్ను కుదిపింది కాంతం వూపిరి తీసుకుందికి కష్టంగావుంది.పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా వుండెను.ఎయిర్ హోస్టెస్ ని పిలిచాను ఆమె చూసి ఆక్సిజన్ మాస్క్ పెట్టింది.పావుగంట తరువాత శాంతించింది”.నిద్రపట్టింది యిక ఫరవాలేదు, మూడు గంటల్లో చేరిపోతాము డిస్టర్బ్ చెయ్యకండి” అంది

.కాంతానికి షాల్ కప్పి కూర్చున్న నాకు ఆమె నిద్రలోకి కాదు దీర్ఘ నిద్రలోకి జారిపోయిందని గ్రహించలేకపోయాను. దిగే సమయంలో సామాన్లు తీయాలని బెల్టు వూడదీసి “లేస్తావా కాంతం”అన్నాను సగం శరీరం వాలిపోయింది.అందరూ దిగే హడావిడి,ఏం చెయ్యాలో అర్ధంకాక తిన్నగా కూర్చోపెట్టి ముక్కుదగ్గర వేలుపెట్టి చూశాను.గాలి ఆడుతున్న సూచన లేదు.కొంత ఖాళీ అయాక ఫ్లైటు స్టాఫ్ కి తెలియజేశాను పరిస్థితి.స్ట్రెచరు తెచ్చి బయటకు తీశాక డాక్టరు వచ్చి పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు.తాతారావుకి విషయమంతా చెప్పాను. రంగనాధం తాతారావు మరో యిద్దరు స్నేహితులు వచ్చి యిల్లు చేర్చారు. వెళ్తున్నప్పుడు యిద్దరం నడుచుకుని వెళ్లాం వస్తున్నప్పుడు భుజాలమీద తీసుకు రావలిసి వచ్చింధి.స్నేహితుడు వియ్యంకుడు అయిన రంగనాధం ప్రక్కన అండగా నిలుచున్నాడు.

పిల్లలకి కబురు వెళ్లింది.అమెరికానుంచి పిల్లలు వచ్చే ప్రసక్తిలేదు. సారధి రెండో రోజుకి చేరాడు గోపాలు వాతావరణం బాగుండక మూడో రోజుకి వచ్చాడు.ఆమె కొడుకుల్ని చూడలేకపోయినా ఆమె శరీరాన్ని కొడుకులు చూశారు.చేయవలసినవి యాంత్రికంగా జరిగిపోయాయి. వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లారు. ఎప్పుడు రావాలనిపిస్తే తమవద్దకు రమ్మని చెప్పి వెళ్లారు. నా పరిస్థితి వూహించుకోలేకపోయాను.

కాంతం ఎందుకలా పిల్లలు అంటూ కలవరించిందో అర్ధమయింది.ఈ వయసులో వంటరి జీవితం దుర్భరం.తాతారావు చిన్నవాడే తనభార్య యిద్దరు పిల్లల్ని తెచ్చి మా యింటిలో వుంచి నాకు ఒంటరితనం అనిపించకుండా పిల్లల్ని నా చుట్టూ తిరిగేలా చేసి భోజనసదుపాయం చూశాడు.ఒక వారం చూశాక అనిపించింది ఈ పని కాంతం వుండగా చేసి వుంటే తను బ్రతికి వుండేదేమో.తిరుణాలలో చేయి విడిపోయి తప్పిపోయిన పిల్లలా వెళ్లిపోయింది.ఎప్పటికీ పిల్లలు వాళ్ల కుటుంబాలతో వాళ్ల వుద్యోగాలతో వుక్కిరిబిక్కిరి అయేవాళ్లే గాని నాలాటివాడికోసం టైము కేటాయించలేరు.ఈ వేడి తగ్గాక తాతారావు కూడా తనదారి చూసుకుంటాడు.యింకేదయినా మార్గం ఆలోచించాలి అనుకుంటున్న సమయంలో ఈ ప్రశాంతాశ్రమం అడ్వర్టైజ్ మెంటు చూసి సంప్రతించాను. యిక్కడికి చేరడానికి కారణాలు యివి.

అతని కధ మొత్తం వుగ్గబట్టుకుని విన్నారందరూ. కొందరికయితే కనులు చమర్చాయి.శ్రీనివాసరావు లేచి మాట్లాడటం మొదలు పెట్టారు.నేడు ఈ వృధ్ధాశ్రమాలు చాలా స్తాపించబడుతున్నాయి. దేశకాల పరిస్థితులను బట్టి భార్యా భర్తలిరువురూ వుద్యోగం చెయ్యకపోతే గడవని పర్థితి కొందరికీ వూపిరిసలపని దినచర్య పిల్లల చదువులు వీటన్నిటినీ మనం సమస్యలని అనుకోలేం. ప్రతి వృధ్ధ వ్యక్తి యిలా ఆశ్రమాల్లో చేరడం సంభవమేనా ఆలోచించండి.

మన దేశంలో వుమ్మడి కుటుంబాలకి యిప్పటికీ గౌరవం వుంది.అందులో కొన్ని యిబ్బందులుండవచ్చు,సదుపాయాలు కొన్ని వుండవచ్చు.గుణదోషాలన్నవి అన్నింటా వుంటాయి.అడ్జస్టయే మనస్తత్వం పిల్లలకు పెద్దలకూ సమంగా వుండాలి.మనలో సగం మంది పిల్లలు విదేశాలలో వుండి పెద్దలు యిబ్బందులకు గురవుతున్నారు. వారికిటువంటి ఆశ్రమాలు తప్పదు. కాని పరిస్తితులు అనుకూలంగా వున్నా పిల్లలు మనని చక్కగా చూసుకుంటున్నా మన స్వేచ్ఛకి భంగం వాటిల్లిందని భావించి పిల్లల్ని వదులుకుని ఆశ్రమాల్ని నమ్ముకోవడం అంత భావ్యంకాదేమో ఆలోచించండి. విధి వక్రించి జీవితాలని అస్తవ్యస్తం చేసిన పరిస్తితులలో తప్పనిసరిగా ఆశ్రమాలని ఆశ్రయించండి.స్కూళ్లని కాలేజీలని ప్రోత్సహించినట్లు అనాధాశ్రమాలని వృధ్ధాశ్రమాలని ప్రోత్సహించలేం.అయితే యిటువంటివి తప్పనిసరి పరిస్తితుల్లో తీసుకోవలిసిన నిర్నయాలు.మీరంతా పెద్దలు మంచి చెడ్డలుఆలోచించగలవారు.

ఎవరయినా బిడ్డల వద్దకు వెళ్లాలన్న వుద్దేశం కలిగిననాడు అనవసరమైన అభిమానంతొ వెనుకడుగు వేయకండి.క్షమించండి సత్యానంద్ గారూ మీ ఆశ్రమాన్ని నిరుత్సాహపరుస్తున్నాననుకోకండి. వృధ్ధాశ్రమాల ప్రారంభోత్సవంనాటికన్నా అవి మూతపడిననాడు ఎక్కువ సంతోషిస్తానన్న మహాత్మ గాంధిగారి మాటలు గుర్తుకివచ్చి పై మాటలు చెప్పాను.తప్పనిసరిగా చేరిన మీరంతా సంతోషంగా సోదరభావంతో మెలగాలని మీ అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా వుండాలని భగవంతుడిని కోరుతూ ముగిస్తున్నాను నాకు మాట్లాడే అవకాశమిచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.

పిల్లలూ! సత్యనారాయణగారి కధ నా మాటలు విన్నాక భవిష్యత్తులో పెద్దలతో ఎలా మసలుకోవాన్నది నేర్చుకోండి.వ్యాసాలు రాసి మర్కులు తెచ్చుకోవడంకాదు,పెద్దలని అర్ధంచేసుకుని వారి ఆశీస్సులు పొందండి”. అందరూ సరదాగా భోజనాలు చేసి కార్యక్రమాన్ని ముగించారు.

English translation

Part 1

hemingway_beard

Dear Satyananda,

Hi I am Shiva. It has been a long time since I wrote a letter to you. You must be surprised how I managed to get your address. Well,  a week ago, I met your niece, Kiran, at the market. He told me that you stay in America with your son and also gave me your address.  It came to me as a blessing in disguise, for I am in the midst of problems that I can’t understand whom to share with.

Twelve years back when we met at a wedding, I was in service. Then, after having served the Railways in North India for thirty years, I wished to spend my retired life peacefully at my home town. I bought a small house there. As you know, I don’t have children, all my wife and I wanted was to lead a quiet and undisturbed life. But, within one month of coming here, Meenakshi (my wife) and I, realised how impossible that was. Almost everyday, we have distant relatives coming over to our house, giving free advice on how children are the only support system in old age and hence our life is incomplete without them. Some even suggested we adopt a young couple or an adult to look after us and act as our inheritors. But I am sure you would agree, in this day and age, when it is becoming difficult to trust even biological children, how do I trust a stranger to care for us?

Moreover, the visitors not only waste our time, they also take full advantage of our hospitality only to go out and spread rumours that we are stingy misers who don’t even treat their guests properly. We always led a simple and restrained life and believed in living by a fixed budget. But now, after retirement, because of these unwanted guests and their ever increasing demands, we have even exhausted our savings. We are deeply hurt and pained by their behaviour. The one thing we so craved is now being denied to us by these people. This situation has even forced me to think of going away  to an ashram (hermitage)! I sometimes envy you as you are far away from all this mess. I have approached you for every problem since childhood and you always gave me good advice. I sincerely hope you help me this time too.

Blessings to your son and daughter and to your grandchildren. if any.I am also including my phone number at the end of this letter. Please call me as soon as you receive this letter. Looking forward to hearing your voice.

                                                                                                       Yours lovingly,

                                                                                                        Shivakamayya

 It has been only three days but I am already expecting the phone call. Of course I know it takes more than ten days for the letter to reach U.S.!

After ten days, as expected, the phone rang.

Hello Shiva, how are you? I got your letter. I can understand your problem. I will be  coming to India in a month. We will then discuss the solution in depth. Don’t take any decision in haste. We will both decide with a cool head. Have faith and keep patience. Bye.

My friend’s words felt like sweet nectar to my parched ears. His advice was something I sought and followed even in childhood. The joy on hearing his voice after so many years was like that of a man being rescued after being mercilessly lashed by a mighty river.

My wife and I were eagerly awaiting Satyananda’s arrival.

To be continued…